Gmail Vs Xmail : ఎలక్ట్రిక్ వాహనాల నుండి ప్రైవేట్ అంతరిక్షం వరకూ ఎలన్ మస్క్ మార్కే వేరు. ఇప్పటికే తన రంగాల్లో దూసుకుపోతున్న ఈ టెక్ దిగ్గజవేత్త తాజాగా మరో సంచలనానికి తెర తీయటానికి సిద్ధమవుతున్నాడు. టెక్ మాగ్నెట్ X ప్లాట్‌ఫారమ్ సహాయంతో “Xmail” అని పిలవబడే కొత్త ఈమెయిల్ సర్వీస్ ను అభివృద్ధి చేయడాన్ని సన్నాహాలు చేస్తున్నాడు. ఇది జీమెయిల్ కు పోటీగా రానుందనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి.
Xmail అంటే ఏంటి? –
నిజానికి ఈ Xmail టాక్ ఒక్క ట్వీట్‌తో బయటపడింది. ఓ ఎక్స్ వినియోగదారుడు “మెయిల్ బాగుంది” అని ట్వీట్ చేయగా.. దానికి సమాధానమిస్తూ “ఇది చేయవలసిన పనుల జాబితాలో ఉంది” అంటూ మస్క్ రిప్లై ఇచ్చారు. దీంతో త్వరలోనే Xmail అందుబాటులోకి రాబోతుందని టాక్ జోరందుకుంది. అయితే దీని కోసం మస్క్ ఇప్పటికే పలుమార్లు సైతం హింట్స్ ఇస్తూ వచ్చారు. “everything app” ను సైతం తీసుకురానున్నట్లు తెలుస్తుంది.
ఈ “everything app” చైనాకు చెందిన WeChat ప్లాట్‌ఫారమ్ ప్రేరణతో రాబోతున్నట్లు తెలుస్తుంది. సందేశాలు పంపటం, చెల్లింపులు, సోషల్ నెట్‌వర్కింగ్ తో పాటు అన్ని పనులను ఈ యాప్ చేయగలుగుతుంది. ఇలా “everything app” ను తీసుకువస్తే, దాన్ని ఎక్స్ కు ఈ మెయిల్‌ను జోడించడం తేలికవుతుందని మస్క్ ఆలోచిస్తున్నట్లు సమాచారం.
జీమెయిల్ ను దెబ్బతీసే దిశగా ఎలన్ మాస్క్ ఈ ఎక్స్ మెయిన్ ను తీసుకురాబోతున్నట్టు తెలుస్తోంది. నిజానికి జీమెయిల్ తో పాటు ఔట్ లుక్ వంటి ప్రముఖ ఫ్లాట్ఫామ్స్ అన్నీ అభివృద్ధి చెందటానికి ఎన్నో ఏళ్ళు పట్టింది. మరి ఇప్పుడు వచ్చే ఎక్స్ మెయిల్ వాటిని తట్టుకొని నిలబడుతుందా అనేది చూడాలి. అయితే ఇప్పటివరకూ ఎలన్ మస్క్ ఈ ఎక్స్ మెయిల్ పై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఎప్పుడు రాబోతుంది.. దానిలో ఉండే ఫీఛర్స్ ఏంటి అనే విషయాలు చెప్పలేదు. అయితే ఈ మెయిల్ సాంకేతికతతోనే ఎక్స్ మెయిల్ పనిచేసే అవకాశం ఉందని మాత్రం టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ప్రస్తుతం ఈ మెయిల్ పనిచేసే ఫీచర్స్ తోనే ఈ ఎక్స్ మెయిల్ రాబోతున్నట్టు తెలుస్తోంది. మరిన్ని ఫీచర్స్ ను ఎక్స్ మెయిల్ లో అభివృద్ధి చేసే ఆలోచనలో ఎలాన్ మస్క్ లేనట్టే తెలుస్తుంది. అయితే ఇందులో సింపుల్ ఇంటర్‌ఫేస్, ప్రైవసీ సెంట్రిక్ ఫీచర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్, ఎక్స్ ఎకో సిస్టమ్ తో రానున్నట్లు సమాచారం. అయితే DM-style inbox తో సాంప్రదాయ ఇమెయిల్ ప్లాట్‌ఫారమ్ తరహాలో ఉండనున్నట్లు తెలుస్తుంది. త్వరగా, సులభంగా అర్ధమయ్యేట్టు అనవసరమైన ఫార్మాటింగ్ లేకుండా డిజైన్ కానున్నట్లు తెలుస్తుంది.
ఈ మధ్యకాలంలో పెరిగిపోతున్న సైబర్ నేరాలతో ఎలన్ మస్క్ ఎప్పటికప్పుడు స్వేచ్ఛ తో పాటు డేటా భద్రత సైతం ఎంతో అత్యవసరమని తెలిపారు. దీన్ని బట్టి డేటా భద్రతే లక్ష్యంగా ఈ యాప్ ను తీసుకొస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి చూడాలి.. ఇప్పటికే ఈ మెయిల్ ప్రపంచాన్ని ఇంతగా ఆక్రమించగా.. ఎక్స్ మెయిల్ అందుబాటులోకి వస్తే వచ్చే ఆదరణ ఎలా ఉంటుందో.
ALSO READ : ఐఫోన్ 17 సిరీస్ ఫీచర్స్ లీక్.. ధర, స్పెషిఫికేషన్స్ డీటెయిల్స్ ఇవే