Big Stories

IND Vs NZ : అహ్మదాబాద్ లో మూడో టీ20.. సిరీస్ కైవసం కోసం భారత్ -కివీస్ ఫైట్..

IND Vs NZ : భారత్ -న్యూజిలాండ్ మధ్య మూడో టీ20 మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సిరీస్ లో తొలి మ్యాచ్ లో కివీస్ జయభేరి మోగించింది. స్వల్ప స్కోర్లు నమోదైన రెండో టీ20లో చివరి ఓవర్ ఐదో బంతికి భారత్ ను విజయం వరించింది. దీంతో సిరీస్ 1-1తో సమంగా ఉంది. అహ్మదాబాద్ లో జరిగే మూడో టీ20లో గెలిచి సిరీస్ ను కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో టీమిండియా ఉంది. అలాగే ఇండియాను ఎలాగైనా ఓడించిన సిరీస్ ను గెలవాలన్న లక్ష్యంతో కివీస్ బరిలోకి దిగుతుంది.

- Advertisement -

భారత్ జట్టుకు ఓపెనర్ల సమస్య వేధిస్తోంది. వన్డేల్లో డబుల్ సెంచరీతో చెలరేగిన ఇషాన్ కిషన్ , శుభ్ మన్ గిల్ తొలి రెండు మ్యాచ్ ల్లో విఫలమయ్యారు. ఈ ఇద్దరికి పోటీలో పృథ్వీ షా ఉన్నాడు. కీపర్ గా ఇషాన్ కిషన్ కు చోటు ఖాయం మరి…గిల్ స్థానంలో పృథ్వీ షాను తీసుకుంటారా? లేదో చూడాలి. ఇక వన్ డౌన్ బ్యాటర్ గా వరుస అవకాశాలు అందుకున్న రాహుల్ త్రిపాఠి విఫలమవుతున్నాడు. సూర్యకుమార్ యాదవ్ రెండు మ్యాచ్ ల్లోనూ రాణించాడు. రెండో టీ20లో బ్యాటింగ్ కు కఠినంగా మారిన పిచ్ పై ఎంతో సహనంతో తనశైలికి భిన్నంగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు.

- Advertisement -

ఆలౌరౌండర్ వాషింగ్టన్ సుందర్ తొలి వన్డేలో హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు. రెండో టీ20లో కుదురుగా ఆడుతున్న సమయంలో రనౌట్ అయ్యాడు. ఇక దీపక్ హుడా స్పిన్ కు అనుకూలించిన పిచ్ పై గత మ్యాచ్ బౌలింగ్ బాగానే చేశాడు. బ్యాటర్ గా హుడా రాణించాల్సిన సమయం వచ్చేసింది. ఇలా భారత్ బ్యాటింగ్ ఆర్డర్ బలంగానే కనిపిస్తోంది. బౌలింగ్ లో అర్షదీప్ గత మ్యాచ్ లో మళ్లీ గాడిలో పడ్డాడు. స్పిన్నర్ కులదీప్ బాగానే రాణిస్తున్నాడు. ఇక చివరి టీ20లో చాహల్ స్థానంలో ఉమ్రాన్ మాలిక్ కు చోటు దక్కే అవకాశం ఉంది.

న్యూజిలాండ్.. కాన్వే, అలెన్, మిచెల్, ఫిలిప్స్ లాంటి బ్యాటర్లతో పటిష్టంగానే ఉంది. ఇక బౌలింగ్ లో శాంటర్న్ , బ్రాస్ వెల్ బాగా బౌలింగ్ చేస్తున్నారు. బ్యాటింగ్ లోనూ ఈ ఇద్దరు రాణిస్తున్నారు. బ్యాటింగ్ కు అనుకూలించే అహ్మదాబాద్ పిచ్ పై హోరాహోరీ పోరు తప్పదు. ఈ మ్యాచ్ లో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. బుధవారం రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News