E-Paper
Advertisement

Ind vs SA 5th T20I: బుమ్రా, వ‌రుణ్ అరాచ‌కం..ఇండియా గ్రాండ్ విక్ట‌రీ, ద‌క్షిణాఫ్రికాపై టీ20 సిరీస్ కైవ‌సం

Ind vs SA 5th T20I: బుమ్రా, వ‌రుణ్ అరాచ‌కం..ఇండియా గ్రాండ్ విక్ట‌రీ, ద‌క్షిణాఫ్రికాపై టీ20 సిరీస్ కైవ‌సం
Advertisement

Ind vs SA 5th T20I:  టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా ( India vs South Africa, 5th T20I ) మధ్య జరిగిన ఐదు టీ20 ల సిరీస్ ముగిసింది. ఈ 5 టి20 సిరీస్ లో అద్భుతంగా రాణించిన టీమిండియా, 3-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఐదవ టి20 మ్యాచ్ లో బ్యాటింగ్ అలాగే బౌలింగ్ లో ఇరగదీసిన టీమిండియా, దక్షిణాఫ్రికాను 30 పరుగుల తేడాతో ఓడించింది. టీమిండియా విధించిన 231 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో దారుణంగా విఫ‌ల‌మైంది. ఈ త‌రుణంలోనే 20 ఓవ‌ర్లు ఆడిన ద‌క్షిణాఫ్రికా, 8 వికెట్లు న‌ష్ట‌పోయి కేవ‌లం 201 ప‌రుగులు సాధించింది. దీంతో 30 పరుగుల తేడాతో ఓడిన ద‌క్షిణాఫ్రికా, టీ20 సిరీస్ కోల్పోయింది.

Also Read: Shubman Gill: గిల్ కుట్రలు..నేను ఆడకపోతే మ్యాచే రద్దు కావాలి, లక్నో స్టేడియంలోకి పొగ మంచు పంపి మరీ!

బుమ్రా, వ‌రుణ్ అరాచ‌కం..ఇండియా గ్రాండ్ విక్ట‌రీ

Advertisement

టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా ( India vs South Africa, 5th T20I ) మధ్య జరిగిన అహ్మదాబాద్ టీ20 మ్యాచ్ లో ( T20 Match) ఇండియ‌న్ బౌలర్లు అద్భుతంగా రానించారు. మొదట్లో క్వింట‌న్‌ డికాక్ దుమ్ము లేపగా, ఆ తర్వాత మనోళ్లు కట్టడి చేయగలిగారు. ముఖ్యంగా టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి 4 ఓవర్లు వేసి ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు. 53 పరుగులు ఇచ్చినప్పటికీ కీలకంగా ఉన్న నాలుగు వికెట్లు పడగొట్టి, ఇండియా విజయానికి సహకారం అందించాడు వరుణ్ చక్రవర్తి. అటు బుమ్రా కూడా తన వంతు సహాయం అందించాడు. నాలుగు ఓవర్లు వేసిన బుమ్రా, 17 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. హార్దిక్ పాండ్యా ఒక వికెట్ తీయగా అర్షదీప్ సింగ్ మరో వికెట్ పడగొట్టాడు. ఈ దెబ్బకు 8 వికెట్లు నష్టపోయిన దక్షిణాఫ్రికా 201 పరుగుల వద్ద ఆగిపోయింది. దీంతో టీమిండియా 30 పరుగులు తేడాతో విజయం సాధించి, టి20 సిరీస్ గెలుచుకుంది.

అంతకుముందు రెచ్చిపోయిన హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ

అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ ఐదవ టి20 మ్యాచ్ లో ( India vs South Africa, 5th T20I ) టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేసింది టీమిండియా. ఈ సందర్భంగా నిర్ణయిత 20 ఓవర్లు ఆడిన మన టీమిండియా, కేవలం ఐదు వికెట్లు నష్టపోయి 231 పరుగులు సాధించింది. తిలక్ వర్మ 73 పరుగులు చేయగా హార్దిక్ పాండ్యా 63 పరుగులతో ప్రత్యర్థి బౌలర్ల భరతం పట్టాడు. అటు కొత్తగా వచ్చిన సంజు శాంసన్ అలాగే అభిషేక్ శర్మ తమ వంతు పాత్ర పోషించి జట్టుకు భారీ స్కోర్ అందించారు. అదే సమయంలో బౌలర్లు బాగా రాణించడంతో టీమిండియా సిరీస్ గెలుచుకుంది. ఇక 2025లో క్రికెట్ జర్నీని ముగించిన టీమిండియా, 2026 లో న్యూజిలాండ్ తో మళ్లీ క్రికెట్ ప్రారంభించనుంది.

Advertisement

 

Also Read:  IND VS SA 4th T20I: ల‌క్నో టీ20 ర‌ద్దు కావ‌డంపై ఫ్యాన్స్ సీరియ‌స్‌, ఇక మధ్యాహ్నమే మ్యాచ్ లు జ‌రిగేలా బీసీసీఐ ప్లాన్ ?

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

Big Stories

Advertisement
×