BigTV English

IND vs ENG 2nd Test : రెండో టెస్ట్ లో.. ఆ ముగ్గురు.. ఇదేం బ్యాటింగ్..

IND vs ENG 2nd Test : రెండో టెస్ట్ లో.. ఆ ముగ్గురు.. ఇదేం బ్యాటింగ్..

IND vs ENG 2nd Test : ముగ్గురు ఫామ్ లో లేని బ్యాటర్లు.. తెలిసి కూడా రెండో టెస్ట్ లోకి తీసుకున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్… ముగ్గురు కూడా అద్భుతాలేమీ చేయలేదు.  కెప్టెన్ రోహిత్ శర్మతో సహా, ఎవరూ నిలకడగా బ్యాటింగ్ చేయలేదు.  


శుభ్ మన్ గిల్  మళ్లీ లయ అందుకున్నాడు.. అనుకునేలోపు 34 పరుగులు చేసి అవుట్ అయిపోయాడు. అక్కడే కామెంటరీ బాక్స్ లో ఉన్న రవిశాస్త్రి పరోక్షంగా గిల్‌కు వార్నింగ్ ఇచ్చాడు. వచ్చిన అవకాశాలను  సద్వినియోగం చేసుకోవాలని, రీఎంట్రీ కోసం  ఎదురుచూస్తున్న పుజారాను మరిచిపోవద్దని హెచ్చరించాడు.

టెస్టు ఛాంపియనషిప్ ఫైనల్ తర్వాత 12 ఇన్నింగ్స్‌ల్లో గిల్ 207 పరుగులు మాత్రమే చేశాడు. అత్యధిక స్కోరు 36 పరుగులు. మొత్తమ్మీద తన సగటు 18 మాత్రమే. రెండో టెస్ట్ లో అండర్సన్ వేసిన బంతిని అడ్డుకోవడానికి ప్రయత్నించి వికెట్ కీపర్ బెన్ ఫోక్స్ చేతికి చిక్కాడు. 


గిల్ ఆడిన ఏడు ఇన్నింగ్స్‌ల్లో  అండర్సన్ అయిదు సార్లు ఔట్ చేయడం గమనార్హం. అతని బౌలింగ్ లో విరాట్ కోహ్లీ 7 సార్లు , సచిన్ 9 సార్లు అవుట్ అయ్యారు. కాకపోతే వారు కెరీర్ మొత్తంలో ఒక బౌలర్ చేతిలో అవుట్ అయ్యారు. కానీ గిల్ తక్కువ మ్యాచ్ ల్లోనే అవుట్ కావడం విశేషం.

కెప్టెన్ రోహిత్ శర్మ కూడా నిరాశ పరిచాడు. రెండో టెస్ట్ లో 41 బంతులు ఆడి కేవలం 14 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. మొత్తమ్మీద గత ఏడు టెస్టు ఇన్నింగ్స్‌ల్లో రోహిత్ ప్రదర్శన పేలవంగా ఉంది. సౌతాఫ్రికా పర్యటనలో 5, 0, 39, 16* పరుగులే సాధించాడు. ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టెస్టులో 24, 39 పరుగులు చేశాడు.

అందరూ గిల్, శ్రేయాస్ ని అనుకుంటున్నారు గానీ, కెప్టెన్ ఆటతీరు అంతంతమాత్రంగానే ఉంది. కాకపోతే ఆఫ్గనిస్తాన్ తో జరిగిన మూడో టీ 20లో సెంచరీ సాధించి ఫామ్ లోకి వచ్చాడని అనుకుంటే, ఇక్కడ బ్యాట్ ఎత్తేస్తున్నాడని విమర్శిస్తున్నారు.

టీమ్ ఇండియాలో మూడో విఫల ఆటగాడు శ్రేయాస్ అయ్యర్. తన పేలవమైన ఫామ్ రెండో టెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో కూడా కొనసాగింది. 59 బంతుల్లో 27 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీకింకా ఎన్ని అవకాశాలు ఇవ్వాలని సీరియస్ అవుతున్నారు. అవతల ఆడేవారిని రిజర్వ్ బెంచ్ లో కూర్చోబెట్టి, వీరితో అనవసర ప్రయోగాలు చేస్తున్నారని మండిపడుతున్నారు.

గత 11 ఇన్నింగ్స్ లో అయ్యర్ ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌లో చివరిసారిగా హాఫ్ సెంచరీ చేసిన తర్వాత నుంచి విఫలమవుతూనే ఉన్నాడు. గత 11 ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 12, 4, 26, 0, 6, 31, 4*, 0, 35, 13, 27 ఇలా విఫలం అవుతూనే ఉన్నాడు.

Related News

5 Balls Won Match: 5 బంతుల్లో ముగిసిన మ్యాచ్…7 గురు డకౌట్… 23 పరుగులకే ఆలౌట్

Mohamed Siraj : సేమ్ టు సేమ్ డిట్టు దించేశారు… మహమ్మద్ సిరాజ్ కూడా కుళ్ళుకోవాల్సిందే

Travis head – SRH Fan : ఆస్ట్రేలియా గడ్డపై SRH ఫ్యాన్స్ రచ్చ చూడండి.. హెడ్ ను అడ్డంగా పట్టుకొని

IPL 2026 : SRH కోసం మరోసారి రంగంలోకి రజినీకాంత్?

World cup 2027: గిల్ కెప్టెన్సీలో రోహిత్ శర్మ.. ఇంత దారుణమా?

Yash Dayal: RCB బౌలర్ దయాల్ కు ఎదురుదెబ్బ.. ఐపీఎల్ 2026 నుంచి ఔట్?

Big Stories

×