Talliki vandanam 2025 AP: ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం రెండు విడతలుగా అమలుచేస్తున్న విషయం తెలిసిందే. లక్షలాది విద్యార్థుల తల్లులకు డైరెక్ట్‌గా నిధులు జమ చేస్తూ, వారి పిల్లల చదువుకు సహాయంగా నిలిచేలా ఈ పథకం రూపొందించారు. తాజాగా రెండో విడత పేమెంట్లు విడుదలకు సంబంధించి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అయితే ఇందులో పలు మార్పులు, అప్డేట్ల వల్ల కొందరికి డబ్బులు ఆలస్యం కావడం, మరికొందరికి వర్తించకపోవడం వంటి సందేహాలు తలెత్తుతున్నాయి. వాటన్నింటికీ సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ పథకం కింద ప్రభుత్వం ప్రతి విద్యార్థికి ఏకంగా రూ.13,000 చొప్పున తల్లుల బ్యాంక్ ఖాతాల్లోకి నిధులు జమ చేస్తోంది. విద్యార్థులు చదువును మధ్యలో ఆపకుండా, తల్లులు వారిని ప్రోత్సహించేందుకు తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా ప్రశంసలు పొందుతోంది. ఇక తాజా రెండో విడత చెల్లింపుల విషయానికి వస్తే, ఈసారి ఫస్ట్ క్లాస్‌లో అడ్మిషన్ తీసుకున్న విద్యార్థులు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్‌లో చేరిన విద్యార్థులు, అలాగే రైట్ టు ఎడ్యుకేషన్ (RTE) ద్వారా ప్రైవేట్ స్కూల్‌లలో చదువుతున్న పిల్లల తల్లులకూ ఈ పథకం వర్తించనుంది.
ముందుగా మొదటి తరగతిలో చేరిన విద్యార్థుల విషయానికి వస్తే, వారిని కొత్తగా పాఠశాలలో చేర్పించిన తల్లులకు పేమెంట్ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఈ విడత చెల్లింపులు మంజూరు చేశారు. అలాగే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న వారు గతంలో ఈ పథకం కింద లబ్ధి పొందలేదన్న పలు ఫిర్యాదుల నేపథ్యంలో, ప్రభుత్వం ఇప్పుడు వారికి కూడా నిధులు విడుదల చేయాలని నిర్ణయించింది. దీంతో ఇంటర్ చదువుతున్న చాలా తల్లులకు ఈ పథకం వర్తించనుంది.
ఇక 9వ తరగతి, 10వ తరగతి, ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరాల్లో ఉన్న విద్యార్థుల తల్లులకు సంబంధించిన పేమెంట్లు కూడా మంజూరు కానున్నాయి. అయితే వీరి నిధులు సంబంధిత కార్పొరేషన్ల ద్వారా విడుదల అవుతుండటంతో కొంతవరకు ఆలస్యమవుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇది తాత్కాలిక సమస్య మాత్రమేనని, అర్హులైన వారందరికీ తప్పనిసరిగా పేమెంట్లు వస్తాయని వారు స్పష్టం చేశారు.
Also Read: Kurnool Shocking Murder: నరికిన కాలు పట్టుకుని ఊరంతా తిరుగుతూ.. కర్నూలులో దారుణం, కారణం ఇదే!
అయితే పాఠశాల విద్యా శాఖ పరిధిలో ఉన్న విద్యార్థుల డేటానే ప్రస్తుతం సిస్టమ్‌లో అప్‌లోడ్ చేసినట్టు తెలుస్తోంది. కేంద్రీయ విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థులకు ఈ పథకం వర్తించాలా లేదా అన్న విషయంపై ప్రభుత్వం ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదని సమాచారం. దీంతో కేవీఆర్ స్కూల్స్‌లో చదువుతున్న పిల్లల తల్లులు కొంత నిరాశకు గురవుతున్నారు. అయితే త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
మరొక కీలక విషయం.. గతంలో కొన్ని కుటుంబాలు తల్లికి వందనం పథకానికి అర్హులైనా కూడా, విద్యుత్ వినియోగం 300 యూనిట్లకు మించి ఉండడం వల్ల పేమెంట్లు పొందలేకపోయారు. అయితే తాజాగా ప్రభుత్వం వారి డేటాను మళ్లీ సమీక్షిస్తోంది. NBM (Navaratna Beneficiary Management) సిస్టమ్‌లో ప్రస్తుతం 300 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించిన కుటుంబాలు హౌస్‌హోల్డ్ ఎలిజిబుల్ లిస్టులో ఉంటే, వారికి జూలై 10 తర్వాత పేమెంట్లు జమ చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇది చాలా మంది తల్లులకు ఊరట కలిగించే విషయం.
ఇవన్నీ అమలు కావడానికి తల్లుల బ్యాంక్ ఖాతా వివరాలు, ఆధార్ లింకింగ్, విద్యార్థుల స్కూల్ ఇన్ఫర్మేషన్ వంటి అంశాలు చాలా ముఖ్యమైనవి. కాబట్టి ఎవరికి పేమెంట్ రాలేదన్నా తొందరపడకుండా స్థానిక సచివాలయం లేదా స్కూల్ ద్వారా సమాచారం తెలుసుకోవడం ఉత్తమం.
ఈ పథకంను సీఎం చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారు. విద్యను ఒక హక్కుగా భావిస్తూ, తల్లులు పిల్లల భవిష్యత్తు కోసం ఖర్చు చేయడానికి ప్రభుత్వం వారి పక్కన నిలవాలనే ఆలోచనతోనే రూ.13,000 నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేస్తున్నారు. ఈ విధంగా తల్లికి వందనం పథకం తల్లిలో ఆత్మవిశ్వాసం, పిల్లలలో విద్యాభిమానం పెంచడంలో ముఖ్యపాత్ర పోషిస్తోంది.
మీ పిల్లలు స్కూల్‌కి వెళ్తుంటే కానీ మీరు ఇంకా తల్లికి వందనం డబ్బులు అందుకోలేదా? మీ కుటుంబం ఈసారి రెండో విడతలో లిస్టులో ఉందో లేదో తెలుసుకోవడానికి వెంటనే మీ గ్రామ,వార్డు సచివాలయాన్ని సంప్రదించండి. అవసరమైతే ఆధార్, విద్యుత్ బిల్లు, బ్యాంక్ ఖాతా వివరాలు తీసుకెళ్లి చెక్ చేయించుకోండి.