BigTV English

Paris Olympics 2024 Closing Ceremony: ముగిసిన భారత్ చివరి ప్రయాణం

Paris Olympics 2024 Closing Ceremony: ముగిసిన భారత్ చివరి ప్రయాణం

India End Paris Olympics 2024 Campaign With 6 Medals: పారిస్ ఒలింపిక్స్ లో భారత్ చివరి ప్రయాణం ముగిసింది. జులై 26న అధికారికంగా విశ్వ క్రీడలు ప్రారంభమయ్యాయి. ఆగస్టు 11, ఆదివారం అర్థరాత్రి 12.30 గంటలకు ఘనంగా ముగిశాయి. 19 రోజులు సాగిన ఆటలతో పారిస్ నగరం పులకించిపోయింది.


భారత్ విషయానికి వస్తే ఆరు పతకాలతో సంతృప్తి పడి తిరుగు ముఖం పట్టనుంది. ఆఖరి రోజు అథ్లెటిక్స్, సైక్లింగ్ ట్రాక్, హ్యాండ్ బాల్, పెంటథ్లాన్, వాలీబాల్, వాటర్ పోలో, వెయిల్ లిఫ్టింగు, రెజ్లింగ్, బాస్కెట్ బాల్ అంశాల్లో పోటీలు జరిగాయి. ఇక్కడ కూడా నిరాశే మిగిలింది. మొత్తానికి ఒలింపిక్స్ లో భారత ప్రయాణం ముగిసిపోయంది.

అన్నింటికన్నా మించి భారతీయులు క్రికెట్‌పై కాకుండా ఇతర క్రీడలపై ఆసక్తి చూపిస్తున్నారనేది పారిస్ ఒలింపిక్స్ నిరూపించాయి. ఇదొక శుభ పరిణామమని అంటున్నారు. ఎందుకంటే ప్రజలు చూస్తే ఆ క్రీడలకు, క్రీడాకారులకు విలువ, గౌరవం పెరుగుతాయి. వాటి మార్కెట్ కూడా పెరుగుతుంది. అలా ఇతర క్రీడలకు ప్రాధాన్యం పెరుగుతుంది.


ఎప్పటిలాగే పారిస్ ఒలింపిక్స్ లో కూడా అంతులేని భావోద్వేగాలు చోటు చేసుకున్నాయి. భారత రెజ్లర్ వినేశ్ ఫోగట్ కి 50 కేజీల విభాగంలో జరిగిన అన్యాయం భారత్ కి కంటిమీద కునుకు లేకుండా చేసింది. ఉద్వేగంతో తను క్రీడలకు గుడ్ బై చెప్పేసింది. అయితే తను చేసుకున్న అప్పీల్ ప్రస్తుతం పెండింగ్‌‌లో ఉంది.

సెమీ ఫైనల్‌లో విజయం సాధించిన ఆమె.. 100 గ్రాములు ఎక్కువ బరువు ఉందని అనర్హత వేటు వేశారు. ఈ విషయం ప్రస్తుతం సీఏఎస్ (కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్) పరిధిలో ఉంది. ఆగస్ట్ 13న నిర్ణయం వెలువడనుంది.

ఎప్పటిలాగే ఒలింపిక్స్ లో చైనా, అమెరికా ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. ఒక్క బంగారు పతకం ఎక్కువ సాధించి చైనా నెంబర్ వన్ ప్లేస్ లో నిలిచింది. 39 బంగారు పతకాలతో కలిపి మొత్తం 88 పతకాలు చైనా సాధించింది. అయితే అమెరికా 36 బంగారు పతకాలు సాధించి, మొత్తమ్మీద 119 పతకాలు సాధించి అలా అగ్రస్థానంలో నిలిచింది.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×