E-Paper
Advertisement

Ind vs NZ 2nd T20I: గ్రౌండ్ లోనే లేడీకి ప్ర‌పోజ్‌..టీమిండియా ముందు భారీ ల‌క్ష్యం..ఎంత టార్గెట్ అంటే

Ind vs NZ 2nd T20I: గ్రౌండ్ లోనే లేడీకి ప్ర‌పోజ్‌..టీమిండియా ముందు భారీ ల‌క్ష్యం..ఎంత టార్గెట్ అంటే

Ind vs NZ 2nd T20I: టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ ( India vs New Zealand, 2nd T20I ) మధ్య ఇవాళ రెండవ టి20 జరుగుతున్న సంగతి తెలిసిందే. రాయ్ పూర్ లోని షాహిద్ వీరనారాయణ సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ( Shaheed Veer Narayan Singh International Stadium, Raipur ) వేదికగా ఈ రెండవ టి20 జరుగుతోంది. ఇందులో టాస్ గెలిచి టీమిండియా బౌలింగ్ చేయగా.. న్యూజిలాండ్ మొదటి బ్యాటింగ్ చేసింది. పొగ మంచు విపరీతంగా ఉన్న నేపథ్యంలో బౌలర్లు దార‌ళంగా పరుగులు సమర్పించుకున్నారు. అర్షదీప్ సింగ్ లాంటి బౌలర్ కూడా 50కి పై పరుగులు సమర్పించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే నిర్ణీత 20 ఓవర్లు ఆడిన న్యూజిలాండ్ , 6 వికెట్లు నష్టపోయి 208 పరుగులు సాధించింది. ఇక 209 పరుగులు సాధిస్తే టీమిండియా విక్టరీ కొట్టనుంది.

Also Read: RCB Players-Indian roads: ఆర్సీబీ ప్లేయ‌ర్ల‌కు వేధింపులు..వీడియోలు తీస్తూ మ‌రీ..ఇండియాలో ప‌రువు తీస్తున్నారురా ?

టీమిండియా ముందు భారీ ల‌క్ష్యం

రాయపూర్ వేదికగా టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య రెండవ టి20 జరిగింది. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు భారీ స్కోరు సాధించింది. 20 ఓవర్లు ఆడి 208 పరుగులు సాధించింది న్యూజిలాండ్. టీమిండియా బౌలర్లు విపరీతంగా పరుగులు ఇవ్వడంతో ఈ పరిస్థితి నెలకొంది. కాన్వే 19 పరుగులు సాధించగా , రచిన్ రవీంద్ర 44 పరుగులతో దుమ్ము లేపాడు. టిమ్ 24 పరుగులు చేయగా ఫిలిప్స్ 19 పరుగులతో రాణించాడు. చివరలో న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ 47 పరుగులతో అదరగొట్టాడు. అటు ఈ మ్యాచ్లో కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టగా… వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రానా, హార్దిక్ పాండ్యా, శివం దుబే తలో వికట్ తీశారు.

రెండవ టి20లో టీమిండియా బౌలర్లు ఎక్కువగా పరుగులు ఇచ్చిన నేపథ్యంలో గౌతమ్ గంభీర్ పై సీరియస్ అవుతున్నారు అభిమానులు. మొదటి వన్డేలో అద్భుతంగా రాణించిన బుమ్రాను ఎందుకు తప్పించారని ఫైర్ అవుతున్నారు. అలాంటి డేంజర్ బౌలర్ బుమ్రా కాద‌ని, హర్షిత్ రాణాను ఎందుకు తీసుకువచ్చారని నిలదీస్తున్నారు ఫ్యాన్స్. మొదటి మ్యాచ్ లో గెలిచిన జట్టునే ఇప్పుడు రెండవ మ్యాచ్ కోసం వాడుకుంటే సరిపోయేది కదా ? అని చురకలు అంటిస్తున్నారు. కాగా మొదటి మ్యాచ్ లో అక్షర్ పటేల్ కు గాయం కాగా, అతని స్థానంలో కుల్దీప్ యాదవ్ వచ్చి రాణించాడు. ఇటు బుమ్రాకు రెస్టు ఇచ్చి హర్షిత్ రాణాను తీసుకువచ్చారు.

గ్రౌండ్ లోనే ప్రపోజ్

టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య నాగపూర్ వేదికగా మొట్టమొదటి మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా ఓ వ్యక్తి.. అమ్మాయికి ప్రపోజ్ చేశాడు. గ్రౌండ్ లోనే రింగ్ కూడా తొడిగాడు. వాళ్ళిద్దరు ఇప్పటికే ప్రేమలో ఉన్నారు. అయితే గ్రౌండ్ లో కొత్తగా ట్రై చేసి వైరల్ గా మారారు. ఈ వీడియో వైరల్ గా మారింది.

Also Read: Abhishek Sharma Net Worth: అభిషేక్ శ‌ర్మకు కోట్ల‌ల్లో ఆస్తులు..ఖ‌రీదైన కార్లు, బంగ్లాలు..ప్రియురాలు ఎవ‌రంటే ?

 

 

 

?igsh=Z25hbmdyM2VnM2l4

Related News

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Tanveer Ahmed: విరాట్ కోహ్లీ మ‌గాడైతే, పాకిస్తాన్ పిచ్ ల‌పై ఆడి చూపించాలి

లాహోర్ గ‌డ్డ‌పై విరాట్ కోహ్లీ ప్లకార్డులు…గూస్ బంప్స్ రావాల్సిందే

Big Stories

×