E-Paper
Advertisement

BJP : కమలం కాడి వదిలేసినట్టేనా..? ఆ పార్టీలో ఏం జరుగుతోంది..?

BJP :  కమలం కాడి వదిలేసినట్టేనా..? ఆ పార్టీలో ఏం జరుగుతోంది..?
Advertisement
BJP

BJP : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్‌ డౌన్ దగ్గర పడుతున్నా బీజేపీ పార్టీలో ఆ హడావుడి కనిపించడం లేదు. గెలవాలన్న ఆలోచన లేదా లేకపోతే అధికార పార్టీని గెలపించాలని ఆలోచిస్తున్నారా అనేది పార్టీ కార్యకర్తలకు అంతుచిక్కట్లేదు. అభ్యర్థుల ఖరారు ఆలస్యం చేయడంతో పాటు ఇంతవరకు మేనిఫెస్టోను ప్రకటించలేదు. కమలనాథులు ఇక ఇప్పుడేమో అసలు ఎన్నికల ప్రచారంలో ఎలాంటి దూకుడు ప్రదర్శించడం లేదు . ఇన్నాళ్లు అధికార బీఆర్ఎస్ పై విమర్శలు, ఆరోపణలు చేసిన బీజేపీల్లో ఏదో తెలియని గందరగోళం కనిపిస్తోంది. రాబోయేది తమ ప్రభుత్వం అంటూ.. దూకుడు చూపించిన బీజేపీ నేతలు ప్రస్తుతం డిఫెన్స్‌లో పడిపోయినట్టు కనిపిస్తోంది.

ఓ వైపు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు ప్రచారంలో దూకుడు మీద ఉంటే.. అన్ని విషయాల్లోనూ బీజేపీ వెనకబడిపోతోంది. ఉచిత విద్య, వైద్యంతో పాటు నిరుద్యోగులు, సామాన్యులు, రైతులకు లబ్ధి చేకూర్చే విధంగా బీజేపీ.. మేనిఫెస్టోను రూపొందించినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్‌ పార్టీల మేనిఫెస్టోలకి భిన్నంగా రూపొందించినట్లుగా సమాచారం.

Advertisement

బీజేపీ మేనిఫెస్టోను కేంద్ర హోం మంత్రి అమిత్ షా విడుదల చేయనున్నారు. ముందుగా ఈనెల 17న మేనిఫెస్టో రిలీజ్‌ చేస్తారని బీజేపీ వర్గాలు ప్రకటించాయి. అయితే ఆయన షెడ్యూల్‌ మారడం వల్ల ఈనెల 18కి ప్రోగ్రామ్‌ని మార్చారు. ఇప్పటికే తెలంగాణలో బీజేపీ తీరు బీఆర్ఎస్‌కి సపోర్ట్‌ చేసేలా ఉందని కాంగ్రెస్‌ ఆరోపణలు చేస్తోంది. దీనికి తగ్గట్టుగానే పార్టీ అగ్రనేతల తీరు ఉందన్న విమర్శలు వస్తున్నాయి.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×