BigTV English

IND Vs NZ : చెలరేగిన భారత్ బ్యాటర్లు.. కివీస్ టార్గెట్ 386 రన్స్..

IND Vs NZ : చెలరేగిన భారత్ బ్యాటర్లు.. కివీస్  టార్గెట్ 386 రన్స్..

IND Vs NZ : భారత్ బ్యాటర్లు మరోసారి రెచ్చిపోయారు. ఇండోర్ మైదానంలో విధ్వంసం సృష్టించారు. ఓపెనర్లు రోహిత్ శర్మ ( 101), గిల్ (112) సెంచరీలతో చెలరేగారు. హార్ధిక్ పాండ్యా (54), కోహ్లీ (36) రాణించారు. శార్ధుల్ ఠాకూర్ 25 పరుగులతో మెరుపులు మెరుపించడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 385 పరుగులు చేసింది.


రెండో వన్డేలో హాఫ్ సెంచరీ చేసి ఫామ్ లోకి వచ్చిన రోహిత్ శర్మ ఈ మ్యాచ్ లో 85 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సులతో 101 పరుగులు చేశాడు. దీంతో వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాటర్లలో రోహిత్‌ ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ (30)తో సమంగా మూడో స్థానంలో నిలిచాడు. హిట్ మ్యాన్ తొలి వికెట్ కు శుభ్ మన్ గిల్ తో కలిసి 212 పరుగులు జోడించాడు. న్యూజిలాండ్‌పై తొలి వికెట్‌కు భారత్ ఇదే అత్యధిక భాగస్వామ్యం . 78 బంతుల్లో 13 ఫోర్లు, 5 సిక్సులతో 112 పరుగులు చేసి శుభ్ మన్ గిల్ అదగొట్టాడు. గిల్ కు ఈ సిరీస్ రెండో సెంచరీ ఇది . తొలి మ్యాచ్ లో డబుల్ సెంచరీ బాదాడు. మొత్తం మీద ఈ సిరీస్ 360 పరుగులు చేశాడు గిల్. దీంతో మరో రికార్డును బద్దలు కొట్టాడు. ద్వైపాక్షిక సిరీస్‌ల్లో మూడు మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటి వరకు బాబర్‌ అజామ్‌ పేరిట ఉన్న 360 (3 మ్యాచ్‌ల్లో) పరుగుల రికార్డును సమం చేశాడు. ఇక భారత్‌లో తరపున గతంలో విరాట్‌ కోహ్లీ మూడు మ్యాచ్‌ల్లో 283 పరుగులు చేశాడు.

రోహిత్ అవుట్ తర్వాత భారత్ 81 పరుగుల వ్యవధిలో 5 వికెట్లు కోల్పోవడంతో పరుగుల వేగం మంద గించింది. కోహ్లీ (36) వేగంగా ఆడినా ఎక్కువ సేపు నిలబడలేకపోయాడు. ఇషాన్ కిషాన్ ( 17 ) మరోసారి నిరాశ పర్చాడు. సూర్యకుమార్ (14) రెండు సిక్సులు కొట్టి అవుట్ అయ్యాడు. మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు రాణించకపోవడంతో మధ్య ఓవర్లలో భారత్ స్కోర్ వేగం మందగించింది. అయితే హార్థిక్ పాండ్యా 38 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సులతో 54 పరుగులు చేయడంతో భారత్ స్కోర్ 350 దాటింది. శార్ధుల్ ఠాకూర్ మెరుపులు మెరుపించడంతో భారత్.. న్యూజిలాండ్ ముందు 386 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.


న్యూజిలాండ్ బౌలర్లు తొలి వన్డే మాదిరిగానే తేలిపోయారు. జాకబ్ డప్పీ 3 వికెట్లు తీసినా 100 పరుగులు సమర్పించుకున్నాడు. ఫెర్గూసన్, సాంట్నర్ పొదుపుగా బౌలింగ్ చేసినా వికెట్లు తీయలేకపోయారు. మరో బౌలర్ టిక్నర్ కూడా 3 వికెట్లు తీసినా భారీగా పరుగులు ఇచ్చాడు.

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×