BigTV English

Shubman Gill: గిల్ వికెట్ తీసేందుకు ఇంగ్లాండ్ కుట్రలు.. క్షుద్ర పూజలు చేసి మరీ!

Shubman Gill: గిల్ వికెట్ తీసేందుకు ఇంగ్లాండ్ కుట్రలు.. క్షుద్ర పూజలు చేసి మరీ!

Shubman Gill: టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే ఇప్పటికే ఈ రెండు జట్ల మధ్య మూడు టెస్టులు పూర్తికాగా… నిన్నటి నుంచి నాలుగో టెస్ట్ ప్రారంభమైంది. అయితే ఈ నాలుగో టెస్ట్ మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా… మొదటిరోజు ముగిసే సమయానికి నాలుగు వికెట్లు నష్టపోయి 264 పరుగులు చేసింది. ఇందులో టీమిండియా కెప్టెన్ గిల్ వికెట్ వివాదాస్పదమైంది. ఈ మ్యాచ్ లో గిల్ వివాదాస్పదంగా ఎల్బిడబ్ల్యూ అవుట్ అయ్యాడు. దీంతో అది నాటౌట్ అంటూ.. సోషల్ మీడియాలో దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు క్రికెట్ అభిమానులు. గిల్ అవుట్ కాదని… అంపైర్ తప్పుడు నిర్ణయం కారణంగా గిల్ అవుట్ అయినట్లు మండిపడుతున్నారు.


Also Read: Sai Sudarshan: సాయి సుదర్శన్ సైంటిస్టుల రాస్తున్నాడు.. శిష్యుడిలా సుందర్ చూస్తున్నాడు… ఏంట్రా ఇద్దరి గోల.. ముందు టీమిండియాను గెలిపించండిరా

గిల్ పై క్షుద్ర పూజలు చేసిన ఇంగ్లాండ్


టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య నాలుగో టెస్ట్ నిన్నటి నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే ఈ టెస్ట్ నేపథ్యంలో మొదటి రోజు 83 ఓవర్లు ఆడిన టీమిండియా…. నాలుగు వికెట్లు నష్టపోయి 264 పరుగులు చేసింది. అయితే ఈ మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ గిల్ వికెట్ వివాదాస్పదమైంది. ఈ మ్యాచ్ లో బెన్ స్టోక్స్ బౌలింగ్ లో టీమిండియా కెప్టెన్ గిల్ అవుట్ అయ్యాడు. బెన్ స్టోక్స్ వేసిన అద్భుతమైన డెలివరీకి… ఎల్బీడబ్ల్యుగా వెనుతిరిగాడు గిల్.

అయితే స్టోక్స్ వేసిన బంతిని… బ్యాట్ తో టచ్ చేయకుండా.. బ్యాట్ ను పైకి ఎత్తాడు గిల్. అయితే బంతి గిరున్న తిరిగి గిల్ ప్యాడ్స్ కు తాకింది. దీంతో ఎల్బీడబ్ల్యూ గా అవుట్ అయ్యాడు. అయితే ఈ అవుట్ పై చాలామంది రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అసలు అది అవుట్ కాదని… అంపైర్ కావాలనే తప్పుడు నిర్ణయాన్ని ప్రకటించాడని కామెంట్స్ చేస్తున్నారు. గిల్ వికెట్ తీసేందుకు ఇంగ్లాండ్ ఆటగాళ్లు క్షుద్ర పూజలు చేశారని మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. కామెంట్ చేయడమే కాదు క్షుద్ర పూజలు చేసినట్లు ఫోటోలను కూడా వైరల్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

ఇది ఇలా ఉండగా నాలుగో టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో గిల్ తక్కువ పరుగులకే అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్ లో గిల్ 23 బంతులు ఆడి 12 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒక బౌండరీ కూడా ఉంది. గత మ్యాచ్లలో సెంచరీలు నమోదు చేసిన గిల్… తాజా మ్యాచ్ లో మాత్రం అడ్డంగా దొరికిపోయాడు. ఇక ప్రస్తుతం గ్రీజులో టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా 20 పరుగులు అలాగే శార్దుల్ ఠాకూర్ 20 పరుగులతో ఉన్నారు.

Also Read: Rishabh Pant Injury: రిషబ్ పంత్ తీవ్రమైన గాయం.. అంబులెన్స్ లో తరలింపు.. మొదటి రోజు మ్యాచ్ వివరాలు ఇవే

Related News

IND VS PAK: అభిషేక్‌ దుమ్ములేపాడు… సూప‌ర్ 4 లోనూ టీమిండియా విజ‌యం.. షేక్ హ్యాండ్ మళ్ళీ లేదు

IND Vs PAK : Ak 47 గ‌న్స్ పేల్చుతూ పాకిస్థాన్ సెల‌బ్రేష‌న్స్‌.. టీమిండియా టార్గెట్ ఎంతంటే

Rohith Sharma : టీమిండియా కోచ్ గా రోహిత్ శర్మ… త్వరలోనే రిటైర్మెంట్?

IND Vs PAK : సీన్ రిపీట్… పాకిస్తాన్ పరువు తీసిన సూర్య కుమార్ యాదవ్

Asia Cup 2025 : బంగ్లా, శ్రీలంక మ్యాచ్ లో నాగిని డ్యాన్స్‌.. వీడియో చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే

IND Vs PAK : ఆసియా కప్ లో కలకలం… టీమిండియా ప్లేయర్లు అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్!

IND Vs PAK : టీమిండియా ఫ్యాన్స్ కు పాకిస్థాన్ ఆట‌గాడు ఆటోగ్రాఫ్‌…!

BCCI : బీసీసీఐలో ప్ర‌క్షాళ‌న‌..కొత్త అధ్య‌క్షుడు ఇత‌నే.. ఐపీఎల్ కు కొత్త బాస్

Big Stories

×