BigTV English

Prabhas: ఆ సర్వేలో మొదటి స్థానంలో సలార్ 1… ప్రభాస్ రికార్డులను టచ్ చేయ్యలేరుగా!

Prabhas: ఆ సర్వేలో మొదటి స్థానంలో సలార్ 1… ప్రభాస్ రికార్డులను టచ్ చేయ్యలేరుగా!

Prabhas: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన ప్రభాస్(Prabhas) ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన బాహుబలి సినిమాతో ఈయన క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకోవడంతో ప్రభాస్ తదుపరి సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ ఏకంగా ఐదు పాన్ ఇండియా సినిమా షూటింగ్ పనులలో బిజీగా గడుపుతున్నారు.


ప్రభాస్ రికార్డులను టచ్ చెయ్యలేరుగా..

టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందిన ప్రభాస్ ఎన్నో అరుదైన రికార్డులను సృష్టించారు. ఇప్పటివరకు ప్రభాస్ రికార్డులు చాలా వరకు ఏ హీరో కూడా టచ్ చెయ్యలేదని చెప్పాలి. తాజాగా ప్రభాస్ సలార్ సినిమా కూడా అరుదైన రికార్డ్ సొంతం చేసుకుంది. ప్రభాస్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం సలార్(Salar). ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతిహాసన్ హీరోయిన్గా నటించారు అలాగే ప్రభాస్ స్నేహితుడి పాత్రలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా 2023 డిసెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకుంది.


మొబైల్ స్క్రీన్ పై సలార్ రికార్డు..

థియేటర్లలో మాత్రమే కాకుండా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో కూడా ఈ చిత్రం మంచి సక్సెస్ అందుకుంది. సాధారణంగా ఏ సినిమా అయినా ఒకటి లేదా రెండు ఓటీటీలలో ప్రసారమవుతాయి కానీ ఈ సినిమా ఏకంగా ఏడు ఓటీటీలలో ప్రసారమైనప్పటికీ అన్నింటిలోనూ అదే స్థాయిలో సక్సెస్ అందుకుంది. ఇదిలా ఉండగా తాజాగా నిల్సన్ సర్వేలో భాగంగా సలార్ సినిమా గురించి ఆసక్తికరమైన విషయం బయటపడింది.లక్ష కంటే ఎక్కువ జనాభా ఉన్న పట్టణాల్లో 18 నుంచి 45 సంవత్సరాల వయస్సు ఉన్నవారు ఈ సినిమాని ఎక్కువగా మొబైల్ ఫోన్లో చూసినట్టు ఈ సర్వే వెల్లడించింది. మామూలుగా అయితే మొబైల్ స్క్రీన్ (Mobile Screen)పై చాలా మంది కొరియన్, ఇంగ్లీష్ వెబ్ సిరీస్ లను చూస్తారు. అదే విధంగా తెలుగు వెబ్ సిరీస్ లను కూడా చూస్తారు కానీ ఇప్పటివరకు ఏ సినిమాని చూడని విధంగా సలార్ సినిమాని మొబైల్ స్క్రీన్ పై అత్యధికంగా చూసినట్టు ఈ సర్వేలో వెల్లడికావడంతో ప్రభాస్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ విషయాన్ని ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తమ హీరో రేంజ్ ఏంటో నిరూపించుకుంటున్నారు. ఇలా ప్రతి సినిమా విషయంలోనూ ప్రభాస్ అద్భుతమైన రికార్డులను అందుకున్నారని కొన్ని రికార్డులు ఇప్పటికీ ప్రభాస్ పేరు మీద ఉండటం విశేషం. ఇక ప్రభాస్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈయన రాజా సాబ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. అతి త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాతో పాటు సలార్ 2, కల్కి 2, స్పిరిట్, ఫౌజి వంటి పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అయిన సంగతి తెలిసిందే.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×