Shakshi Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్రస్తుత కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చాలా సైలెంట్ గా ఉంటూ జట్టుకు ఎన్నో విజయాలను అందించిన మహేంద్రసింగ్ ధోని కుటుంబంతో ఎప్పుడూ ప్రశాంతంగా గడుపుతూ ఉంటారు. అయితే అలాంటి మహేంద్ర సింగ్ ధోని… భార్య సాక్షి ధోని.. చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ బాటిల్ విషయంలో సాక్షి ధోని చేసిన పని నెటిజెన్స్ ను ఆకట్టుకుంటుంది.
Also Read: Virat – Genelia :పెళ్లి పిల్లలు ఉన్నా తెలుగు హీరోయిన్ తో కోహ్లీ రొమాన్స్.. ఏకంగా లిఫ్టులోనే!
వాటర్ బాటిల్ చూసి షాక్ అయిన ధోని భార్య సాక్షి
మహేంద్ర సింగ్ ధోనితో పాటు సాక్షి ధోని ఇటీవల ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే ఈ సందర్భంగా… సాక్షి ధోని కి దాహం వేసింది. దీంతో అక్కడే ఉన్న కొంతమంది సిబ్బందిని తనకు వాటర్ కావాలని సాక్షి ధోని కోరింది. ఇంకేముంది అక్కడే ఉన్న సిబ్బంది వెంటనే… మహేంద్ర సింగ్ ధోని భార్య సాక్షి కి వాటర్ బాటిల్ తెచ్చి ఇచ్చారు. కిన్లే బ్రాండ్ వాటర్ ను సాక్షి ధోనీకి అందజేయడం జరిగింది. అయితే ఆ బాటిల్ పైన మహేంద్ర సింగ్ ధోని ఫోటో ఉంది.
ప్రస్తుతం kinley బాటిల్ బ్రాండ్ అంబాసిడర్ గా.. మహేంద్రసింగ్ ధోని ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే వాటర్ తాగే ముందు ఆ బాటిల్ పైన మహేంద్రసింగ్ ధోని ఫోటో చూసి షాక్ అయిన సాక్షి… కాస్త ప్రౌడ్ గా ఫీల్ అయింది. సాధారణంగా ఏ భర్త అయినా ఒక ఉన్నత స్థాయికి ఎదిగితే…. భార్య కచ్చితంగా సంతోషిస్తుంది. తన భర్త గొప్పవాడని పదిమందికి తెలియజేస్తుంది. అలాంటిది మహేంద్ర సింగ్ ధోని లాంటి భార్య సాక్షికి ఎంత ప్రౌడ్ నెస్ ఉండాలి. ఇక్కడ కూడా అదే జరిగింది. వాటర్ బాటిల్ పైన మహేంద్ర సింగ్ ధోని ఫోటోలు చూసి వెంటనే అవాక్కైనా సాక్షి ధోని.. పక్కన ఉన్న తన స్నేహితులకు కూడా చూపించింది. తన భర్త ఫోటో ఉన్న వాటర్ తాగుతున్నట్లు… తన కళ్ళతోనే చెప్పేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
ధోని భార్యకు ఇంత పొగరా ?
వాటర్ బాటిల్ చూసిన సాక్షి వీడియోని చూసిన క్రికెట్ అభిమానులు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ధోని లాంటి భార్యకు అంతటి పొగరు ఉండకూడదని… ధోని లాగా కూల్ గా ఉండాలని కొంతమంది అంటున్నారు. మరికొంతమంది మాత్రం ఉన్నత స్థాయిలో ఉన్న మహేంద్ర సింగ్ ధోని భార్య… సాక్షిస్థానంలో మరో మహిళ ఉన్న కూడా అలాగే ఫీలయ్యేదని మరికొంతమంది సపోర్ట్ గా నిలుస్తున్నారు. మొత్తానికి ఈ వీడియో నేపథ్యంలో మహేంద్రసింగ్ ధోని భార్యపై రకరకాల కామెంట్లు వస్తున్నాయి.
?igsh=bHp1MXN6Z3dxamZ3