
Virat Kohli : రికార్డుల బద్దలు.. తిరగమోతలతో ముంబై వాంఖేడి స్టేడియం దద్ధరిల్లిపోయింది. కింగ్ కోహ్లీ..శతకాల కోహ్లీగా మారాడు. ఎట్టకేలకు క్రికెట్ దేవుడు సచిన్ టెండుల్కర్ వన్డే సెంచరీల రికార్డ్ ను దాటేశాడు. అయితే 49 సెంచరీల తర్వాత 50 వ సెంచరీ చేయడానికి కోహ్లీకి పది రోజులు పట్టింది.
వన్డే వరల్డ్ కప్ 2023 సెమీఫైనల్ లో భాగంగా న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో కింగ్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసి ప్రపంచ క్రికెట్ లో నెంబర్ వన్ గా నిలిచాడు. ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. కేవలం 279 ఇన్నింగ్స్ లోనే విరాట్ కోహ్లీ వన్డేల్లో 50వ శతకాన్ని నమోదు చేయడం విశేషం.
ఇదే కాకుండా మరికొన్ని రికార్డులు తన ఖాతాలోకి అలవోకగా వచ్చి చేరాయి. అలాగే ఒకే వరల్డ్ కప్ లో సచిన్ సాధించిన 673 పరుగులే అత్యధికం కాగా.. 2023 వరల్డ్ కప్ లో 711 పరుగులతో కొహ్లీ ఆ రికార్డ్ ని దాటేశాడు. అంతేకాదు ప్రస్తుతం తనే టాప్ స్కోరర్ గా కూడా ఉన్నాడు. అంతే కాదు ఒకే వరల్డ్ కప్ లో 8 సార్లు 50 ప్లస్ స్కోర్లు సాధించిన బ్యాటర్ గా కూడా రికార్డ్ సృష్టించాడు.
అప్పటికి భయంకరమైన ఉక్కపోతతో కోహ్లీ చాలా అవస్థపడ్డాడు, ఎన్నోసార్లు మంచినీళ్లు తాగి, ప్యాడ్ లు మార్చి, హెల్మెట్ మార్చి ఎంతో ఇబ్బంది పడి కూడా సెంచరీ చేసి ఔరా అనిపించాడు. అప్పటికే భరించలేని ఉక్కపోతతో, కాలి కండరాలు పట్టేసి బ్రహ్మాండమైన స్కోరు 79 పరుగుల మీద గిల్ రిటైర్డ్ హర్ట్ అయి వెళ్లిపోయాడు.
సెమీఫైనల్ లో ఏంట్రా భగవంతుడా ఇదంతా అని అనుకున్నారు. అప్పుడొచ్చాడు శ్రేయాస్ అయ్యర్…అయ్యారే అనిపించాడు. 70 బాల్స్ లో 105 పరుగులు ధనాధన్ చేసి మ్యాచ్ ని నిలబెట్టేశాడు. అదీ ఇండియా బ్యాటింగ్ ఆర్డర్ అంటే…అన్నట్టు ఆడాడు. స్కోరుని ఒక రేంజ్ కి తీసుకెళ్లి వదిలాడు.
చివర్లో కేఎల్ రాహుల్ వచ్చి ధనాధన్ ఆడాడు. 20 బాల్స్ లో 39 పరుగులు చేశాడు. 49ఓవర్లో గిల్ వచ్చాడు. ఒక పరుగు తీసి రాహుల్ కి స్ట్రయికింగ్ ఇచ్చాడు. 80 పరుగుల మీద నాటౌట్ గా నిలిచాడు. మొత్తానికి 50 ఓవర్లలో సెమీఫైనల్ పోరులో 397 పరుగుల భారీ స్కోరు చేసింది.
.
.
.