IND vs ENG: టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడవ టెస్ట్ లో గిల్ సేన పీకల్లోతు కష్టాల్లో పడింది. మూడవ టెస్టు విజయానికి ముందు టీమిండియా వికెట్లను వరుసగా కోల్పోతుంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి… నాలుగు వికెట్లు నష్టపోయి కేవలం 58 పరుగులు మాత్రమే చేసింది టీమిండియా. టీమిండియా తన రెండో ఇన్నింగ్స్ లో.. 17.4 ఓవర్లు ఆడి.. 58 పరుగులు చేసి నాలుగు వికెట్లు కోల్పోయింది. విజయానికి మరో 135 పరుగులు చేయాల్సి ఉంది టీమిండియా. రేపు ఐదో రోజు ఒక్కరోజు మాత్రమే ఛాన్స్ ఉంది.
విజయానికి 135 పరుగుల దూరంలో టీమిండియా
టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడవ టెస్ట్ మ్యాచ్ లో నాలుగు రోజులు పూర్తయ్యాయి. మరో ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా 135 పరుగులు చేస్తే విజయం సాధిస్తుంది. అదే సమయంలో మరో ఆరు వికెట్లు పడగొడితే… ఇంగ్లాండ్ విజయం సాధించడం గ్యారంటీ. ఇప్పటికే నాలుగు వికెట్లు నష్టపోయి కేవలం 58 పరుగులు మాత్రమే చేసింది టీమిండియా. ప్రస్తుతం గ్రీజులో ఉన్న కేఎల్ రాహుల్ అద్భుతంగా రానిస్తున్నాడు. 47 బంతుల్లో 33 పరుగులు చేశాడు రాహుల్. నైట్ వాచ్మెన్ కింద ఇవాళ ఆకాష్ దీప్ ను పంపించారు కెప్టెన్ గిల్. అతడు ఒకే ఒక పరుగు చేసి స్టోక్స్ బౌలింగ్ లు అవుట్ అయ్యాడు.
మరోసారి విఫలమైన కరుణ్ నాయర్
టీమిండియాలో ఛాన్స్ కోసం చాలా రోజులు వెయిట్ చేసిన కరుణ్ నాయర్ మరోసారి దారుణంగా విఫలమయ్యాడు. కచ్చితంగా ఆడాల్సిన రెండో ఇన్నింగ్స్ లో.. కేవలం 14 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఇప్పటివరకు మూడు టెస్టుల్లో… 0, 20, 31, 26, 40,14 పరుగులు మాత్రమే చేశాడు. అన్ని కలిపితే 150 పరుగులు కూడా దాటలేదు. దీంతో తర్వాత టెస్టులో కరుణ్ నాయర్ ఆడే అవకాశాలు లేనట్లే తెలుస్తోంది.
పీకలోతు కష్టాల్లో టీమిండియా
రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ జట్టును 192 పరుగులకు ఆల్ అవుట్ చేసిన టీమిండియా… బ్యాటింగ్లో మాత్రం దారుణంగా విఫలమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే రెండో నాలుగు వికెట్స్ కోల్పోయింది టీమిండియా. విజయానికి 135 పరుగుల దూరంలో ఉన్న టీమిండియా రేపు ఒక్కరోజులో ఆ లక్ష్యాన్ని చేదించాల్సి ఉంటుంది. కానీ రేపు వికెట్లను త్వరగా కోల్పోతే టీమిండియా గెలవడం చాలా కష్టం.
అదరగొట్టిన వాషింగ్టన్ సుందర్
టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ రెండో ఇన్నింగ్స్ లో అదరగొట్టాడు. ఇంగ్లాండ్ జట్టును… కకావికలం చేశాడు. రెండో ఇన్నింగ్స్ లో 12 ఓవర్లు వేసిన వాషింగ్టన్ సుందర్ నాలుగు వికెట్లు పడగొట్టి కేవలం 22 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇందులో కీలక వికెట్లను పడగొట్టాడు వాషింగ్టన్ సుందర్. రూట్, స్టోక్స్, స్మిత్, బషీర్ వికెట్లను పడగొట్టి టీమిండియాను ఆదుకున్నాడు. కాగా మొదటి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ అలాగే టీమ్ ఇండియా 387 పరుగులు చేశాయి. రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 192 పరుగులకు ఆల్ అవుట్ అయింది. B