BigTV English

PM Kisan – 2025 : పీఎం కిసాన్ డబ్బులు విడుదల – మీకు డబ్బులు పడ్డయా, ఇలా చెక్ చేసుకోండి.

PM Kisan – 2025 : పీఎం కిసాన్ డబ్బులు విడుదల – మీకు డబ్బులు పడ్డయా, ఇలా చెక్ చేసుకోండి.

PM Kisan – 2025 : దేశంలోని రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రధాని మోదీ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎం కిసాన్ సమన్ నిధి కింద దేశంలోని పేద, మధ్య తరగతి రైతులందరికీ 19వ విడత డబ్బుల్ని అందించనున్నారు. రైతులకు పెట్టుబడి, ఆర్థిక సాయంతో పాటు జీవనోపాధి కల్పించే లక్ష్యంతో పీఎం కిసాన్ పేరుతో ఏటా రైతులకు రూ.6 వేల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు. ఇందులో భాగంగా 19వ విడత డబ్బులు రైతుల ఖాతాల్లోకి పడనున్నాయి. ప్రతీ ఏటా పంట కాలాలైన జూన్-జూలై, అక్టోబర్-నవంబర్, జనవరి-ఫిబ్రవరి నెలల్లో పీఎం కిసాన్ సాయాన్ని అందిస్తున్నారు. కాగా.. ఈసారి దేశవ్యాప్తంగా 11 కోట్ల మంది రైతులు ఈ ప్రయోజనాల్ని అందుకోనున్నారు.


మధ్యలో రాష్ట్ర ప్రభుత్వాలు, సొసైటీలతో సంబంధం లేకుండా నేరుగా రైతుల ఖాతాల్లోకే ప్రధానమంత్రి కిసాన్ డబ్బుల్ని డీబీటీ (ప్రత్యక్ష లబ్దిదారుల బదిలీ) ద్వారా బదిలీ చేయనున్నారు. ఇందు కోసం కేంద్ర ప్రభుత్వం రూ.22 వేల కోట్ల నిధుల్ని సిద్ధం చేసింది. ఈ ప్రయోజనాల్ని ప్రధాని నరేంద్ర మోదీ నేరుగా అందించనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బీహార్‌లోని భాగల్పూర్‌లో మీడియాకు వెల్లడించారు. ప్రధాన మంత్రి కిసాన్ పథకం 18వ విడత డబ్బుల్ని అక్టోబర్ 2025లో విడుద చేశారు. ఇందులో మొత్తం 9.4 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.20,000 కోట్లు జమ చేశారు.

ఈ పథకం ఏంటి.?


ప్రధానమంత్రి కిసాన్ పథకం కింద, అర్హత కలిగిన రైతులు ప్రతి నాలుగు నెలలకు రూ. 2,000 చొప్పున పెట్టుబడి సాయం అందుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వాలతో సంబంధం లేకుండా నేరుగా కేంద్రమే ఈ మొత్తాల్ని అందిస్తుంది. మూడు విడుతల్లో మొత్తంగా ఏడాదికి రూ.6,000 లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా బదిలీ చేస్తున్నారు. ఈ పథకాన్ని 2019 తాత్కాలిక బడ్జెట్‌లో అప్పటి ఆర్థిక మంత్రి పియూష్ గోయల్ ప్రకటించగా.. రైతులకు ప్రధాని మోదీ నిధుల్ని విడుదల చేశారు. ప్రస్తుతం ఇప్పుడు ఈ పథకం.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రత్యక్ష ప్రయోజన బదిలీ పథకంగా గుర్తింపు పొందింది.

ఈ పథకం ద్వారా డబ్బులు రైతుల ఖాతాల్లోకి జమ కావాలి అంటే కచ్చితంగా రైతు బ్యాంకు ఖాతా e-KYCని పూర్తి చేసుకుని ఉండాలి. లేదంటే నిధులు జమ అయ్యే అవకాశాలు లేవంటున్నారు. ఈ పథకం అధికారిక వెబ్‌సైట్ వెల్లడించిన వివరాల ప్రకారం, PMKISAN నమోదిత రైతులకు eKYC తప్పనిసరి. OTP-ఆధారిత eKYC PMKISAN పోర్టల్‌లో అందుబాటులో ఉంది. బయోమెట్రిక్ ఆధారిత eKYC కోసం సమీపంలోని CSC కేంద్రాలను సంప్రదించాలని సూచిస్తోంది.

మీరు అర్హులేనా – ఇలా తనిఖీ చేసుకోండి.

1) అధికారిక వెబ్‌సైట్‌ www.pmkisan.gov.in ను సందర్శించండి.
2) ఇక్కడ పేజీ కుడి వైపున ఉన్న ‘know your status’ ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
3) మీ రిజిస్ట్రేషన్ నంబర్‌ను నమోదు చేసి, కాప్చా కోడ్‌ను పూరించండి. ఇప్పుడు ‘Get your Data’ ఎంపికను ఎంచుకోండి.
ఇప్పుడు.. మీపేరు పీఎమ్ కిసాన్ పోర్టల్ లో అప్ లోడ్ అయినట్లైతే.. మీ లబ్ధిదారుడి స్థితి తెరపై కనిపిస్తుంది.

లబ్ధిదారుల జాబితాలో మీ పేరు చూడడం ఎలా?

స్టేజ్ 1: PM కిసాన్ అధికారిక వెబ్‌సైట్ www.pmkisan.gov.in ని సందర్శించండి.
స్టేజ్ 2: ‘Beneficiaries’ ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
స్టేజ్ 3: డ్రాప్-డౌన్ మెను నుంచి రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గం, బ్లాక్, గ్రామం వంటి వివరాలను ఎంచుకోండి.
స్టేజ్ 4: ‘Get report’ ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
ఇప్పుడు మీ గ్రామానికి సంబంధించిన లబ్దిదారుల జాబితా అందుబాటులోకి వస్తుంది. లేదంటే.. హెల్ప్‌లైన్ నంబర్లకు 155261, 011-24300606 కు కాల్ చేయవచ్చు.

PM కిసాన్ సమ్మాన్ డబ్బుల కోసం దరఖాస్తు

స్టేజ్ 1: pmkisan.gov.in ని సందర్శించండి.
స్టేజ్ 2: ‘Registration of new farmer’ పై క్లిక్ చేసి, మీ ఆధార్ నంబర్‌ను నమోదు చేసి, క్యాప్చాను పూరించండి.
స్టేజ్ 3: అవసరమైన వివరాలను నమోదు చేసి, ‘Yes’ పై క్లిక్ చేయండి.
స్టేజ్ 4: PM-Kisan దరఖాస్తు ఫారమ్ 2024 లో అడిగిన సమాచారాన్ని పూరించండి. దానిని సేవ్ చేసుకుని, ప్రింటవుట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో.. అనేక వివరాలుంటాయి.

Also Read :

Related News

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Big Stories

×