E-Paper
Advertisement

ఐపీఎల్ స‌మ‌యంలో ప్లేయ‌ర్లు పీక‌ల‌దాకా తాగేవాళ్లు…CSK ప్లేయ‌ర్ ఆరోప‌ణ‌లు

ఐపీఎల్ స‌మ‌యంలో ప్లేయ‌ర్లు పీక‌ల‌దాకా తాగేవాళ్లు…CSK ప్లేయ‌ర్ ఆరోప‌ణ‌లు
Advertisement

Cheteshwar Pujara On IPL:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ (Indian Premier League tournament) చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. ఇప్పటికే 19 సీజన్లు పూర్తి చేసుకుంది ఐపిఎల్. 2027 టోర్నమెంట్ కోసం ఇప్పటి నుంచి బీసీసీఐ కసరత్తులు మొదలు పెట్టింది. ఇలాంటి నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ గురించి మాజీ క్రికెటర్ చతేశ్వర్ పుజారా (Cheteshwar Pujara) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ జరిగినన్ని రోజులు అందులో పాల్గొనే క్రికెటర్లు అర్ధరాత్రి వరకు పీకలదాకా తాగుతారని పేర్కొన్నారు. పబ్బుకు వెళ్లి.. ఎంజాయ్ చేస్తారని వివరించారు. అర్ధరాత్రి మ్యాచ్ ఫినిష్ అయిన తర్వాత… ఉదయం బ్రేక్ ఫాస్ట్ వరకు తాగుకుంటూ ఎంజాయ్ చేసేవార‌ని వెల్ల‌డించారు.

ఐపీఎల్ స‌మ‌యంలో ప్లేయ‌ర్లు పీక‌ల‌దాకా తాగేవాళ్లు – చతేశ్వర్ పుజారా

టీమిండియా సీనియర్ క్రికెటర్ మాజీ క్రికెటర్ చతేశ్వర్ పుజారా (Cheteshwar Pujara) ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ అంటే ఫారెన్ కల్చర్ అయిపోయిందని ఇబ్బంది పడ్డారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ తాను ఆడినప్పుడు.. ప్లేయర్ లందరూ అర్ధరాత్రి దాటాక పార్టీలో పాల్గొనే వాళ్ళని వివరించారు. పంచాయతీ ఓనర్లు భారీ ఎత్తున పార్టీలను నిర్వహించే వారిని గుర్తు చేశారు. ఈ క్రమంలో మన టీం ఇండియాతో పాటు విదేశీ క్రికెటర్లు కూడా ఆ పార్టీల్లో మునిగి తేలేవారని బాంబు పేల్చారు మాజీ క్రికెటర్ చతేశ్వర్ పుజారా.

Advertisement

Virender Sehwag On 2027 Odi World Cup: బుమ్రాను ప‌క్క‌కు పెట్టి.. ష‌మీ, సిరాజ్‌, భువ‌నేశ్వ‌ర్ ల‌ను తీసుకోండి

అయితే తాను మాత్రం అర్ధరాత్రి ఒంటిగంట తర్వాత హోటల్ రూమ్ కు వచ్చి పడుకునే వాడినని గుర్తు చేశారు. మళ్లీ ఉదయం ఏడు గంటలకు సమయంలో బ్రేక్ ఫాస్ట్ కు సిద్ధమయ్యే వాడిని స్పష్టం చేశారు. కానీ మిగిలిన క్రికెటర్లు అందరూ తెల్లార్లు ఆ నైట్ పార్టీలో పాల్గొని.. పీకలదాకా తాగే వాళ్లని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇక బ్రేక్ ఫాస్ట్ సమయానికి నేరుగా నిద్రపోకుండా స‌ద‌రు క్రికెటర్లు వచ్చేవారని వివరించారు. అప్పుడు వాళ్ళ ముఖాలు నిద్ర లేక వాలి పోయేవని గుర్తు చేశారు. ఇదంతా ఫార‌న్ కల్చర్ అని పేర్కొన్నారు. దాన్ని ఐపిఎల్ ద్వారా మన ఇండియన్ క్రికెటర్లకు కూడా రుద్దినట్లు విదేశీ క్రికెటర్ల పై మండిపడ్డారు మాజీ క్రికెటర్ చతేశ్వర్ పుజారా (Cheteshwar Pujara).

చతేశ్వర్ పుజారా ఐపిఎల్ కెరీర్

Advertisement

టీమిండియా ఒకప్పటి స్టార్ క్రికెటర్ మాజీ క్రికెటర్ చతేశ్వర్ పుజారా (Cheteshwar Pujara) ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో దాదాపు నాలుగు ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించాడు. మొదట 2008 నుంచి 2010 వరకు కేకేఆర్ జట్టు తరఫున ఆడాడు. ఆ తర్వాత బెంగళూరుకు వెళ్లిన చతేశ్వర్ పుజారా.. 2014 సీజన్ లో పంజాబ్ తరఫున బరిలోకి దిగాడు. చివరగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో 2021 ఐపీఎల్ సందర్భంగా చేరాడు. అయితే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరుపున ఒక్క మ్యాచ్ ఆడకుండానే రిటైర్మెంట్ ఇచ్చేశాడు. ఇప్పటి వరకు 30 మ్యాచ్ లు ఆడిన చతేశ్వర్ పుజారా కేవలం 390 పరుగులు మాత్రమే చేశాడు. టెస్ట్ ప్లేయర్ అన్న ముద్ర ఉన్న నేపథ్యంలో ఇతడికి ఐపీఎల్ లో ఎక్కువగా అవకాశాలు రాలేదు.

 

 

Mohammad Yousuf On IND VS PAK: రాసి పెట్టుకోండి…పాకిస్తాన్ ను ఓడించే శ‌క్తి, టీమిండియాకు లేదు

Related News

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం బ్రహ్మాస్త్రం వ‌దులుతోన్న‌ పాకిస్తాన్..ఇక ప్ర‌త్య‌ర్థుల‌కు చుక్క‌లే

పాకిస్తాన్ జ‌ట్టులో మ‌ళ్లీ పెను ప్ర‌కంప‌న‌లు..PCBకి షాహిద్ అఫ్రిది హెచ్చ‌రిక !

1990 స‌మ‌యంలో ప్ర‌తీ మ్యాచ్ లోనూ టీమిండియాను చిత్తుగా ఓడించేవాళ్లం

ఎవ‌డికి ఇచ్చేది లేదు…2027 వ‌ర‌ల్డ్ క‌ప్ వ‌ర‌కు నేనే కెప్టెన్‌

వివాదంలో ఆజం ఖాన్…డాలర్ నోటుతో చెమ‌టలు తుడుచుకుంటూ

ఒక్క మ్యాచ్ గెల‌వ‌గానే బాబ‌ర్ ను హీరో చేయకండి…తేడా వ‌స్తే 32 ప‌ళ్లు రాళ్లు రాల‌తాయి

సిరాజ్ ను అవ‌మానించిన గంభీర్..బౌండ‌రీ గేట్ ద‌గ్గరే ప‌చ్చిబూతులు

Big Stories

Advertisement
×