Yash Vagadia: ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టెస్ట్ మ్యాచ్ లో రెండు జట్లు కూడా అద్భుతంగా రాణిస్తున్నాయి. ప్రస్తుతం అయితే ఈ మ్యాచ్ లో రెండు జట్లకు 50- 50 ఛాన్సెస్ ఉన్నాయి. ఈ మ్యాచ్ లో ఇప్పటికే మూడు రోజులు పూర్తయ్యాయి. మరో రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇవాళ మ్యాచ్ ఎవరు గెలుస్తారనేది దాదాపు తేలిపోతుంది. ఒకవేళ డ్రా కూడా కావచ్చు. అయితే ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలని ఇంగ్లాండ్ కుట్రలు చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్త చెక్కర్లు కొడుతోంది. ఇండియాను ఓడించేందుకు రూల్స్ బ్రేక్ చేసి మరి… ఇంగ్లాండ్.. కొత్త వివాదానికి తెరలేపిందని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.
Also Read: Shakshi Dhoni: ధోని కాపురంలో వాటర్ బాటిల్ చిచ్చు…సాక్షికి ఇంత పొగరా అంటూ ట్రోలింగ్ ?
రూల్స్ బ్రేక్ చేసిన ఇంగ్లాండ్..
టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ లో అరుదైన సంఘటన జరిగింది. ఇంగ్లాండ్ కెప్టెన్ స్టోక్స్ అనుకోకుండా మైదానం వీడాడు. అయితే.. ఇంగ్లాండ్ కెప్టెన్ స్టోక్స్ బయటకు వెళ్తే…. డగవుట్ లో ఉన్న ఎవరో ఒకరు వచ్చి ఫీలింగ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇంగ్లాండ్ మాత్రం అలా చేయలేదు. అసలు స్క్వాడ్లో లేని ప్లేయర్ ను రంగంలోకి దింపింది ఇంగ్లాండ్. అంటే ఇంగ్లాండ్ కెప్టెన్ స్టోక్స్ స్థానంలో… క్లబ్ ప్లేయర్ యషు వగాడియా ను రంగంలోకి దింపారు. దీంతో నిన్న స్ట్రోక్స్ స్థానంలో అతడు ఫీల్డింగ్ చేశాడు.
అయితే స్ట్రోక్స్ స్థానంలో… ఇంగ్లాండ్ ప్లేయర్లలో ఎవరో ఒకరు ఫీల్డింగ్ చేయాలి కానీ స్క్వాడ్ లో లేని ప్లేయర్ ను ఎందుకు తీసుకువచ్చారని కొంతమంది ఫైర్ అవుతున్నారు. అయితే ప్రస్తుత నిబంధన ప్రకారం… అంపైర్ అనుమతి తీసుకొని సబిస్టిట్యూట్ గా ఎవరినైనా తీసుకోవచ్చని.. క్రీడా నిపుణులు చెబుతున్నారు. ఇది చాలా అరుదని కూడా కొంతమంది అంటున్నారు.
Also Read: David Lawrence: టీమిండియాతో టెస్ట్ సిరీస్… ఇంగ్లాండ్ క్రికెటర్ మృతి.. బ్లాక్ బ్యాడ్జీలతో !
గతంలో కూడా ఇలాంటి ఘటనలు
గతంలో కూడా… ఇలాంటి అరుదైన సంఘటనలు చాలానే జరిగాయి. సౌత్ ఆఫ్రికా జట్టు ఇందులో మొదటి వరుసలో ఉంది. ఒకానొక సమయంలో సౌత్ ఆఫ్రికా ప్లేయర్ ఇంజూర్ అయితే… జెపి డుమిని కోచ్ గా ఉంటూ….. ఫీల్డింగ్ కూడా చేశాడు. అయితే ఇది జరగడం చాలా కామన్ కానీ ఈ స్క్వాడ్లో లేని ప్లేయర్… ఇలా ఫీల్డింగ్ చేయడం మాత్రం తొలిసారి. ఇది ఇలా ఉండగా ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో… టీమిండియా బౌలర్లు అలాగే ఫీల్డర్స్ అత్యంత దారుణంగా విఫలమవుతున్నారు. టీమిండియా యంగ్ క్రికెటర్ యశస్వి జైష్వాల్ ఏకంగా 4 క్యాచ్లు వదిలిపెట్టాడు. ఒకవేళ ఈ మ్యాచ్లో టీమిండియా ఓడిపోతే దానికి కారణం యశస్వి జైస్వాల్ వదిలేసిన బంగారం లాంటి క్యాచ్ లే అవుతాయి.