IND vs AUS: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో భాగంగా… ఇవాళ టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య సెమీఫైనల్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ తొలి సెమీఫైనల్ లో మొదటి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు…. మెల్లిమెల్లిగా భారీ స్కోరే చేసింది. ఈ మ్యాచ్ లో 49.3… ఓవర్స్ లో.. 264 పరుగులు చేసిన ఆస్ట్రేలియా ఆల్ అవుట్ అయింది. మొదట్లో బాగానే ప్రారంభించిన ఆస్ట్రేలియా ఆ తర్వాత… స్కోర్ చేసే ప్రయత్నంలో… వికెట్లు కోల్పోయింది. దీంతో 264 పరుగులు చేయగలిగింది. దుబాయ్ పిచ్ పైన… ఇంతలా కొట్టిందంటే గొప్పే అని చెప్పుకోవచ్చు.
Also Read: Rohit Sharma – Virat: నీకు కళ్ళు దొబ్బాయా..? కుల్దీప్ ను బండబూతులు తిట్టిన కోహ్లీ, రోహిత్ !
మొన్న 249 పరుగులకే టీమిండియా… కట్టడి అయినప్పటికీ న్యూజిలాండ్ జట్టును ఓడించగలిగింది. కానీ టీమిండియా కంటే ఎక్కువగానే ఆస్ట్రేలియా స్కోర్ చేయడం జరిగింది. ఈ మ్యాచ్ లో 49.3… ఓవర్స్ లో.. 264 పరుగులు చేయడం జరిగింది ఆస్ట్రేలియా. ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో… ఆస్ట్రేలియా 300 క్రాస్ చేయలేకపోయింది. లేకపోతే 300 పరుగులు కాదు 350 కొట్టేవాళ్ళు. ఇండియాకు తలనొప్పిగా మారిన… ట్రావిస్ హెడ్ ను తొందరగానే అవుట్ చేశారు టీమిండియా ఆటగాళ్లు.
ఈ మ్యాచ్ లో హెడ్ 33 బంతుల్లో 39 పరుగులు చేసి… మంచి టచ్ లోకి వచ్చాడు. అప్పటికే అతనికి ఒక లైఫ్ కూడా వచ్చింది. ఈ తరుణంలోనే మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని బరిలోకి దింపాడు రోహిత్ శర్మ. ఇక వరుణ్ చక్రవర్తి దెబ్బకు గిల్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు హెడ్. అటు కూపర్ ను టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ డక్ అవుట్ చేయడం జరిగింది. రెండు తొందరగానే వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా…. ఓ దశలో పుంజుకుంది. ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవెన్ స్మిత్… 73 పరుగులతో రఫ్ఫాడించాడు. అటు లబుషంగే కూడా 29 పరుగులు చేసి… టచ్ లోకి వచ్చాడు. అయితే ఈ ఇద్దరిని… టీమిండియా బౌలర్లు తొందరగానే అవుట్ చేశారు.
Also Read: Shubman Gill: హెడ్ క్యాచ్… గిల్ కు అంపైర్ స్ట్రాంగ్ వార్నింగ్?
మిడిల్ ఆర్డర్లో అలెక్స్ క్యారీ 57 బంతుల్లో 61 పరుగులు చేసి… ఆస్ట్రేలియాకు ఊపిరి పోశాడు. ఈ దశలోనే 250 పరుగులు దాటింది ఆస్ట్రేలియా. అయితే అలెక్స్ ను తెలివిగా శ్రేయస్ అయ్యర్ చేయడం జరిగింది. దీంతో ఆస్ట్రేలియా 300 వరకు పరుగులు చేస్తుందనుకుంటే 264 పరుగులకే ఆల్ అవుట్ అయింది. ఇక టీమిండియా బౌలర్లలో… అందరూ బాగా రాణించారు. ఇవాల్టి మ్యాచ్ లో మహమ్మద్ షమీ రెచ్చిపోయాడు. 10 ఓవర్లలో మూడు వికెట్లు తీసేయ్ 48 పరుగులు ఇచ్చాడు. ఇందులో కీలక వికెట్లు కూడా ఉన్నాయి. అలాగే హార్దిక్ పాండ్యా ఒకే ఒక వికెట్ తీయడం జరిగింది. వరుణ్ చక్రవర్తి రెండు వికెట్లు తీయగా రవీంద్ర జడేజా కూడా రెండు వికెట్లు తీసి దుమ్ము లేపాడు. అక్షర పటేల్ ఒకే ఒక్క వికటి తీయడం జరిగింది. దింతో టీమిండియా 265 పరుగులు చేస్తే ఫైనల్ కు చేరుతుంది.