E-Paper
Advertisement

MS ధోని కంటే, మ‌హ్మ‌ద్ రిజ్వానే గొప్ప వికెట్ కీప‌ర్‌

MS ధోని కంటే, మ‌హ్మ‌ద్ రిజ్వానే గొప్ప వికెట్ కీప‌ర్‌
Advertisement

Tanveer Ahmed On Rizwan:  పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ నిత్యం ఏదో ఒక అంశంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. పొద్దున లేచిన నుంచి రాత్రి పడుకునే వరకు ఇండియాను ఎలా బ్లేమ్ చేయాలి అన్న కాన్సెప్ట్ తో చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంటాడు. అదే సమయంలో పాకిస్తాన్ ముందు టీమిండియా దేనికి పనికిరాదన్నట్లుగా వ్యవహరిస్తూ ఉంటారు. అలాంటి పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ (Tanveer Ahmed )… మహేంద్ర సింగ్ ధోని కీర్తిని కించపరిచేలా వ్యవహరించారు.

MS ధోని కంటే, మ‌హ్మ‌ద్ రిజ్వానే గొప్ప వికెట్ కీప‌ర్‌

మహమ్మద్ రిజ్వాన్ ముందు మహేంద్ర సింగ్ ధోని ( Ms Dhoni) వికెట్ కీపింగ్ దేనికి పనికి రాదని బాంబు పేల్చారు. ప్రపంచంలోనే ధోని అత్యుత్తమ క్రికెటర్ అని ప్రచారం చేస్తున్నారు.. కానీ అతడి కంటే మహమ్మద్ రిజ్వాన్ ( Mohammad Rizwan) టెక్నిక్ ఉన్న వికెట్ కీపర్ అని హాట్ కామెంట్స్ చేశారు. టీమిండియాలో మహేంద్రసింగ్ ధోని ఉన్నాడు కాబట్టి… అతని హీరో అని పిలుస్తున్నారని ఫైర్ అయ్యారు. నిజానికి తన దృష్టిలో మహమ్మద్ రిజ్వాన్ గొప్ప వికెట్ కీపర్ అని ప్రశంసించారు. అతని ముందు ఎవరు పనికిరారని తేల్చి చెప్పారు.

Advertisement

Mohammad Yousuf On IND VS PAK: రాసి పెట్టుకోండి…పాకిస్తాన్ ను ఓడించే శ‌క్తి, టీమిండియాకు లేదు

నిత్యం టీమ్ ఇండియా పై విషం కక్కే తన్వీర్ అహ్మద్… ఇప్పుడు మహేంద్ర సింగ్ ధోని ని గెలిచారు. ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెటర్ గా పేరుగాంచిన మహేంద్రసింగ్ ధోని వికెట్ కీపింగ్ ను కించపరిచేలా వ్యవహరించారు. అసలు పాకిస్తాన్ జట్టులో స్థానం దక్కించుకోలేకపోతున్న మహమ్మద్ రిజ్వాన్ గొప్ప వికెట్ కీపర్ అని ప్రశంసించారు. ధోని కంటే రిజ్వాన్ తోపు వికెట్ కీపర్ అని వెల్లడించారు. మహేంద్ర సింగ్ ధోని కంటే వేగంగా మహమ్మద్ రిజ్వాన్ స్టంపింగ్ చేస్తాడని ప్రకటించారు.

Advertisement

ప్రతి మ్యాచ్ లో ఎలాంటి తప్పిదాలు చేయకుండా వికెట్ కీపింగ్ చేయడంలో దిట్ట అన్నారు. ధోని కంటే వేగంగా, పరుగులేమి ఇవ్వకుండా జట్టుకు రిజ్వాన్ ఎంతో తోడ్పడుతున్నాడని కీలక వ్యాఖ్యలు చేశారు. వికెట్ల వెనుక మహమ్మద్ రిజ్వాన్ ఉంటే.. ముందుకు వెళ్లి ఆడడానికి 10 సార్లు బ్యాటర్లు ఆలోచిస్తారని షాకింగ్ కామెంట్స్ చేశారు. కానీ ధోని గొప్ప వికెట్ కీపర్ అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

ధోని వర్సెస్ రిజ్వాన్ లో ఎవరు బెస్ట్ వికెట్ కీపర్ ?

మహమ్మద్ రిజ్వాన్ వర్సెస్ మహేంద్రసింగ్ ధోనిలో ఎవరు బెస్ట్ వికెట్ కీపర్ అనే విషయాన్ని పరిశీలిస్తే.. కళ్ళు మూసుకొని ధోని పేరు చెప్పవచ్చు. ఇప్పటివరకు మహేంద్రసింగ్ ధోని 538 మ్యాచులు ఆడాడు. రిజ్వాన్ 211 ఆడడం జరిగింది. 829 మందిని వికెట్ కీపర్ గా పెవిలియన్ కు పంపాడు ధోని. అదే రిజ్వాన్ 251 మందిని ఔట్ చేయగలిగాడు. ధోని 634 క్యాచ్ లు అందుకోగా రిజ్వాన్ 24 పట్టుకున్నాడు. స్టంపింగ్స్ ధోని 195 చేయగా.. రిజ్వల్ 47 మాత్రమే చేయడం జరిగింది. ఈ లెక్కన ధోనీ కాలి గోటికి కూడా రిజ్వాన్ సరిపోడు అన్నమాట.

Virender Sehwag On 2027 Odi World Cup: బుమ్రాను ప‌క్క‌కు పెట్టి.. ష‌మీ, సిరాజ్‌, భువ‌నేశ్వ‌ర్ ల‌ను తీసుకోండి

 

Related News

మ‌హ్మ‌ద్ సిరాజ్ బ్యాట్ లో AI చిప్స్‌…చెక్ చేసిన జ‌య‌సూర్య‌!

ఐపీఎల్ స‌మ‌యంలో ప్లేయ‌ర్లు పీక‌ల‌దాకా తాగేవాళ్లు…CSK ప్లేయ‌ర్ ఆరోప‌ణ‌లు

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం బ్రహ్మాస్త్రం వ‌దులుతోన్న‌ పాకిస్తాన్..ఇక ప్ర‌త్య‌ర్థుల‌కు చుక్క‌లే

పాకిస్తాన్ జ‌ట్టులో మ‌ళ్లీ పెను ప్ర‌కంప‌న‌లు..PCBకి షాహిద్ అఫ్రిది హెచ్చ‌రిక !

1990 స‌మ‌యంలో ప్ర‌తీ మ్యాచ్ లోనూ టీమిండియాను చిత్తుగా ఓడించేవాళ్లం

ఎవ‌డికి ఇచ్చేది లేదు…2027 వ‌ర‌ల్డ్ క‌ప్ వ‌ర‌కు నేనే కెప్టెన్‌

వివాదంలో ఆజం ఖాన్…డాలర్ నోటుతో చెమ‌టలు తుడుచుకుంటూ

Big Stories

Advertisement
×