Ind vs Aus Semi-Final: ఛాంపియన్స్ ప్రోఫీ 2025 టోర్నమెంట్ ( Champions Trophy 2025) నేపథ్యంలో ఇవాళ తొలి సెమీ ఫైనల్ జరగనుంది. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ తొలి సెమీ ఫైనల్ లో టీం ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ( Team India vs Australia ) తలపడబోతున్నాయి. గ్రూప్ స్టేజీలో అదరగొట్టిన టీమిండియా… సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాను ఎలాగైనా దెబ్బ కొట్టి ఫైనల్ కు చేరుకోవాలని… చాలా కష్టపడుతోంది. ఇక అటు తోపు ప్లేయర్లు లేకున్నా కూడా…. సెమీస్ వరకు వచ్చింది ఆస్ట్రేలియా. మరో రెండు మ్యాచ్ లు గెలిచి చాంపియన్ ట్రోఫీ 2025 టోర్నమెంటు గెలుచుకోవాలని కంగారులు కూడా కసరత్తులు చేస్తున్నారు.
Also Read: KKR – Rahane: కొత్త కెప్టెన్ ను ప్రకటించిన కోల్ కతా…. టెస్ట్ ప్లేయరే దిక్కు అయ్యాడు?
మ్యాచ్ టైమింగ్స్, ఉచితంగా ఎలా చూడాలి?
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్లో భాగంగా ఇవాళ జరిగే ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ ను ( IND vs AUS semi final ) ఉచితంగా చూడాలంటే జియో హాట్ స్టార్ లో ( Jio Hot Star) చూడవచ్చు. స్టార్ స్పోర్ట్స్ అలాగే స్పోర్ట్స్ 18 చానల్స్ లో కూడా ఈ మ్యాచ్ వస్తుంది. ఇక భారత కాలమానం ప్రకారం… టీమ్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగే మ్యాచ్ మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతుంది. టాస్ ప్రక్రియ రెండు గంటలకు ఉంటుంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మొన్న న్యూజిలాండ్ వర్సెస్ టీం ఇండియా మధ్య జరిగిన మ్యాచ్ లో… మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా.. విజయం సాధించింది. ఈ లెక్కన మొదట బ్యాటింగ్ తీసుకునే అవకాశాలు ఇవాళ ఉన్నాయి.
ఇరు జట్ల వన్డే రికార్డులు
టీమ్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య వన్డే రికార్డులు రోహిత్ శర్మ సేనను వనికిస్తున్నాయి. ఇప్పటివరకు ఈ రెండు జట్ల మధ్య 151 వన్డే మ్యాచ్ లు జరిగాయి. ఇందులో 84 మ్యాచ్ లలో ఆస్ట్రేలియా విజయం సాధించింది. టీమిండియా కేవలం 57 మ్యాచ్ ల్లో విజయం సాధించడం జరిగింది. అంటే దాదాపు 30% ఎక్కువ విజయాలను నమోదు చేసింది ఆస్ట్రేలియా. ఇక చిట్టచివరి 5 వన్డేల రిజల్ట్ ఒకసారి పరిశీలిస్తే… ఆస్ట్రేలియా.. రెండు మ్యాచ్ లలో విజయం సాధించగా.. టీం ఇండియా మాత్రం మూడు మ్యాచ్ ల్లో విజయం సాధించి దుమ్ము లేపింది.
Also Read: IPL 2025: IPL జట్లకు BCCI షాక్.. ఇకపై కొత్త రూల్స్.. పాటించకపోతే వేటు తప్పదు ?
టీమిండియా వర్సెస్ ఆసీస్ జట్ల అంచనా
భారత్ జట్టు అంచనా : రోహిత్ శర్మ (C ), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్. షమీ, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి
ఆస్ట్రేలియా జట్టు అంచనా : స్టీవ్ స్మిత్ (C), సీన్ అబాట్, అలెక్స్ కారీ, ఆరోన్ హార్డీ, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, మార్నస్ లాబుస్‌చాగ్నే, గ్లెన్ మాక్స్‌వెల్, తన్వీర్ సంఘా, ఆడమ్ జంపా