Ben Stokes: క్రికెట్ మక్కాగా పిలుచుకునే లార్డ్స్ మైదానం వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడవ టెస్ట్ లో టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ మరోసారి తన అద్భుత బ్యాటింగ్ తో సెంచరీ చేసి జట్టును ఆదుకున్నాడు. కీలక సమయంలో సెంచరీతో మరోసారి క్లాస్ చూపించాడు. తొలి టెస్ట్ లో సెంచరీ సాధించిన కేఎల్ రాహుల్.. మూడో టెస్ట్ లోను అదే ఫామ్ ని కొనసాగిస్తూ కీలక సమయంలో సెంచరీ ఇన్నింగ్స్ ఆడాడు.
Also Read: Hardik Pandya: మనసు మార్చుకున్న పాండ్య.. నటాషా ఇంటికి వెళ్లి ఎంజాయ్ ?
వికెట్ కీపర్ రిషబ్ పంత్ తో కలిసి జట్టు ఇన్నింగ్స్ ని నడిపించాడు. భారత ఇన్నింగ్స్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా నిలిచాడు కేఎల్ రాహుల్. 177 బంతుల్లో 100 పరుగులు చేశాడు. ఇందులో 13 ఫోర్లు ఉన్నాయి. ఇక సెంచరీ చేసిన వెంటనే 67.1 ఓవర్ లో ఇంగ్లాండ్ స్పిన్నర్ బషీర్ బౌలింగ్ లో పెవిలియన్ చేరాడు.
పంత్ రనౌట్:
అయితే మూడవరోజు లంచ్ విరామానికి ముందు వరకు భారత్ పటిష్టమైన స్థితిలో ఉంది. కేఎల్ రాహుల్ – రిషబ్ పంత్ మధ్య 141 పరుగుల భాగస్వామ్యంతో భారత జట్టు 247 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయి మంచి స్థితిలో నిలిచింది. అయితే లంచ్ విరామానికి ముందు చివరి ఓవర్ ని ఇంగ్లాండ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ వేశాడు. అప్పుడు సెంచరీ చేయాలని పట్టుదలతో ఉన్న కేఎల్ రాహుల్.. తన ఆలోచనలను రిషబ్ పంత్ కి ముందే చెప్పాడు. ఈ క్రమంలో రాహుల్ సెంచరీ చేయాలని పంత్ కూడా ఉత్సాహంగా ఉన్నాడు. ఇక కొన్ని బంతుల తర్వాత రాహుల్ కి స్ట్రైక్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక ప్రమాదకరమైన సింగిల్ కోసం ప్రయత్నించాడు. ఆ సమయంలో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మెరుపు వేగంతో ఫీల్డింగ్ చేసి పంత్ ని రన్ అవుట్ చేశాడు. ఈ క్రమంలో 74 పరుగులతో సెంచరీ దిశగా వెళుతున్న పంత్.. నిరాశగా పెవిలియన్ చేరాడు.
పంత్ పై స్టోక్స్ ప్రశంసలు:
ఇంగ్లాండ్ తో ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా తొలి టెస్ట్ లో రిషబ్ పంత్ రెండు ఇన్నింగ్స్ లలోను సెంచరీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రెండవ టెస్ట్ కి ముందు రిషబ్ పంత్ పై ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ప్రశంసలు కురిపించాడు. ప్రపంచంలోని మోస్ట్ డేంజరస్ బ్యాటర్లలో పంత్ కూడా ఒకరని అన్నాడు. “పంత్ నా అపోజిషన్ అయినప్పటికీ.. అతడు క్రికెట్ ఆడుతుంటే ఆస్వాదిస్తాను. అన్ని ఫార్మాట్లలో పంత్ ఆడే విధానం నాకు చాలా ఇష్టం. అతడిలో ఎంతో టాలెంట్ ఉంది. పంత్ కి స్వేచ్ఛ ఇస్తే ఎలా చెలరేగుతాడో గత వారం చూసాం.
Also Read: Chepauk Stadium: CSK ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. చెన్నై చెపాక్ స్టేడియాన్ని తొలగిస్తున్నారా..?
ఒకే మ్యాచ్ లో రెండు సెంచరీలు చేశాడు. పంత్ చాలా ప్రమాదకరమైన ఆటగాడు” అని అప్పుడు పొగిడాడు. అయితే ఈ మూడవ టెస్ట్ లో పంత్ రన్ అవుట్ అయిన తర్వాత స్టోక్స్.. పంత్ పై మరోసారి ప్రశంసలు కురిపించాడు. ” నిజానికి నేను కె.ఎల్ రాహుల్ ని సులభంగా రన్ అవుట్ చేయగలను. కానీ మాకు రిషబ్ పంత్ వికెట్ చాలా ముఖ్యం. రాహుల్ ఉన్నాడా..? లేదా..? అనేది పట్టించుకోము. అందుకే నేను పంత్ ని రనౌట్ చేయడానికి వెళ్ళాను” అని అన్నాడు. దీంతో ఇంగ్లాండ్ కెప్టెన్.. కె.ఎల్ రాహుల్ ని దారుణంగా అవమానించారని కొంతమంది నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Ben Stokes :- "Actually, I could get KL Rahul run out easily, but Rishabh Pant's wicket is more important. Whether Rahul was there or not, it didn't matter, so I went for Pant's run-out." pic.twitter.com/5EP9PTc6ND
— muffatball vikrant (@Vikrant_1589) July 12, 2025