David Lawrence: ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా మధ్య మొదటి టెస్ట్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే మొదటి టెస్ట్ లో ఇంగ్లాండ్ అద్భుతంగా రాణిస్తున్న నేపథ్యంలో ఆ జట్టుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు… ఫాస్ట్ బౌలర్ డేవిడ్ వాలెంటైన్ లారెన్స్ (David Valentine Lawrence ) మృతి చెందారు. తీవ్ర అనారోగ్యంతో 61 సంవత్సరాల వయసు లో లారెన్స్ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా మోటార్ న్యూరోన్ అనే భయంకరమైన వ్యాధితో లారెన్స్ బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ వ్యాధి విషమించడంతో… ఆదివారం రోజున అంటే ఇవాళ ఉదయం లారెన్స్ కన్నుమూశారు. దీంతో ఇంగ్లాండ్ క్రికెట్ జట్టులో తీవ్ర విషాదం నెలకొంది.
నివాళులర్పించిన టీమిండియా, ఇంగ్లాండ్ క్రికెటర్లు
ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు డేవిడ్ వాలెంటైన్ లారెన్స్ ఆకస్మిక మరణం నేపథ్యంలో… మొదటి టెస్ట్ ఆడుతున్న టీమిండియా అలాగే ఇంగ్లాండ్ ఆటగాళ్లు సంతాపం తెలిపారు. లీడ్స్ వేదికగా జరుగుతున్న మొదటి టెస్ట్ మూడవరోజు… ఇంగ్లాండ్ ఆటగాడు లారెన్స్ మృతి చెందారు. దీంతో ఈ మూడవరోజు మొత్తం బ్లాక్ బ్యాడ్జీలతో.. బరిలోకి దిగారు ఇరుజట్ల ప్లేయర్లు. అలాగే లారెన్స్ ఆత్మకు శాంతి చేకూరాలని దాదాపు రెండు నిమిషాల పాటు మౌనం కూడా పాటించారు ఇంగ్లాండ్ అలాగే భారత ప్లేయర్లు. ఈ సందర్భంగా ఇరుజట్ల ప్లేయర్లు భుజానికి నల్ల బ్యాడ్జీలు కట్టుకొని కనిపించారు. ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
టీమ్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ వివరాలు
లీడ్స్ వేదికగా జరుగుతున్న టీమ్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ లో రెండు జట్లు అద్భుతంగా రాణిస్తున్నాయి. మొదటి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ సమయంలో టీమిండియా అద్భుతంగా రాణించగా… అటు ఇంగ్లాండ్ కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేసింది అని చెప్పవచ్చు. ఈ మ్యాచ్ లో మొదటి ఇన్నింగ్స్ ఆడిన టీమిండియా… 471 పరుగులు చేసింది. అదే సమయంలో ఇంగ్లాండ్ 465 పరుగులు చేసి దుమ్ము లేపింది. ఇక టీమిండియా రెండవ ప్రారంభమైంది. ఇప్పటివరకు 23 ఓవర్లు ఆడిన టీమిండియా.. రెండు వికెట్లు నష్టపోయి 87 పరుగులు చేసింది. 93 పరుగుల లీడ్ సంపాదించింది టీమిండియా.
Also Read: Virat – Genelia :పెళ్లి పిల్లలు ఉన్నా తెలుగు హీరోయిన్ తో కోహ్లీ రొమాన్స్.. ఏకంగా లిఫ్టులోనే!
England and India players are wearing a black armband on Day 3️⃣ of the first Test to pay their respects to former England cricketer, David 'Syd' Lawrence who has passed away
📷: BCCI#ENGvIND #Tests #Headingley #Insidesport #CricketTwitter pic.twitter.com/HgunoVmPx0
— InsideSport (@InsideSportIND) June 22, 2025