Japan PM Fumio Kishida news(International news in telugu): జపాన్ ప్రధాన మంత్రి ఫుమియో కిషిడా బుధవారం సంచలన ప్రకటన చేశారు. ఆయన సెప్టెంబర్ లో తన పదవికి రాజీనామా చేయనున్నట్లు తెలిపారు. ఆ తరువాత ఎన్నికల్లో పోటీ కూడా చేయడం లేదని ప్రకటించారు. జపాన్ లో గత కొంత కాలంగా అధికార పార్టీ సభ్యులు ఆర్థిక కుంభకోణాలకు పాల్పడ్డారంటూ ఆరోపణలు వచ్చాయి. దీంతో అధికారంలో ఉన్న లిబరల్ డెమెక్రాటిక్ పార్టీ పట్లు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది.
జపాన్ ప్రధాన మంత్రి బుధవారం చేసిన ప్రకటనలో తాను పార్టీ అధ్యక్షుడిగా కూడా రాజీనామా చేస్తానని ప్రకటించారు. పైగా ఆయన తన ప్రసంగంలో అధికార పార్టీ సభ్యులు, పార్టీ ఎంపీలు అవినీతికి పాల్పడ్డారని అంగీకరించారు. ”రాజకీయాల్లో ప్రజల నమ్మకం పొందడమే అతిపెద్ద విజయం. అలాంటిది మా పార్టీ ప్రజల నమ్మకం కోల్పోయింది. పార్టీ సభ్యులు అవినీతికి పాల్పడ్డారు. నేను ఇంతకాలం పనిచేసిన పార్టీ వేరు. ఇప్పుడున్న లిబరల్ డెమెక్రటిక్ పార్టీ (ఎల్‌డిపి) వేరు. అందుకే పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలనుకుంటున్నాను. అయినా ఎల్‌డిపి .. మరోసారి ప్రజల నమ్మకం సంపాదించాలని ఆశిస్తున్నాను. నిజాయితీగా ప్రజల సంక్షేమం కోసం పార్టీ కృషి చేస్తేనే అది సంభవం.” అని అన్నారు.
గత మూడేళ్లుగా ప్రధాన మంత్రి పదవిలో ఉన్న కిషిడా.. జపాన్ మిలిటరీని బలోపేతం చేయడానికి, అమెరికాతో జపాన్ బంధాలు మరింత బలపర్చడానికి, దక్షిణ కొరియాతో స్నేహపూర్వక సంబంధాలు నెలకొల్పడానికి ఎంతో కృషి చేశారు. అయితే పార్టీ నాయకులు, ఎంపీలు ఆదాయానికి మించి సంపద కలిగి ఉండడం, కొరియాకు చెందిన యూనిఫికేషన్ చర్చితో సంబంధాలు ఉండడంతో జపాన్ ప్రజలు ఎల్‌డిపి పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ క్రమంలో ఎల్‌డిపి సీనియర్ నాయకుడు మాజీ ప్రధాని షింజో ఆబే 2022లో హత్యకు గురికావడంతో ఎల్‌డీపీ నాయకుల కుంభకోణాలపై విచారణ సాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ప్రధాని కిషిడా తన పార్టీ ఎంపీలలో 39 మందిని అరెస్టు చేయించారు. ఎల్‌డిపీ పార్టీలో మొత్తం 80 మంది నాయకులపై ఆర్థిక కుంభకోణాల ఆరోపణులున్నాయి.
ప్రధాని కిషిడా నిర్ణయాలతో ఆయనపై సొంత పార్టీ నాయకులే కోపంగా ఉన్నారని సమాచారం. దీంతో ఆగస్టు 20న జరుగబోయే పార్టీ అధ్యక్ష పదవికి ఆయన పోటీ చేయకూడదని నిర్ణయించారు.
Also Read: హసీనా ప్రధాని పదవికి ఎసరు తెచ్చిన ద్వీపం.. బంగ్లాపై అమెరికా కుట్ర నిజమేనా?