Mohsin Naqvi – Odi World Cup 2027: 2027 వన్డే వరల్డ్ కప్ (2027 ODI World Cup) గెలిచే లక్ష్యంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ( Pakistan Cricket Board) ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగానే పాకిస్తాన్ జట్టుకు ఏం కావాలో అది చేసిపెడుతోంది. క్రికెటర్లు అందరినీ కూడా ఒకే తాటిపైకి తీసుకువచ్చి.. ప్రాక్టీస్ చేయిస్తోంది. ఈసారి ఎలాగైనా టైటిల్ కొట్టాలన్న కసితో కనిపిస్తోంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ క్రికెటర్లందరూ వన్డే ఫార్మాట్ కు అలవాటు పడేలా పాకిస్తాన్ నేషనల్ ఛాంపియన్స్ కప్ ట్రోఫీని ( Pakistan National Champions Cup Trophy) ఇవాల్టి నుంచి ప్రారంభించింది. నేటి నుంచి ఆగస్టు 18వ తేదీ వరకు అంటే ఏడు రోజుల పాటు ఈ మెగా ఈవెంట్ జరగనుంది. ఈ క్రమంలోనే ట్రోఫీ కూడా లాంచ్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి.
పాకిస్తాన్ నేషనల్ ఛాంపియన్స్ కప్ ట్రోఫీ తాజాగా PCB లాంచ్ చేసింది. షాహిన్ అఫ్రిది, షాబాద్ ఖాన్, ఫర్హాన్, సైమ్ అయూబ్ కెప్టెన్లు ఈ ట్రోఫీని లాంచ్ చేశారు. అయితే ఈ పాకిస్తాన్ నేషనల్ ఛాంపియన్స్ టోర్నమెంట్ కు సంబంధించిన ట్రోఫీ… 2027 వన్డే వరల్డ్ కప్ తరహాలోనే ఉంది. పైన గుండ్రటి బంతి ఆకారం… కింద మూడు పిల్లర్లు అచ్చం 2027 వన్డే వరల్డ్ కప్ ను అచ్చు దించేసింది. సోషల్ మీడియాలో ఈ ట్రోఫీని చూస్తే 2027 వన్డే వరల్డ్ కప్ నకు సంబంధించిన ట్రోఫీ అని అనుకోవాల్సిందే. అచ్చం అలాగే ఉంది.
దీంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీపై దారుణంగా ట్రోలింగ్ మొదలైంది. ఆసియా కప్ 2025 ట్రోఫీని దొంగిలించినట్లుగానే.. 2027 వన్డే వరల్డ్ కప్ టైటిల్ ను మొహ్సిన్ నఖ్వీ దొంగతనం చేసి ఉంటాడని సెటైర్లు పేల్చుతున్నారు. మనోడికి దొంగతనం ఇప్పటికే అలవాటు కాబట్టి.. ఈ ట్రోఫీని దొంగిలించినట్లు చెబుతున్నారు. 2027 వన్డే వరల్డ్ కప్ లో గ్రూప్ స్టేజిలో పాకిస్తాన్ ఎలిమినేట్ అయ్యే ప్రమాదం ఉందని ఇప్పటికే నిపుణులు చెబుతున్నారు. అందుకే తెలివిగా ఇప్పుడే దొంగతనం చేసి.. ఈ పాకిస్తాన్ నేషనల్ ఛాంపియన్స్ ట్రోఫీ లాగా లాంచ్ చేశారని సంచలన ఆరోపణలు వస్తున్నాయి.
2025 ఆసియా కప్ టోర్నమెంట్ సందర్భంగా పాకిస్తాన్ జట్టును మూడు సార్లు ఓడించి టైటిల్ దక్కించుకుంది టీమిండియా. అయితే ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ గా మొహ్సిన్ నఖ్వీ ఉన్న నేపథ్యంలో.. అతని చేతుల మీదుగానే ఆసియా కప్ 2025 ట్రోఫీ అందుకోవాల్సి ఉంటుంది. అప్పటికే పహల్గామ్ సంఘటన నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెటర్లకు షేక్ హ్యాండ్ కూడా ఇవ్వడం లేదు సూర్య కుమార్ యాదవ్ సేన. అందుకే మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా టైటిల్ కూడా తీసుకోలేదు. దీన్ని ఆసరా చేసుకొని టైటిల్ ను తన ఆఫీసుకు తీసుకువెళ్లాడు మొహ్సిన్ నఖ్వీ. దీంతో అప్పటి నుంచి ట్రోఫీ దొంగలించాడని మొహ్సిన్ నఖ్వీని ట్రోలింగ్ చేస్తున్నారు.
Mohammad Yousuf On IND VS PAK: రాసి పెట్టుకోండి…పాకిస్తాన్ ను ఓడించే శక్తి, టీమిండియాకు లేదు