Prasidh Krishna : ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా మధ్య 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ జరిగిన విషయం తెలిసిందే. అయితే 5 మ్యాచ్ చివరి రోజు 35 పరుగులా.. 4 వికెట్లా..? ఓవల్ మైదానంలో అన్ని వైపులా తీవ్ర ఉత్కంఠ కొనసాగింది. ముఖ్యంగా ప్రసిద్ధ్ కృష్ణ వేసిన తొలి రెండు బంతుల్లో ఓవర్టన్ 2 ఫోర్లు వేసిన తొలి రెండు బంతుల్లో ఓవర్టన్ 2 ఫోర్లు బాదడంతో చేయాల్సిన దాంట్లో 20 శాతం పరుగులు ఇంగ్లాండ్ కి వచ్చేశాయి. కానీ ఆ తరువాత హైదరాబాద్ బౌలర్ సిరాజ్ బౌలింగ్ మొదలుపెట్టడంతో ఆట మళ్లీ మలుపు తిరిగింది. లక్ష్యం ఛేదించగల సత్తా ఉన్న జెమీ స్మిత్ తో పాటు ఓవర్టన్ ను వరస ఓవర్లలో సిరాజ్ వెనక్కి పంపాడు. అతనికి తోడు ప్రసిద్ధ్ కృష్ణ కూడా చెప్పి మరీ వికెట్ తీశాడు.
Also Read : Gautam Gambhir : డ్రెస్సింగ్ రూమ్ లో గౌతమ్ గంభీర్ చేసిన రచ్చ చూడండి
సిరాజ్ తో పాటు రాణించిన ప్రసిద్ధ్
ముఖ్యంగా ఇంగ్లాండ్ బ్యాటర్ జోష్ టంగ్ కి షార్ట్ బంతి వేస్తానని చెప్పాడు. దీంతో బ్యాట్స్ మెన్ కాస్త కన్ఫ్యూజ్ అయ్యాడు. ఇక ఆ తరువాత యార్కర్ వేశాడు. దీంతో టంగ్ క్లీన్ బోల్డ్ అయ్యాడు. టీమిండియా ఆటగాళ్లు సంబురాలు చేసుకున్నారు. చెప్పి మరీ వికెట్ తీయడంతో సిరాజ్ తో పాటు ప్రసిద్ధ్ కూడా అద్భుతంగా బౌలింగ్ చేశాడని నెటిజన్లు పొగుడుతున్నారు. ఈ మ్యాచ్ లో ప్రసిద్ద్ 27 ఓవర్లు నాలుగు వికెట్లు తీశాడు. సిరాజ్ 30.1 ఓవర్లు వేసి 5 వికెట్లు తీశాడు. అలాగే ఆకాశ్ దీప్ 20 ఓవర్లు వేసి 1 వికెట్ తీశారు. జడేజా, వాషింగ్టన్ సుందర్ వికెట్లు ఏమి తీయలేదు. మరోవైపు 5వ టెస్ట్ లో ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ తో వాగ్వాదానికి జట్టు ప్రణాళికలో భాగమే అని టీమిండియా పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ చెప్పాడు. రూట్ తో మైదానం బయటి నుంచి స్నేహమే ఉందన్నాడు.
రూట్ తో గొడవ ప్రణాళికలో భాగమే..
మ్యాచ్ లో జరిగే ఘర్షణను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నాడు. 5 టెస్ట్ రెండో రోజు ఆటలో రూట్, ప్రసిద్ధ్ మధ్య మాటల యుద్ధం జరిగడం.. మధ్యలో కేఎల్ రాహుల్ సైతం జోక్యం చేసుకోవడంతో గొడవ పెద్దది కావడంతో అంఫైర్లు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. దీనిపై ప్రసిద్ద్ స్పందిస్తూ.. అది చాలా చిన్న విషయమని.. రూట్.. తనకు మధ్య ఉన్న పోటీతత్వమే వాగ్వాదంగా మారింది. మైదానం బయట మేమిద్దరం స్నేహంగా ఉంటామని తెలిపాడు. రూట్ ను రెచ్చగొట్టడం మా ప్రణాళికలో భాగం.. నేను తననుద్దేశించి రెండు మాటలు అన్నాను. అతని నుంచి పెద్ద స్పందన వస్తుందనుకోలేదు. రూట్ ను నేను ఇష్టపడుతా. అతను ఆటలో ఓ దిగ్గజం అని.. బ్యాటర్ తో వాగ్వాదం మనలోని ఉత్తమ ప్రదర్శనను బయటికి తెస్తుంది అని పేర్కొన్నాడు ప్రసిద్ధ్. చివరి టెస్ట్ లో రెండో రోజు వెనుకబడ్డ భారత్.. తిరిగి పుంజుకోవడానికి ఆటగాళ్లలో ఉన్న పరస్పర నమ్మకమే కారణమని చెప్పాడు ప్రసిద్ధ్.
?igsh=b284dGViaDVuM2Rt