
India Cricket Team Records : ఇండియా-కివీస్ మధ్య జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో రికార్డుల మోత మోగింది. ముఖ్యంగా వీరోచిత బ్యాటర్ కింగ్ కోహ్లీ, బౌలింగ్ లో వీర విధ్వంసం సృష్టించిన మహ్మద్ షమీవే కాకుండా, ఇంకా చాలానే ఉన్నాయి. అవేమిటో చూసేద్దాం.
అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో కోహ్లీ 13, 794 పరుగులతో మూడో స్థానంలోకి వచ్చాడు. రికీ పాంటింగ్ (13, 704) ని వెనక్కి నెట్టి ముందడుగు వేశాడు. తనకన్నా ముందు సంగక్కర (14,234) సచిన్ (18,426) ఉన్నారు.
ప్రపంచకప్ లో 500 కి పైగా పరుగులు చేసిన ముగ్గురు ఇండియన్ బ్యాటర్స్ ఉన్నారు. వీరిలో విరాట్ కోహ్లీ (711), రోహిత్ శర్మ (550), శ్రేయాస్ అయ్యర్ (526 ) ఉన్నారు.
ప్రపంచకప్ చరిత్రలో మహ్మద్ షమీ సరికొత్త రికార్డులు తిరగ రాశాడు. 17 ఇన్నింగ్స్ లో 50 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. ఇంతకు ముందు మిచెల్ స్టార్క్ 19 ఇన్సింగ్స్ లో సాధించాడు.
ప్రపంచకప్ మ్యాచ్ ల్లో ఐదు, అంతకంటే ఎక్కువ వికెట్లు సాధించిన ఘనత షమీదే. ఈ పీట్ సాధించడం ఇది నాలుగోసారి. అంతకుముందు స్టార్క్ కి మూడుసార్లే సాధ్యమైంది.
సెమీస్ మ్యాచ్ లో ఇండియా 19 సిక్సర్లు కొట్టింది. ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన జట్టుగా అవతరించింది. ఇంతకుముందు (2015 క్వార్టర్ ఫైనల్ లో) వెస్టిండీస్ కొట్టిన 16 సిక్సర్లను భారత్ అధిగమించింది.
ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్ లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన రికార్డ్ శ్రేయాస్ అయ్యర్ కి వచ్చింది. ఇంతకుముందు గిల్ క్రిస్ట్ కి సెంచరీ చేయడానికి 72 బంతులు పట్టింది.
ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్ ల్లో అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా ఇంతకుముందు కివీస్ ఉండేది. 2015 లో వెస్టిండీస్ పై 6 వికెట్ల నష్టానికి 393 పరుగులు చేసింది. ఇప్పుడు భారత్ 397 పరుగులతో అధిగమించింది.
2003 వరల్డ్ కప్ లో సచిన్ టెండుల్కర్ చేసిన అత్యధిక పరుగులు 673 ని విరాట్ దాటేశాడు. ప్రస్తుతం తన టోటల్ స్కోరు 711. ఇంకా ఫైనల్ మ్యాచ్ మిగిలే ఉంది.
వరల్డ్ కప్ లో విరాట్ కొహ్లీ 8 సార్లు 50 ప్లస్ పరుగులు చేసిన బ్యాటర్ గా రికార్డులకి ఎక్కాడు. అంతకుముందు టెండుల్కర్, షకీబ్ మాత్రం ఏడు సార్లు 50 ప్లస్ స్కోర్లు చేశారు. దానిని కొహ్లీ అధిగమించాడు.
వరల్డ్ కప్ లో సింగిల్ ఎడిషన్ లో అత్యధిక సిక్స్ లు కొట్టిన బ్యాటర్ గా రోహిత్ శర్మ (28) రికార్డులకి ఎక్కాడు. అంతకుముందు క్రిస్ గేల్ (26) ని అధిగమించాడు.
రోహిత్ శర్మ ఇప్పటివరకు మూడు వరల్డ్ కప్ లు ఆడాడు. మూడింట్లో కలిపి ఇప్పటికి 51 సిక్సర్లు కొట్టాడు. ఇంతకుముందు 49 సిక్సర్లతో క్రిస్ గేల్ ఉండేవాడు.
ఒక కేలండర్ ఇయర్ లో 14 సార్లు 50 ప్లస్ రన్స్ చేసిన ఓపెనింగ్ పార్టనర్ షిప్ జంటగా రోహిత్- శుభ్ మన్ గిల్ నిలిచారు. ఇక కివీస్ తో ఆడిన 5 మ్యాచ్ ల్లో కూడా వీరు 50 ప్లస్ రన్స్ చేయడం విశేషం.