E-Paper
Advertisement

Ind vs NZ 2nd ODI: నేడే రెండో వ‌న్డే..టీమిండియా ప్లేయ‌ర్లు ముగ్గురికి గాయాలు..ప్లేయింగ్ ఎలెవ‌న్ ఇదే

Ind vs NZ 2nd ODI: నేడే రెండో వ‌న్డే..టీమిండియా ప్లేయ‌ర్లు ముగ్గురికి గాయాలు..ప్లేయింగ్ ఎలెవ‌న్ ఇదే
Advertisement

Ind vs NZ 2nd ODI: టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఇవాళ రెండవ వన్డే జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే జనవరి 11వ తేదీన ఈ రెండు జట్ల మధ్య వన్డే సిరీస్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. తన తొలి వన్డే మ్యాచ్ లోనే అద్భుతంగా రాణించిన టీమిండియా, నాలుగు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఇక ఇవాళ రాజ్ కోట్ వేదికగా మరో పోరుకు సిద్ధమైంది టీమిండియా. ఈ మ్యాచ్ లో కూడా విజయం సాధించి, వన్డే టోర్నమెంట్ గెలవాలన్న కసితో ముందుకు వెళ్తోంది గిల్ సేన.

Also Read: Ayushi Soni retired out: WPLలోనే తొలిసారి రిటైర్డ్ ఔట్‌…రిజ్వాన్ కు జ‌రిగిన అవ‌మాన‌మే ఆయుషి సోనికి

రాజ్ కోట్ వేదికగా రెండవ వ‌న్డే

Advertisement

టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ ( India vs New Zealand, 2nd ODI ) మధ్య ఇవాళ రెండవ వన్డే జరగనుంది. పండుగ పూట రాజ్ కోట్ లో ఉన్న నిరంజన్ షా స్టేడియం ( Niranjan Shah Stadium, Khandheri, Rajkot ) వేదికగా ఈ రెండు జట్ల మధ్య రెండో వన్డే మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం 1:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. టాస్ ప్రక్రియ మధ్యాహ్నం ఒంటిగంటకు ఉండనుంది. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ ఫిక్స్ అయింది. రాజ్ కోట్ చేరుకున్న రెండు జట్లు ప్రాక్టీస్ లో మునిగి తేలుతున్నాయి. ఈ మ్యాచ్ జియో హాట్ స్టార్ వేదికగా ఉచితంగా చూడవచ్చు. స్టార్ స్పోర్ట్స్ లో కూడా తిలకించే ఛాన్సులు ఉంటాయి.

టీమిండియాను వణికిస్తున్న గాయాలు

న్యూజిలాండ్ వర్సెస్ టీమిండియా మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కాకముందే టి20 ఆటగాడు తిలక్ వర్మ వృషణాల సర్జరీ కారణంగా జట్టుకు దూరమయ్యాడు. అతడు టి20 వరల్డ్ కప్ ఆడేది కూడా డౌట్ గానే ఉంది. ఇక మొదటి వన్డే ప్రారంభం కంటే ఒక్కరోజు ముందు వికెట్ కీపర్ రిషబ్ పంత్ నడుముకు గాయమైన సంగతి తెలిసిందే. దీంతో వన్డే సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఇక వన్డే సిరీస్ ప్రారంభమైన తర్వాత మొదటి మ్యాచ్ లో వాషింగ్టన్ సుందర్ బ్యాక్ స్ట్రెయిన్ నొప్పి కారణంగా మిగిలిన రెండు వన్డేలకు కూడా దూరమయ్యాడు. రిషబ్ పంత్ స్థానంలో ధ్రువ్ జురెల్ బరిలోకి దిగనున్నాడు. ఇటు వాషింగ్టన్ సుందర స్థానంలో గంభీర్ కొత్త శిష్యుడు ఆయుష్ బడోని రంగంలోకి దిగుతాడట. ఇవాల్టి మ్యాచ్ లో కూడా ఆడతాడని సమాచారం.

టీమిండియా వ‌ర్సెస్ న్యూజిలాండ్ జ‌ట్ల అంచ‌నా

Advertisement

ఇండియా ప్రాబబుల్ ఎలెవన్: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్) రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి లేదా ఆయుష్ బ‌డోనీ, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.

న్యూజిలాండ్ ప్రాబబుల్ ఎలెవన్: డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్, విల్ యంగ్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ హే (వికెట్ కీపర్), మైఖేల్ బ్రేస్‌వెల్ (కెప్టెన్), జకారీ ఫౌల్క్స్, క్రిస్టియన్ క్లార్క్, కైల్ జామిసన్, ఆదిత్య అశోక్

Also Read: Bangladesh Minister: కాళ్లు ప‌ట్టుకున్నా ఇండియాలో అడుగుపెట్ట‌బోం..పాకిస్తాన్ లో టీ20 ప్ర‌పంచ క‌ప్ ఆడ‌తాం !

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

Big Stories

Advertisement
×