BigTV English

Ind Vs Nz: బెంగుళూరు టెస్ట్.. కష్టాల్లో టీమిండియా! 46 పరుగులకే ఆలౌట్

Ind Vs Nz: బెంగుళూరు టెస్ట్.. కష్టాల్లో టీమిండియా! 46 పరుగులకే ఆలౌట్

Ind Vs Nz: కష్టాల్లో టీమిండియా (Team india) ఉంది. మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా బెంగుళూరు వేడుకగా న్యూజిలాండ్ తో (New Zealand) జరుగుతున్న తొలి టెస్టులో టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్లు ఆటలో దారుణంగా విఫలం కావడం జరిగింది. పది ఓవర్లలోనే భారత్ కీలక మూడు వికెట్లను కోల్పోయింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సర్ఫరాజ్ ఖాన్ వరుసగా పెవిలియన్ కు చేరుకున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు అనుకున్న మేర శుభారంభం దక్కలేదు. ఫేస్ కు అనుకూలిస్తున్న పిచ్ పైన న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్లు చెలరేగి ఆడారు.


Ind vs NZ 1st Test India under pressure as Kohli Sarfaraz depart for ducks

టిమ్ సౌథి, మ్యాట్ హెన్రి కొత్త బంతితో ఓపెనర్లు రోహిత్ ( Rohit), జైస్వాల్ ను (Jaishwal )ఆటలో తీవ్రంగా పరీక్షించారు. అయితే ఆరు ఓవర్ల పాటు ఎంతో ఓపికగా ఆడిన రోహిత్ తర్వాత ఎదురు దాడికి దిగాలని ఫిక్స్ అయ్యాడు. కానీ రోహిత్ ను ( Rohit) సౌథి క్లీన్ బౌల్డ్ చేశారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ , సర్ఫరాజ్ డకౌట్ అయ్యారు. ఓరుర్కె ( ORourke ) వేసిన బంతిని అంచనా వేయడంలో కోహ్లీ విఫలమై ఫిలిప్స్ చేతికి చిక్కాడు. కాస్త ఎక్స్ ట్రా బౌన్స్ అయిన బంతిని డిఫెండ్ కు ప్రయత్నించి లెగ్ గల్లీలో ఉన్న ఫిలిప్స్ కు దొరికిపోయాడు.

మరోవైపు మ్యాచ్ బౌలింగ్ లో సర్ఫరాజ్ ఓటమి పాలయ్యాడు. షాట్ కు ప్రయత్నించిన సర్ఫరాజ్ ఎక్స్ట్రా కవర్ లో ఉన్న కాన్వెకు చిక్కుకున్నాడు. కాన్వే అద్భుతంగా డైవ్ చేస్తూ క్యాచ్ ను అందుకున్నాడు. 12 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోన టీమిండియా…కేవలం 13 పరుగులు చేయడం జరిగింది. అప్పుడు క్రీజులో యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్ ఉన్నారు. ఆ సమయంలోనే.. మళ్లీ వర్షం ప్రారంభం అయింది. దీంతో ఆటను కాసేపు ఆపేశారు.


దాదాపు గంట పాటు మ్యాచ్‌ ఆగిపోయింది. అయితే.. వర్షం కాస్త తగ్గుముఖం పట్టడంతో… న్యూజిలాండ్ వర్సెస్‌ టీమిండియా మ్యాచ్‌ ను మళ్లీ ప్రారంభించారు. ఇక మ్యాచ్‌ ప్రారంభం అయిన తర్వాత కూడా వికెట్లు రాలిపోయాయి. లంచ్‌ సమయానికి 34 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి.. కష్టాల్లో పడింది టీమిండియా. ప్రస్తుతం రిషబ్‌ పంత్‌ 15 పరుగులతో బ్యాటింగ్‌ చేస్తున్నాడు.

Also Read: IND vs NZ 2024 Test Series: రేపటి నుంచే టెస్టు సిరీస్… హాట్‌స్టార్‌లో రాదు! ఫ్రీగా ఎలా చూడాలంటే..?

ఇదిలా ఉండగా…. న్యూజిలాండ్ పైన మూల్ టెస్టుల్లో విజయం సాధిస్తేనే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ పైన టీమిండియా తన పట్టును సాధిస్తుంది. లేకపోతే తర్వాత ఆస్ట్రేలియాతో టీమిండియా అన్ని మ్యాచ్లు గెలవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి న్యూజిలాండ్ పైన వరుసగా మ్యాచులు గెలిస్తేనే ఆస్ట్రేలియాపైన పోరాడవచ్చు. కానీ న్యూజిలాండ్ పైనే ఓడిపోతే ఆస్ట్రేలియాపైన టీమిండియా గెలవడం చాలా కష్టమవుతుంది. ఇది దృష్టిలో పెట్టుకొని ఆటను ఆడనుందని సమాచారం.

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×