E-Paper
Advertisement

Yashasvi Jaiswal: యశస్వి జైశ్వాల్ ముంగిట.. అద్భుత రికార్డ్

Yashasvi Jaiswal: యశస్వి జైశ్వాల్ ముంగిట.. అద్భుత రికార్డ్
Advertisement

Yashasvi Jaiswal On Cusp Of World Test Championship History: టీమ్ ఇండియా యువ ఓపెనర్, 22 ఏళ్ల యశస్వి జైశ్వాల్ ముంగిట అద్భుతమైన రికార్డు ఉంది. తనింకా టెస్టు సిరీస్ లో 132 పరుగులు చేస్తే చాలు.. ఏకైక భారత క్రికెటర్ గా అవతరిస్తాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ పోటీలను ఐసీసీ ప్రతీ రెండేళ్లకు ఓసారి నిర్వహిస్తోంది. ఈ రెండేళ్ల సీజన్ లో టెస్టు మ్యాచ్ ల్లో ఎవరెక్కువ పరుగులు చేస్తే.. వారు రికార్డు సాధిస్తారు.

ప్రస్తుతం డబ్ల్యూటీసీ సైకిల్ (2023-25) కాలంలో యశస్వి ఇప్పటివరకు 1028 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్ తో జరిగే సిరీస్ లో మరో 132 పరుగులు చేస్తే చాలు .. డబ్ల్యూటీసీ సింగిల్ ఎడిషన్ లో భారత్ నుంచి అత్యధిక పరుగులు చేసిన ఏకైక క్రికెటర్ గా నిలుస్తాడు. ఈ రికార్డు పరుగుల వీరుడు విరాట్ కొహ్లీకి కూడా దక్కలేదు. అయితే యశస్వి కన్నా ముందు 2019-21 సీజన్ లో ఆజింక్యా రహానే 1159 పరుగులు చేశాడు. ఇప్పుడు యశస్వి అందుకు 132 పరుగుల దూరంలో నిలిచాడు.

Advertisement

ఇదే కాదు మరో 371 పరుగులు చేస్తే చాలు.. వరుసగా సెంచరీల మీద సెంచరీలు కొడుతున్న ఇంగ్లండ్ క్రికెటర్.. జో రూట్ (1398 రన్స్) ని కూడా అధిగమిస్తాడు. ఎందుకంటే ఇండియన్ టెస్టు క్రికెట్ లోకి వచ్చిన అనతికాలంలోనే యశస్వి అద్భుతంగా ఆడాడు. ఇప్పటికి 9 టెస్టులు ఆడి 16 ఇన్నింగ్స్ లో 1028 పరుగులు చేశాడు. ఇందులో 2 డబుల్ సెంచరీలు, 3 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలున్నాయి.

Also Read: టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ లో భారీ మార్పులు.. భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?

Advertisement

యశస్వి జైశ్వాల్ కాసేపు క్రీజులో నిలదొక్కుంటే చాలు.. అది టెస్టు మ్యాచ్ అనే స్ప్రహే లేకుండా ఆడతాడు. కొద్దిగా లయ అందుకుంటే వన్డే తరహాలోనే మోత మోగిస్తాడు. ఒకొక్కసారి టీ 20 తరహా కూడా చెలరేగిపోతాడు.  తాజాగా భారత్ లో ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ ఇంగ్లాండ్ తో జరిగినప్పుడు.. ఆ కెప్టెన్ మేం బజ్ బాల్ తో ఇండియాని వణికిస్తామని ఛాలెంజ్ చేశాడు. అదే ఆటను రివర్స్ లో ఆడి యశస్వి వారికి బజ్ బాల్ రుచి చూపించాడు.

ఆ సిరీస్ లో భారత్ 4-1 తేడాతో గెలిచింది. అందులో యశస్వి పాత్ర కీలకమైనదని చెప్పాలి. అందువల్ల ఆజ్యింక రహానే స్కోరే కాదు..జో రూట్ రికార్డు కూడా ఎగిరిపోతుందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

Related News

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

Big Stories

Advertisement
×