Poco M7 5G: మీరు తక్కువ ధరల్లో మంచి 5జీ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని చూస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే తాజాగా మార్కెట్లోకి Poco కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ కొత్త 5G ఫోన్ ప్రారంభ ధర రూ. 10 వేల కంటే తక్కువగా ఉండటం విశేషం. అయితే దీని ఫీచర్లు ఎలా ఉన్నాయి. ఎక్కడ అందుబాటులో ఉంటుంది, సేల్ ఎప్పుడు మొదలవుతుందనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
డిస్ప్లే: ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లో 6.8 అంగుళాల డిస్‌ప్లే, 600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 120 Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. మీరు ఈ ఫోన్‌లో 6 GB వర్చువల్ RAM సపోర్ట్ పొందుతారు. దీని సహాయంతో 6 GB RAMని 12 GB వరకు పెంచుకోవచ్చు.
కెమెరా: ఈ ఫోన్ వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ సోనీ ప్రైమరీ కెమెరాతో పాటు, 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా, సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరా ఉన్నాయి.
బ్యాటరీ: Poco M7 5Gకి 5160 mAh బ్యాటరీని అందించారు. ఇది 18 W ఫాస్ట్ ఛార్జ్‌కు సపోర్ట్ చేస్తుంది. అయితే రిటైల్ బాక్స్‌లో కంపెనీ 33 W ఛార్జర్‌ను అందిస్తారు.
ప్రాసెసర్: దీని వేగం, మల్టీ టాస్కింగ్ ఆపరేషన్లతోపాటు పోకో స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ఫోర్త్ జనరేషన్ చిప్‌సెట్ 2 ఉపయోగించారు.
Read Also: Donald Trump: ఈ దేశాలపై నేటి నుంచి సుంకాల మోత.. ఆలస్యానికి నో ఛాన్స్
ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 9,999గా ప్రకటించారు. కానీ ఈ ధరను మీరు ఈ ఫోన్ అమ్మకం మొదటి రోజున మాత్రమే పొందుతారు. ఈ ధర వద్ద మీకు 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ మోడల్ లభిస్తుంది. అదే సమయంలో 8 GB RAM, 128 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 10,999గా ఉంది.
ఈ ఫోన్ అమ్మకం మార్చి 7న మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో మొదలవుతుంది. ప్రస్తుతం లాంచ్ ఆఫర్ల గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. కానీ మొదటి రోజు ఆఫర్ తర్వాత ఈ ఫోన్ ఎంత ధరకు లభిస్తుంది, ఏదైనా డిస్కౌంట్ ఉందా అనే వివరాలు మరికొన్ని రోజుల్లో తెలియనున్నాయి.
రూ. 10,000 కంటే తక్కువ ధర ఉన్న పోకో కంపెనీ ఈ 5G ఫోన్.. ప్రస్తుతం మోటరోలా G35 5G, Samsung Galaxy F06 5G, Infinix Hot 50 5G, Redmi A4 5G, Lava Blaze 2 5G వంటి స్మార్ట్‌ఫోన్‌లకు గట్టి పోటీ ఇవ్వనుంది. ఈ క్రమంలో ఈ మోడల్ సేల్ మొదలైన తర్వాత కస్టమర్ల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి మరి. గత కొన్ని నెలలుగా దేశీయ మార్కెట్లో 5జీ స్మార్ట్ ఫోన్లకు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో అనేక కంపెనీలు కూడా ఇదే సెగ్మెంట్లో అనేక కొత్త మోడల్ ఫోన్లను విడుదల చేస్తున్నాయి.