ICC WTC 2025 final: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ – ఆస్ట్రేలియా {ICC WTC 2025 final} జట్ల మధ్య గబ్బా వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ నాలుగవ రోజు ఆట కొనసాగుతోంది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 445 పరుగులకు ఆల్ అవుట్ అయింది. అనంతరం బ్యాటింగ్ కి దిగిన భారత జట్టు మరోసారి నిరాశపరిచింది. నాలుగో రోజు మ్యాచ్ లో కేఎల్ రాహుల్ తన బ్యాటింగ్ తో జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. కానీ సెంచరీ దిశగా కొనసాగుతుండగా.. 84 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు.
Also Read: Travis Head Captaincy: టీమిండియాపై రెచ్చిపోతున్న హెడ్ కు బంపర్ ఆఫర్ !
ప్రస్తుతం టీమిండియా 201 పరుగులు చేసి 7 వికెట్లను కోల్పోయింది. మహమ్మద్ సిరాజ్ (1*), రవీంద్ర జడేజా (65*) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. ఇక ఈ టెస్ట్ మొదలైనప్పటినుండి వరుణుడు ఆటంకం కలిగిస్తూనే ఉన్నాడు. నాలుగో రోజు కూడా వర్షం కారణంగా {ICC WTC 2025 final} ఆటని పలుమార్లు నిలిపివేశారు. అయితే ఈ మ్యాచ్ డ్రా అయ్యే సూచనలు ఎక్కువగా కనబడుతున్నాయి. భారత జట్టు డబ్ల్యుటిసి ఫైనల్ చేరాలంటే ఆసీస్ తో ఆడాల్సిన మూడు మ్యాచ్ లలో గెలిచి తీరాలి.
అందువల్ల గబ్బా టెస్ట్ లో గెలుపు టీమిండియా కు అనివార్యంగా మారింది. ఒకవేళ ఈ మ్యాచ్ {ICC WTC 2025 final} వర్షం కారణంగా డ్రా అయితే డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలపై ప్రభావం చూపుతుంది. ఒకవేళ ఈ మ్యాచ్ డ్రా గా ముగిస్తే.. తదుపరి 2 మ్యాచ్ లలో భారత జట్టు విజయం సాధించాల్సి ఉంటుంది. ఆఖరి రెండు మ్యాచ్ లలో భారత జట్టు విజయం సాధిస్తే ఈ సిరీస్ ని 3-1 తో కైవసం చేసుకుంటుంది. దీంతో ఎలాంటి సమీకరణాలు అవసరం లేకుండా ఫైనల్ చేరుతుంది.
అలా కాకుండా చివరి 2 మ్యాచ్ లలో ఒక్క మ్యాచ్ ఓడిపోయినా.. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. అలాగే తదుపరి రెండు మ్యాచ్ లలో భారత్ ఒక మ్యాచ్ గెలిచి ఇంకొకటి డ్రా చేసుకుంటే ఈ సిరీస్ ని 2-1 తో కైవసం చేసుకుంటుంది. అలా జరిగితే ఆస్ట్రేలియా – శ్రీలంక మధ్య జరిగే టెస్ట్ ఫలితం పై ఆధారపడాల్సి ఉంటుంది. టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ {ICC WTC 2025 final} చేరాలంటే ఆస్ట్రేలియా తో జరిగే రెండు టెస్ట్ ల సిరీస్ లో శ్రీలంక కనీసం ఒక్క మ్యాచ్ అయినా గెలవాల్సి ఉంటుంది.
అయితే ఈ సిరీస్ జనవరి – ఫిబ్రవరి మధ్య జరగబోతోంది. ఒకవేళ ఈ టెస్ట్ సిరీస్ 2 – 2 తో సమమైతే.. అనగా చివరి రెండు టెస్ట్ లలో ఆస్ట్రేలియా ఒక్క మ్యాచ్ గెలిచినా భారత్ దయాది పాకిస్తాన్ పై ఆధార పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పాకిస్తాన్ – సౌత్ ఆఫ్రికా మధ్య జరిగే టెస్ట్ సిరీస్ లో పాకిస్తాన్ 2-0 తో గెలవాల్సి ఉంటుంది. అలా జరిగితేనే భారత్ ఫైనల్ చేరుతుంది. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్ లో ఇండియా 57.29 పాయింట్స్ తో మూడో స్థానంలో ఉంది. టాప్ టు లో సౌత్ ఆఫ్రికా (63.33), ఆస్ట్రేలియా (60.71) జట్లు ఉన్నాయి. ఇప్పుడు మిగతా రెండు టేస్టులు గెలిస్తే భారత జట్టు పాయింట్స్ ఆసిస్ కంటే మెరుగవుతాయి.