BigTV English

Jaiswal : స్టోక్స్ కుట్రలు… జైస్వాల్ ను బండ బూతులు తిడుతూ..!

Jaiswal : స్టోక్స్ కుట్రలు…   జైస్వాల్ ను బండ బూతులు తిడుతూ..!

Jaiswal :  ప్రస్తుతం ఇంగ్లాండ్ వర్సెస్ భారత్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత జట్టు తొలి టెస్ట్ మాదిరిగానే రెండో టెస్టులో కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేయనుంది. అయితే రెండో టెస్ట్ వేదిక అయిన బర్మింగ్ హా్లోని ఎడ్జ్ బాస్టన్ మైదానం..  టీమిండియా  ఇప్పటివరకు ఇక్కడ ఒక్క టెస్ట్ మ్యాచ్ లో కూడా విజయం సాధించకపోవడం గమనార్హం. ప్రస్తుతం భారత్ బ్యాటింగ్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఓ వివాదస్పద సంఘటన చోటు చేసుకుంది. రెండో టెస్టులో భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్, బెన్ స్టోక్స్ మధ్య మాటల యుద్ధం జరిగింది. జైస్వాల్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అతని ఏకాగ్రత దెబ్బ తీసేందుకే బెన్ స్టోక్స్ స్లెడ్జింగ్ కు దిగారు. దీంతో జైస్వాల్ కూడా మాట మాటకు మాట బదులిచ్చారు. మరోసారి ఇద్దరూ దగ్గరగా చేరుకొని ఘర్షణ పడేందుకు సిద్ధపడుతుండగా.. అంఫైర్లు నిలువరించారు. ఇద్దరికీ సర్ది చెప్పడంతో వివాదం అక్కడితో ముగిసిపోయింది.


Also Read :  Shami – Hasin Jahan : రూ.4 లక్షల భరణం సరిపోదు… ఆస్తులు మొత్తం ఇవ్వాల్సిందే…షమీ భార్య సంచలనం!

జైస్వాల్, బెన్ స్టోక్స్ మధ్య గొడవ..


ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ సెంచరీ చేస్తాడని అంతా భావించినా 87 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. మరో ఓపెనర్ కే.ఎల్. రాహుల్ కేవలం 2 పరుగులు మాత్రమే చేసి క్రిస్ వోక్స్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కరుణ్ నాయర్ 31 పరుగులు చేయగా.. ప్రస్తుతం కెప్టెన్ శుబ్ మన్ గిల్, వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ క్రీజులో ఉన్నారు. శుబ్ మన్ గిల్ 42 పరుగులు చేయగా.. రిషబ్ పంత్ 14 పరుగులు చేశాడు. టీమిండియా 53 ఓవర్లకు 182/3 పరుగులు చేసింది. అనుకున్నట్టుగానే బర్మింగ్ హా్లోని ఎడ్జ్ బాస్టన్ మైదానంలో టీమిండియా విజయాన్ని నమోదు చేయలేదు. ఈ టెస్టులో కూడా అదే చరిత్రను రిపీట్ చేసేలా కనిపిస్తోంది. టీమిండియా ఆటగాళ్ల ఆటతీరు అలా ఉంది మరీ.

స్ట్రోక్ కుట్రలు.. జైస్వాల్ ఔట్

ముఖ్యంగా టీమిండియా యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. 59 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన జైస్వాల్ సెంచరీ చేసేలా కనిపించాడు. కానీ బెన్ స్టోక్స్ బౌలింగ్ లో వికెట్ కీపర్ జెమీ స్మిత్ కి క్యాచ్ ఇచ్చి పెవిలీయన్ కి చేరాడు. దీంతో ఓ రికార్డును తన పేరిట లిఖించుకునే ఛాన్స్ మిస్ చేసుకున్నాడు. జైస్వాల్  మరో 10 పరుగులు సాధించి ఉంటే రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్ ను అధిగమించి టెస్టుల్లో అత్యంత వేగంగా 2వేల పరుగులు పూర్తి చేసిన భారత ఆటగాడిగా నిలిచేవాడు. ఆ రికార్డుకు 10 పరుగుల దూరంలో ఉండగా ఔట్ అయ్యాడు. ద్రవిడ్, సెహ్వాగ్ 40 ఇన్నింగ్స్ లలో రెండు వేల పరుగుల మైలు రాయి అందుకున్నారు. ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో ఔట్ అయిన తరువాత జైస్వాల్ 1990 పరుగులతో ఉన్నాడు. రెండో ఇన్నింగ్స్ లో జైస్వాల్ 10 పరుగులు చేస్తే.. ద్రవిడ్, సెహ్వాగ్ సరసన నిలుస్తాడు.

?igsh=MTNtb3BpamFnNnE2cA==

Related News

SRH: ఫ్యాన్స్ కు షాక్.. SRH నుంచి ఇద్దరు ప్లేయర్లు ఔట్.. కాటేరమ్మ కొడుకు కూడా !

Abhishek Sharma: SRHలో మిస్ అయింది… ఆసియా కప్ లో 300 కొడతాం… అభిషేక్ వార్నింగ్ !

Kohli’s son: కోహ్లీ కొడుకు పుట్టిన గడియపై రచ్చ.. RCB ప్లేయర్ల జట్లే ఛాంపియన్స్

Dhanashree Verma: చాహల్ టార్చర్… కేకలు పెట్టి ఏడ్చిన ధనశ్రీ!

Ashwin: శ్రేయాస్ అయ్యర్, జైస్వాల్ కారణంగానే ముంబైలో వరదలు… అశ్విన్ సంచలనం

Asia Cup 2025 : ఆసియా కప్ లో మొత్తం ముంబై, KKR ప్లేయర్లే

Big Stories

×