Ind Vs Eng, 3rd Test: ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ( India vs England ) మధ్య జరుగుతున్న సంగతి తెలిసిందే. లండన్ లోని లార్డ్స్ ( Lord’s, London ) వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టీమిండియా అలాగే ఇంగ్లాండ్… రెండు జట్లు అద్భుతంగా రాణిస్తున్నాయి. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు తక్కువ పరుగులు చేసినప్పటికీ… బౌలింగ్ లో కూడా అదరగొడుతోంది. ఇక ఇటు టీమిండియా.. ఇప్పటికే మూడు వికెట్లు కోల్పోయి పోరాడుతోంది.
దుమ్ములేపుతున్న కే ఎల్ రాహుల్ ( Kl Rahul )
టీం ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ఇప్పటికే రెండు టెస్ట్ మ్యాచ్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం మూడవ టెస్ట్ మ్యాచ్ లార్డ్స్ వేదికగా జరుగుతోంది. ఇలాంటి నేపథ్యంలో.. టీమిండియా స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ అద్భుతంగా రాణిస్తున్నాడు. తన అద్భుతమైన బ్యాటింగ్తో ఆప్షన్ కూడా పూర్తి చేసుకున్నాడు కేఎల్ రాహుల్. ఇక ఈ నేపథ్యంలోనే మూడవ టెస్టు రెండో రోజు మ్యాచ్ ముగిసే సమయానికి టీమిండియా 43 ఓవర్లు ఆడింది. ఈ తరుణంలో మూడు వికెట్ల నష్టపోయి.. 145 పరుగులు మాత్రమే చేయగలిగింది.
అయితే ఈ మ్యాచ్ లో కె ఎల్ రాహుల్ అద్భుతంగా రాణిస్తున్నాడు. టీమిండియా కెప్టెన్ గిల్ తో పాటు ఇతర యంగ్ క్రికెటర్లు విఫలమైనప్పటికీ కూడా… కేఎల్ రాహుల్ అద్భుతంగా అ రాణించి ముందుకు వెళ్తున్నాడు. ఈ తరుణంలోనే 113 బంతులలో 53 పరుగులు చేసి.. ఇప్పటికి కూడా క్రీజు లోనే ఉన్నాడు కేఎల్ రాహుల్. ఇందులో ఐదు బౌండరీలు కూడా ఉన్నాయి. ఇంగ్లాండ్ బౌలర్లను ఆచితూచి ఆడుతున్నాడు కేఎల్ రాహుల్.
విఫలమైన టీమిండియా టాప్ ఆర్డర్
కేఎల్ రాహుల్ ( Kl Rahul ) అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్న నేపథ్యంలో… టీమిండియా ( Team India) టాప్ ఆర్డర్ బ్యాటర్లు మాత్రం విఫలమయ్యారు. టీమిండియా యంగ్ కెప్టెన్ గిల్, యశస్వి జైస్వాల్ ఇద్దరు తొందరగానే అవుట్ అయ్యారు. ఈ మ్యాచ్లో యశస్వి జై ష్వాల్… 13 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. టీమ్ ఇండియా ఎందుకు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) 16 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. కరుణ్ నయర్ ( Karun Nair) 40 పరుగులు చేసి టచ్ లోకి వచ్చాడు. కానీ అంతలోపే అవుట్ అయ్యాడు. దీంతో ప్రస్తుతం టీమిండియా మాజీ కెప్టెన్ కేఎల్ రాహుల్ , అలాగే వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ బ్యాటింగ్ చేస్తున్నారు. నిన్న గాయం కారణంగా గ్రౌండ్ వదిలిన రిషబ్ పంత్… బ్యాటింగ్ చేసేందుకు మాత్రం వచ్చాడు. ఇక అంతకుముందు 387 పరుగులకు ఇంగ్లాండ్ ఆల్ అవుట్ అయింది. రూట్ ఒక్కడే 104 పరుగులు చేసి దుమ్ము లేపాడు.
Bumrah shutting down his haters everytime #IndvsEng pic.twitter.com/ZPdNMuzC0B
— Rajabets 🇮🇳👑 (@rajabetsindia) July 11, 2025