EPAPER

Hardik Pandya: ప్లే బాయ్ గా పాండ్యా ..? బ్రిటీష్ సింగర్ తో డేటింగ్ ?

Hardik Pandya: ప్లే బాయ్ గా పాండ్యా ..? బ్రిటీష్ సింగర్ తో డేటింగ్ ?

Hardik Pandya Dating with British Singer: ఇండియన్ క్రికెటర్, ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా మళ్లీ నెట్టింట ట్రోలింగు బారిన పడ్డాడు. అయితే ఈసారి తను బ్రిటీష్ సింగర్, టీవీ నటి జాస్మిన్ వాలియాతో కలిసి మెలిసి ఉన్నట్టు, ఇద్దరూ విహారయాత్రకు వెళ్లినట్టు ప్రస్తుతం నెట్టింట ప్రచారం జోరుగా సాగుతోంది.


అయితే తను ఇంతకుముందు సెర్బియా నటి నటాషా స్టాంకోవిచ్ తో తన వివాహ బంధానికి ముగింపు పలికాడు. తర్వాత తను వేరే ఒక మోడల్ తో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఇదే అంశాన్ని మాజీ భార్య నటాషా కూడా చెప్పి బాధ పడింది. ఇన్ని రోజులకి మళ్లీ పాండ్యా ఒక బ్రిటీష్ సింగర్ తో కలిసి చెట్టాపట్టాల్ వేసుకుని తిరగడంతో, ఏమిటి పాండ్యా ప్లేబాయ్ గా గానీ మారాడా? అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

అయితే కొద్దిసేపు క్రితం హార్దిక్ పాండ్యా తన ఇన్ స్టాలో ఒక వీడియో పోస్ట్ చేశాడు. అది గ్రీస్ లోని ఓ హోటల్ స్విమ్మింగ్ ఫూల్ వద్ద నడుస్తూ తీసుకున్నది. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే. దీనికి నాలుగు రోజుల క్రితం జాస్మిన్ వాలియా కూడా ఇదే లోకేషన్ లో ఫొటోలు దిగింది. దాంతో వ్యవహారం నెట్టింట హీటెక్కిపోయింది. వీరిద్దరూ కలిసి, ఇదే లోకేషన్ కి వెళ్లినట్టు కథలు అల్లేస్తున్నారు.


Also Read: పాండ్యా కొత్త గర్ల్ ఫ్రెండ్.. ఆమెనా?

అయితే, జాస్మిన్ వాలియా తనేదో యాడ్ షూటింగుకి వెళ్లి ఉండవచ్చు కదా. అలాగే మనసు బాగాలేక పాండ్యా కూడా గ్రీస్ వెళ్లి ఉండవచ్చు కదా..అని కొందరు సీనియర్లు అంటున్నారు. మనసు బాగా లేకపోతే గ్రీస్ వరకు వెళ్లాలా? అందుకోసం శ్రీలంకతో వన్డే సిరీస్ కూడా వదిలేయాలా? అని నెటిజన్లు సీరియస్ అవుతున్నారు.

కొందరు ఏమంటున్నారంటే.. నిప్పులేనిదే పొగ రాదు. వీరిద్దరూ ఇన్ స్టాలో షేర్ చేసిన ఫొటోలను ఒకరికొకరు లైక్ లు కొట్టారని ఆధారాలు చూపిస్తున్నారు. అందువల్ల అందరికీ అనుమానాలు రెట్టింపు అయిపోయాయి. దీంతో వీరి పోస్టులు వైరల్ అయిపోయాయి.

ఇంగ్లండ్ లోని ఎసెక్స్ ప్రాంతానికి చెందిన జాస్మిన్ వాలియా సింగర్ గా పేరు తెచ్చుకుంది. తనకి సొంతంగా యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. పలు ఆల్బమ్ లు చేసింది. అయితే మరెక్కడో ఉన్న జాస్మిన్ వాలియాకి.. మన చిన్నోడు ఎలా దొరికాడని నెటిజన్లు తెగ శోధించేస్తున్నారు.

విషయం ఏమిటంటే…తను పాడిన ‘బామ్ డిగీ’ అనే పాటను బాలీవుడ్ సినిమాలో రీమేక్ చేశారు. అంతేకాదు బాలీవుడ్ కి చెందిన ఆసిమ్ రియాజ్ తో కలిసి ఒక పాట కూడా చేసింది. అది బాగా క్లిక్ అయ్యింది. అలా అమ్మడుకి బాలీవుడ్ లో పరిచయాలు, ఆ లింకుల ద్వారా హార్దిక్ పరిచయం అయ్యాడని కథలు అల్లేస్తున్నారు.

Also Read: భార్యా, కుమారుడిపై ప్రేమ చూపిన పాండ్యా

అందరూ పాండ్యాని మళ్లీ ట్రోలింగ్ చేస్తున్నారు. ఎక్కడో సెర్బియా నటి నటాషాను పెళ్లాడావు. ఇప్పుడు ఇంకెక్కడో ఉన్న ఇంగ్లండ్ సింగర్ ని పట్టుకున్నావ్.. గొప్పోడివి రా బాబూ.. అని పోస్టులు పెడుతున్నారు. నువ్వు ఇలా చేయడం వల్లే నీ భార్యకు ఒళ్లు మండి వెళ్లిపోయిందని తిట్టిపోస్తున్నారు. ముంబై కెప్టెన్ గా ఎంపికైన తర్వాత ఎదుర్కొన్న ట్రోలింగుని పాండ్యా మళ్లీ ఇప్పుడు ఎదుర్కొంటున్నాడు.

శ్రీలంకతో వన్డే సిరీస్ ఎగ్గొట్టి, మనసు బాగాలేదని విహారయాత్రలకు వెళ్లిపోయాడని నెటిజన్లు సీరియస్ అవుతున్నారు. తనిలా కాంట్రవర్శీల్లోనే కంటిన్యూ అయితే ఛాలెంజర్ ట్రోఫీకి ఎంపిక చేయరని అంటున్నారు. అలాగే ఐపీఎల్ లో ముంబై కెప్టెన్ గా తిరిగి రోహిత్ శర్మను తీసుకునే యోచనలో ఫ్రాంచైజీ ఉందని అంటున్నారు. ఇలా జరిగితే అన్నిరకాలుగా పాండ్యా నష్టపోవడం ఖాయమని, కొంచెం కళ్లు తెరిచి భూమ్మీద నడవమని నెటిజన్లు సూచిస్తున్నారు.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×