Kavya Maran On Travis Head: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2027 టోర్నమెంట్ (Indian Premier League 2027 tournament) కోసం ఇప్పటినుంచే పది ఫ్రాంచైజీలు ఎదురుచూస్తున్నాయి. వచ్చే సీజన్ లో టైటిల్ గెలిచేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే ట్రేడ్ విండో ఓపెన్ కావడంతో.. ఇతర జట్లలో ఉన్న ప్లేయర్లపై కన్నేస్తున్నాయి ఫ్రాంచైజీలు. ఇందులో భాగంగానే 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) కోసం కావ్య పాప స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. వచ్చే ఐపీఎల్ నేపథ్యంలో అతడు వేలంలోకి వస్తే తీసుకునేందుకు సిద్ధమయ్యారట. లేదా ట్రేడ్ ప్రక్రియ ద్వారా రాజస్థాన్ రాయల్స్ తో చర్చలు జరిపేందుకు కూడా సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్ని కోట్లయినా 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ ను కొనుగోలు చేసేందుకే ఆమె కంకణం కట్టుకున్నట్లు క్రీడా విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంటులో చెత్త ప్రదర్శన కనబరిచిన ట్రావెల్స్ హెడ్ ను వదిలించుకునేందుకు కావ్య సిద్దమైనట్లు తెలుస్తోంది. మొన్నటి సీజన్ సందర్భంగా అభిషేక్ శర్మ అద్భుతంగా రాణించినప్పటికీ.. హెడ్ మాత్రం విఫలమయ్యాడు. గత సీజన్ లో 15 మ్యాచ్ లు ఆడిన హెడ్, 410 పరుగులు మాత్రమే సాధించాడు. కీలకమైన సమయాలలో చేతులెత్తేశాడు. 76 పరుగులే అతని హైయెస్ట్ స్కోర్. 2026 ఐపిఎల్ సందర్భంగా కేవలం రెండు అర్థ సెంచరీలు మాత్రమే నమోదు చేశాడు. యావరేజ్ 27.33గానే ఉంది.
అంటే అత్యంత పేలవమైన ప్రదర్శన అని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే అతడిని వదిలేసి.. 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీని ట్రేడ్ లేదా వేలంలో కొనుగోలు చేసేందుకు కావ్య సిద్దమయ్యారట. ప్రస్తుతం హెడ్ కు 14 కోట్లు చెల్లిస్తున్నారు. అతనితోపాటు… లివింగ్ స్టోన్ ను వదిలేసుకుంటే దాదాపు 30 కోట్లు మిగులుతాయి. ఈ డబ్బులు కేవలం వైభవ్ పై ఖర్చు చేసేందుకు కావ్య ముందడుగు వేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ఎలిమినేటర్ మ్యాచ్ సందర్భంగా ఓడిపోయి.. ఇంటిదారి పట్టింది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు. అయితే ఐపీఎల్ 2027 టోర్నమెంటులో అలాంటి పరిస్థితులు రాకుండా ఉండేందుకు ఇప్పటి నుంచే చర్యలు తీసుకుంటున్నారు కావ్య పాప. ఈ క్రమంలోనే కీలక ప్లేయర్లను జట్టులోకి తీసుకోవాలని అనుకుంటున్నారు. మరి కొంతమందిని వదిలేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్, లియామ్ లివింగ్ స్టోన్, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, ట్రావిస్ హెడ్, మెండిస్, డేవిడ్ షైన్, కార్స్ లాంటి వాళ్లను వదిలేసి… కొత్త వాళ్లను తీసుకునే ఛాన్సులు ఉన్నాయి. ఐపీఎల్ మెగా వేలం జరగనున్న నేపథ్యంలో భారీ స్కెచ్ వేసింది కావ్య. కీలక ప్లేయర్ల కోసం మాత్రమే ఆమె ప్రయత్నాలు చేస్తున్నారు.
Mohammad Yousuf On IND VS PAK: రాసి పెట్టుకోండి…పాకిస్తాన్ ను ఓడించే శక్తి, టీమిండియాకు లేదు