BigTV English

IND vs ENG 2nd Test : విశాఖ మ్యాచ్ ముందు.. పదనిసలు!

IND vs ENG 2nd Test : విశాఖ మ్యాచ్ ముందు.. పదనిసలు!
IND vs ENG 2nd Test

IND vs ENG 2nd Test : విశాఖపట్నంలో జరగనున్న రెండో టెస్ట్ కి సంబంధించి నెట్టింట పలు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. వాటిలో ముఖ్యంగా ఇంగ్లాండ్ కోచ్ బ్రెండన్ మెక్ కల్లమ్ అంటున్నాడు. మేం మొత్తం ఐదుగురు స్పిన్నర్లతో దిగుతామని తెలిపాడు. అంటే మొదటి టెస్ట్ లో ఒకే ఒక పేసర్, నలుగురు స్పిన్నర్లతో దిగింది. దీంతో టీమ్ ఇండియా బ్యాటర్లు ఓవర్ డిఫెన్స్ కి పోయి  వికెట్లు కోల్పోయారు.


కానీ టీమ్ ఇండియా మాత్రం ఇద్దరు పేసర్లతో సంప్రదాయంగా దిగి… కంగు తింది. హైదరాబాద్ మ్యాచ్ లో మనవాళ్లు కూడా నలుగురు స్పిన్నర్లతో దిగి ఉంటే, పరిస్థితి మరోలా ఉండేదని అంటున్నారు. అందుకని ఈసారి పిచ్ సహకరిస్తే నలుగురు స్పిన్నర్లతో టీమ్ ఇండియా బరిలోకి దిగేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. అలాంటి పరిస్థితి వస్తే ఉన్న పేసర్ ని కూడా తీసేసి ఐదుగురు స్పిన్నర్లతో దిగుతామని ఇంగ్లాండ్ కోచ్ తెలిపాడు.

ఐదుగురు స్పిన్నర్లే అన్న వార్త హల్చల్ చేస్తుంటే, మొత్తానికి రెండు జట్ల క్రికెటర్లు విశాఖ చేరుకున్నారు. ప్రాక్టీసు మొదలెట్టేశారు. ఏసీఏ- వీడీసీఏ అంతర్జాతీయ మైదానంలో ఈ మ్యాచ్ మొదలు కానుంది.  ఏర్పాట్లు పూర్తి చేసినట్టు నిర్వాహకులు తెలిపారు. క్రికెటర్లందరూ విశాఖలోని నోవాటెల్ హోటల్ కి చేరుకున్నారు. వీరిని చూడటానికి అభిమానులు హోటల్ వద్దకు చేరుకున్నారు. దీంతో అక్కడ పోలీసుల భద్రతను పెంచాల్సి వచ్చింది.


మొదటి టెస్టులో తొడ కండరాలు పట్టీసిన రవీంద్ర జడేజా ఆసక్తికరమైన వ్యాక్యలు చేశాడు. కొన్నిరోజులు ఇదే తన ఇల్లు అని ఎన్సీఏ ఫొటో పెట్టి తెలిపాడు. జాతీయ క్రికెట్ అకాడమీలో చేరిన జడేజా అక్కడ చికిత్స తీసుకుంటున్నాడు. నొప్పి చిన్నదే అయితే మూడో టెస్ట్ కి అందుబాటులో ఉంటాడని అంటున్నారు. దీంతో నెట్టింట…అన్నా… నువ్వు త్వరగా రావాలి…అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

కేఎల్ రాహుల్ గాయం చిన్నదేనని అంటున్నారు. తను కూడా ఎన్సీఏలోనే చికిత్స తీసుకుంటున్నాడు. అన్నీ కుదిరితే మూడో టెస్ట్ కు రాహుల్ అందుబాటులో ఉంటాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఇది టీమ్ ఇండియా నెత్తిమీద పాలు పోసినట్టయ్యింది. అప్పటికి కొహ్లీ కూడా వచ్చేస్తే, మళ్లీ టీమ్ ఇండియా పులి అయిపోతుందని అంటున్నారు.

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×