E-Paper
Advertisement

Ind vs SA 5th T20I: కెప్టెన్సీకి సూర్య కుమార్ రాజీనామా? కెమెరామెన్ ముఖం ప‌గిలింది, అంపైర్ కాలు విరిగింది

Ind vs SA 5th T20I: కెప్టెన్సీకి సూర్య కుమార్ రాజీనామా? కెమెరామెన్ ముఖం ప‌గిలింది, అంపైర్ కాలు విరిగింది
Advertisement

Ind vs SA 5th T20I: సూర్య కుమార్ యాద‌వ్ అభిమానుల‌కు బిగ్ షాక్‌. టి20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. టి20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని సూర్య కుమార్ యాదవ్ నిర్ణయం తీసుకున్నాడని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దక్షిణాఫ్రికా టీ20 సిరీస్ లో అత్యంత దారుణంగా విఫలమైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాడట. అయితే టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ముగిసే వరకు కెప్టెన్ గా కొనసాగి, ఆ తర్వాత వైదొల‌గాలని నిర్ణయం తీసుకున్నాడట టి20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. కాగా ఈ నెల 20 అంటే రేపు టి20 వరల్డ్ కప్ 2026 టోర్న‌మెంట్ కు సంబంధించిన‌ జట్టును ప్రకటించనున్నారు. ఈ జట్టుకు సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్ గా కొనసాగనున్నాడు.

Also Read: Shubman Gill: గిల్ కుట్రలు..నేను ఆడకపోతే మ్యాచే రద్దు కావాలి, లక్నో స్టేడియంలోకి పొగ మంచు పంపి మరీ!

అంపైర్ కాలు విరిగింది

Advertisement

దక్షిణాఫ్రికా వర్సెస్ టీమ్ ఇండియా ( Ind vs SA 5th T20I ) మధ్య అహ్మదాబాద్ వేదికగా జరిగిన టి20 మ్యాచ్ లో సంజు శాంసన్ తుది జట్టులో ఛాన్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. గిల్ స్థానంలో వచ్చిన సంజు శాంసన్, దాన్ని వినియోగించుకున్నాడు. ఈ మ్యాచ్ లో 22 బంతుల్లో 37 పరుగులు సాధించాడు. మంచి దూకుడుగా ఉన్న సమయంలో స్టేట్ డ్రైవ్ ఆడాడు. అయితే అప్పుడు ఫీల్డ్ అంపైర్ గా ఉన్న రోహన్ పండిత్ కాళ్లకు గట్టిగా తగిలింది. బంతి తగలగానే రోహన్ పండిత్ కింద పడిపోయాడు. కింద పడి గిలగిలా కొట్టేసుకున్నాడు. వెంటనే ఫిజియోథెరపీ వచ్చి రోహన్ పండిత్ కు ప్రథమ చికిత్స అందించాడు. అనంతరం తన డ్యూటీ మళ్లీ స్టార్ట్ చేశాడు. అయితే బంతి తగిలిన నేపథ్యంలో రోహన్ పండిత్ కు క్షమాపణలు కూడా చెప్పాడు సంజు శాంసన్.

కెమెరామెన్ ముఖం ప‌గిలింది

అహ్మదాబాద్ టీ20 మ్యాచ్ లో ( Narendra Modi Stadium, Ahmedabad ) మరో దారుణ సంఘటన జరిగింది. ఇవాల్టి మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా ఊచకోత కోశాడు. 25 బంతుల్లో 63 పరుగులు సాధించిన హార్దిక్ పాండ్యా, 5 సిక్సర్లతో పాటు ఐదు బౌండరీలు సాధించాడు. అయితే తన మొదటి సిక్సర్ స్టేట్ డ్రైవ్ ఆడాడు. ఇక‌ ఆ బంతి నేరుగా వెళ్లి కెమెరామెన్ కు తగిలింది. దీంతో అతని తలకు గాయమైనట్లు తెలుస్తోంది. మ్యాచ్ ఫినిష్ అయిన తర్వాత ఆ కెమెరామెన్ కు హార్దిక్ పాండ్యా క్షమాపణలు చెప్పాడు. ఇది ఇలా ఉండగా ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా 231 పరుగులు సాధించింది. ఇక ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో అట్టర్ ఫ్లాప్ అయిన దక్షిణాఫ్రికా 201 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. 30 పరుగులతో విజయం సాధించిన టీమిండియా, 3-1 తేడాతో టి20 సిరీస్ కైవసం చేసుకుంది.

Advertisement

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

Big Stories

Advertisement
×