India beat Pakistan : సాధారణంగా ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఆ క్రేజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అది క్రికెట్ అయినా.. ఫుట్ బాల్ అయినా, టెన్నీస్ అయినా, హాకీ అయినా ఏ క్రీడా అయినా ఆ కికే వేరు ఉంటుంది. ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ ఏది జరిగినా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆసక్తికరంగా వీక్షిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో ఇండియా విజయం సాధిస్తే.. మరికొన్ని సందర్భాల్లో పాకిస్తాన్ విజయం సాధిస్తుంటుంది. క్రీడలు అన్నప్పుడు గెలుపు, ఓటములు సహజమే. కానీ భారత జట్టు ఓడిపోతే కాముగానే ఉంటుంది. కానీ పాకిస్తాన్ జట్టు ఓడిపోయిందంటే.. చాలా పొగరు చూపిస్తుంటారు. ఇందుకు ఉదాహరణ ఇక్కడ జరిగిన ఒక మ్యాచ్ చక్కని ఉదాహరణ గా చెప్పవచ్చు.
Also Read : Rishabh Pant : పిచ్చోడిలా గంతులు వేసిన పంత్.. అనుష్క శర్మ సీరియస్
కజకిస్తాన్ లోని షైమ్ కెంట్ లో జరిగిన జూనియర్ డెవిస్ కప్ (అండర్-16) టెన్నిస్ టోర్నమెంట్ లో భారత యువ క్రీడాకారులు పాకిస్తాన్ పై అద్భుత మైన విజయాన్ని నమోదు చేశారు. మే 24 న జరిగిన ఈ పోరులో భారత్ 2-0 తేడాతో పాకిస్తాన్ జట్టు ను చిత్తు చేసింది. అయితే.. ఈ విజయం తరువాత మూడు రోజులకు.. అనగా మే 27న ఒక వీడియో వెలుగులోకి రావడంతో వివాదం మొదలైంది. ఈ వీడియో లో పాకిస్తాన్ ఆటగాడు ఒకరు భారత ఆటగాడి తో క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా షేక్ హ్యాండ్ ఇచ్చినట్టు కనిపిస్తోంది. వివరాల్లోకి వెళ్లితే.. భారత ఆటగాళ్లు ప్రకాశ్ శరణ్, తావిష్ పహ్వా తమ సింగిల్స్ మ్యాచ్ లలో సూపర్ ట్రై బ్రేక్ ల ద్వారా గెలిచి జట్టుకు తిరుగులేని ఆధిక్యాన్ని అందించారు.
దీంతో భారత జట్టు 2-0 తేడా తో పాకిస్తాన్ పై విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ ముగిసిన అనంతరం జరిగిన షేక్ హ్యాండ్ సందర్భంగా ఓ పాకిస్తానీ ఆటగాడు ప్రవర్తించిన తీరు వివాదస్పదంగా మారింది. నిన్న బయటికి వచ్చిన ఈ వీడియో లో పాకిస్తాన్ ఆటగాడు మొదట షేక్ హ్యాండ్ ఇవ్వకుండా వెళ్లిపోయి.. ఆ తరువాత రెండో ప్రయత్నంలో భారత ఆటగాడి చేతిని తాకి.. వెంటనే అగౌరవంగా వెనక్కి లాక్కున్నట్టుగా స్పష్టంగా అందులో కనిపిస్తోంది. అయితే ఈ సంఘటన జరిగినప్పుడు భారత ఆటగాడు మాత్రం సంయమనం పాటిస్తూ.. ఎలాంటి ఆవేశానికి లోను కాకుండా ప్రశాంతంగా ఉండటం గమనార్హం. ముఖ్యంగా షేక్ హ్యాండ్ వివాదం ప్రస్తుతం నెలకొన్న భారత్ – పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. పమల్గామ్ లో ఉగ్రవాదులు దాడి చేయడంతో భారత్ ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్ పై దాడి చేసింది. పాకిస్తాన్ కూడా భారత్ పై దాడి చేస్తే.. భారత్ వారి దాడిని తిప్పి కొట్టిన విషయం తెలిసిందే. రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్నది. ఆ తరువాత కాస్త సద్దు మణిగింది. ఇలాంటి సమయంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం వివాదస్పదంగా మారింది.
India thrashed Pakistan 2 – 0 at Junior Davis Cup in Kazakhstan, but look at the attitude of these MDCs Pakistanis even after losing 🤡pic.twitter.com/SkwHD9vIhx
— Kriti Singh (@kritiitweets) May 27, 2025