Tennis player Radhika Yadav: పిల్లల్ని వారి పాదాల మీద నిలబెట్టాలని తండ్రి కలలు కంటాడు. కానీ.. అదే కూతురు ఎదుగుతోందన్న అసూయతో.. క్షణాల్లో తుపాకీ మోగించిన తండ్రి ఉంటాడని ఎవరు ఊహిస్తారు? ఈ ఘటన హర్యానా రాష్ట్రం, గురుగ్రామ్ జిల్లాలోని సుషాంత్ లోక్ ప్రాంతంలో జరిగింది. టెన్నిస్‌లో తళుక్కున వెలిగిన రాధికా యాదవ్‌కు చివరగా ఎదురైంది కోర్ట్ బౌండ్ కాదు… తండ్రి చేతిలోని తుపాకీ బుల్లెట్!
ఉదయం బ్రేక్‌ఫాస్ట్.. అప్పటికే రక్తసిక్తం!
గురువారం ఉదయం.. రాధికా తన కిచెన్‌లో బ్రేక్‌ఫాస్ట్ తయారుచేస్తోంది. అప్పుడే వచ్చిన ఆమె తండ్రి డీపక్ యాదవ్ 32 బోర్ లైసెన్స్‌డ్ రివాల్వర్‌తో ఐదు రౌండ్లు కాల్పులు జరిపాడు. అందులో 3 ఆమె నడుమునకు తాకి కుప్పకూల్చాయి. పక్కనే ఉన్న మామ కుల్దీప్ పరుగెత్తుకొని పైకి వచ్చేసరికి రాధికా రక్తపు కొలాబులో పడిపోగా, తండ్రి గన్‌ను డ్రాయింగ్ రూమ్‌లో వదిలి బయటకు వెళ్లిపోయాడు.
ప్రాణాల కన్నా గౌరవమే ఎక్కువైందా?
పోలీసుల విచారణలో తండ్రి చెప్పిన మాటలు సంచలనం రేపుతున్నాయి. గ్రామంలో నన్ను చూసి నవ్వుతున్నారు.. కూతురి మీద ఆధారపడుతున్నానని. అందుకే టెన్నిస్ అకాడమీ మూసేయమని చెప్పినా వినలేదు అన్నాడు డీపక్.
అయితే స్థానికులు మాత్రం ఇది పూర్తిగా అబద్దమంటున్నారు. దీపక్ యాదవ్‌కు నెలకు రూ.15 లక్షల నుంచి రూ.17 లక్షల వరకూ రెంటల్ ఆదాయం వస్తుంది. గురుగ్రామ్‌లో ఫాంహౌస్, బిల్డింగ్స్ ఉన్నాయి. ఎవరు అతనిని ఈ మాటలు అంటారు? అంటూ స్థానికులు తెలుపుతున్నారు.
టెన్నిస్ కోసం తండ్రి చేసిన త్యాగం.. అదే చివరికి?
రాధికా టెన్నిస్‌లో ప్రొఫెషనల్ కెరీర్ ప్రారంభించిందంటే… ఆ క్రెడిట్‌లో దీపక్ పాత్ర చాలా ఉంది. రాకెట్లకే రెండు లక్షలు ఖర్చుపెట్టాడు. చదువులు మధ్యలో ఆపి, కూతురిని కోచ్ చేసినవాడు అతనే అని గ్రామస్తులే చెబుతున్నారు.
అయితే అదే తండ్రి ఆమె స్వతంత్ర ఆర్థిక స్థితి, సోషల్ మీడియా యాక్టివిటీ, మ్యూజిక్ వీడియోలపై అసహనం పెంచుకున్నాడని, పోలీసులు చెబుతున్నారు.
Also Read: Vijayawada Railway Station: విజయవాడ స్టేషన్ కు న్యూ లుక్.. ఎయిర్ పోర్ట్ కు మించిందిగా!
కుటుంబం మధ్య సుతిమెత్తైన గొడవ.. చివరికి గుండెలపై బుల్లెట్!
రాధికా తన తల్లిదండ్రులతో సెక్టార్ 57లోని ఇంట్లో ఉండేది. కింద మామ కుటుంబం ఉంటారు. కాల్పుల శబ్దం వినగానే పరిగెత్తి వచ్చి ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లినా.. అప్పటికే చాలా ఆలస్యమైపోయింది. ఆసియా మారింగో ఆసుపత్రిలో డాక్టర్లు ఆమె మృతి చెందినట్లుగా ప్రకటించారు.
తండ్రి కాల్చిన కూతురు. అది కూడా తాను అండగా నిలబెట్టిన కూతురు! ఈ కథలో గందరగోళం ఉంది. కోపం ఉందా? మానసిక అస్థిరతా? అసూయా? అభిమానం మారు రూపమా? సంపద, గౌరవం, కుటుంబ ప్రతిష్ట.. ఇవన్నీ రాధికాకు ఎందుకు రక్షణ ఇవ్వలేకపోయాయి? అసలు ఏమైంది అన్నది పోలీసుల విచారణలో వెల్లడి కావాల్సి ఉంది.