Big Stories

Ben Stokes Run Out : శ్రేయాస్ డైరక్ట్ త్రో.. స్టోక్స్ రనౌట్..

Ben Stokes Run Out

Ben Stokes Run Out (cricket news today telugu):

- Advertisement -

టీమ్ ఇండియాలో కీలక ఆటగాడిగా ఉన్న శ్రేయాస్ అయ్యర్ బ్యాటింగ్ లో వరుసగా విఫలమవుతున్నా ఫీల్డింగ్ లో అదరగొడుతున్నాడు. విశాఖపట్నంలో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో ప్రమాదకరంగా మారుతున్న ఓపెనర్ జాక్ క్రాలే (76) ఇచ్చిన క్యాచ్ ను పరుగెత్తి పరుగెత్తి అద్భుతంగా డైవ్ చేసి మరీ పట్టాడు. ఇది మ్యాచ్ కి టర్నింగ్ పాయంట్ గా మారింది. అలాగే అక్షర్ పటేల్ కి దొరికిన ఏకైక వికెట్ కూడా అదే కావడం విశేషం.

- Advertisement -

ఇప్పుడు నాలుగో రోజు మరోక అద్భుతం శ్రేయాస్ ఫీల్డింగ్ నుంచి జరిగింది. ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో 52.4 ఓవర్ వద్ద అశ్విన్ బౌలింగ్ లో వికెట్ కీపర్ బెన్ ఫోక్స్ సింగిల్ తీసేందుకు ప్రయత్నించాడు.

అయితే అవతల నాన్ స్ట్రయికింగ్ ఎండ్ లో ఉన్న కెప్టెన్ బెన్ స్టోక్స్ కొంచెం లేట్ గా స్పందించాడు. ఈ క్రమంలో మిడ్ వికెట్ మీదుగా వచ్చిన బంతిని శ్రేయాస్ అత్యంత చాకచక్యంగా పట్టుకున్నాడు. అంతే స్పీడులో బెన్ స్టోక్ పరుగెడుతున్న స్ట్రయికింగ్ వైపు, అంటే వికెట్ల మీదకి బాల్ ని విసిరాడు. అంతే, ఆ బాల్ వేగంగా వెళ్లి డైరక్టుగా స్టంప్ లకు తగిలి వికెట్లను ఎగరేసింది.

అప్పటికి బెన్ స్టోక్స్ ఇంకా క్రీజులోకి చేరకపోవడంతో రన్ అవుట్ గా వెనుదిరిగాడు. దీంతో ఇంగ్లాండ్ పరాజయం దిశగా వేగంగా సాగిపోతోంది. అప్పటికి ఇంగ్లాండ్ ఏడో వికెట్ కోల్పోయింది. శ్రేయాస్ అయ్యర్ మెరుపు ఫీల్డింగ్ పై నెట్టిల్లు హోరెత్తిపోతోంది. అయ్యర్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో పట్టిన మెరుపు క్యాచ్, సెకండ్ ఇన్నింగ్స్ లో డైరక్ట్ త్రో కారణంగా బెన్ స్టోక్ రన్ అవుట్ మ్యాచ్ కే హైలైట్ అంటున్నారు.

ఫస్ట్ ఇన్నింగ్స్ లో డబుల్ సెంచరీ సాధించిన యశస్వి జైశ్వాల్, బౌలింగ్ లో 6 వికెట్లు తీసిన బుమ్రా, ఇక రెండో ఇన్నింగ్ లో సెంచరీతో మెరిసిన గిల్ వీరితో పాటు శ్రేయాస్ అయ్యర్ ఫీల్డింగ్ కూడా టీమ్ ఇండియా విజయంలో కీలకపాత్ర పోషించిందని నెటిజన్లు వ్యాక్యానిస్తున్నారు. 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News