Poonam Kaur – Siraj: టెండూల్కర్ – అండర్సన్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లాండ్ తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్ ని భారత్ 2-2 తో డ్రా చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్ లో అద్భుతమైన ప్రదర్శన చేసిన ఆటగాళ్లలో టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ ఒకరు. ఈ సిరీస్ లో మహమ్మద్ సిరాజ్ వరుసగా ఐదు టెస్టు మ్యాచ్ లు ఆడి తన ఫిట్నెస్ ని నిరూపించుకున్నాడు. అలాగే చివరి టెస్ట్ లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సైతం గెలుచుకున్నాడు. ఈ సిరీస్ లో మొహమ్మద్ సిరాజ్ మొత్తం 23 వికెట్లు పడగొట్టి అత్యంత విజయవంతమైన బౌలర్ గా నిలిచాడు.
ముఖ్యంగా ఓవల్ టెస్ట్ లో అతడు తీసిన 9 వికెట్లు భారత్ కి త్రిల్లింగ్ విజయాన్ని అందించాయి. అయితే ఇప్పుడు భారత జట్టు కాస్త బ్రేక్ తీసుకున్న తర్వాత సెప్టెంబర్ లో మైదానంలోకి దిగనుంది. సెప్టెంబర్ లో జరిగే ఆసియా కప్ 2025 ఈసారి టి-20 ఫార్మాట్ లో జరగనుంది. అయితే ఈ టోర్నీలో మహమ్మద్ సిరాజ్ ఉంటాడా..? లేదా..? అన్నది సస్పెన్స్ గా మారింది. తన కెరీర్ లో సిరాజ్ ఇప్పటివరకు 44 వన్డేలు, అనేక టెస్ట్ మ్యాచ్లలో తన సత్తా చాటాడు. కానీ టి-20 ఫార్మాట్ లో సిరాజ్ కి సరైన అవకాశాలు లభించడం లేదు.
గౌతమ్ గంభీర్ భారత జట్టుకి హెడ్ కోచ్ గా వచ్చిన తర్వాత జట్టులో చాలా మార్పులు జరిగాయి. ముఖ్యంగా యువ ఆటగాళ్లకు గంభీర్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు. అందువల్ల సిరాజ్ కి టి-20 లలో తక్కువగా అవకాశాలు వస్తున్నాయి. ఇక ఇంగ్లాండ్ పర్యటనలో అద్భుతంగా రాణించడంతో ప్రస్తుతం సిరాజ్ పై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెలువెత్తుతున్నాయి. అయితే మహమ్మద్ సిరాజ్ కి డీఎస్పీ పోస్ట్ ని కేటాయించిన విషయం తెలిసిందే. టీమిండియా టి-20 వరల్డ్ కప్ గెలిచిన అనంతరం సిరాజ్ కి తెలంగాణ ప్రభుత్వం ఇంటి స్థలం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించింది.
దీంతో 2024 ఆగస్టు నెలలో జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 78 లో 600 చదరపు గజాల ఇంటి స్థలాన్ని కేటాయిస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత సిరాజ్ కి డిఎస్పి పోస్ట్ ని కేటాయించారు. అయితే మొహమ్మద్ సిరాజ్ కి ప్రజల్లో ఉన్న క్రేజ్ దృశ్య ఇప్పుడు అతడిని తమ పార్టీలో చేర్చుకోవాలని పలు పార్టీలు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఓ టాలీవుడ్ హాట్ బ్యూటీ మహమ్మద్ సిరాజ్ ని కలిసినట్లు ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ టాలీవుడ్ హీరోయిన్ మరెవరో కాదు పూనమ్ కౌర్. ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తరచూ టాలీవుడ్ టాప్ డైరెక్టర్ ని టార్గెట్ చేస్తూ ట్వీట్ చేస్తుంటుంది.
Also Read: World cup 2027: గిల్ కెప్టెన్సీలో రోహిత్ శర్మ.. ఇంత దారుణమా?
నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. అలాగే తరచూ హిందుత్వం గురించి మాట్లాడుతూ.. బిజెపికి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా పూనమ్ కౌర్.. మహమ్మద్ సిరాజ్ ని కలిసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.. పూనమ్ కౌర్ ద్వారా మహమ్మద్ సిరాజ్ ని బిజెపిలోకి తీసుకురాబోతున్నట్లు ఓ వార్త వైరల్ గా మారింది. కానీ వాస్తవానికి వీరిద్దరూ కలిసింది టీమిండియా మాజీ క్రికెటర్, 1983 వన్డే వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా వికెట్ కీపర్ సయ్యద్ కిర్మాని జీవిత కథ “స్టంప్డ్” ను మొహమ్మద్ సిరాజ్ ఆదివారం హైదరాబాద్ లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మాజీ కెప్టెన్ అజారుద్దీన్, మంత్రి వివేక్ వెంకటస్వామి, పూనమ్ కౌర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు దిగిన ఫోటో వైరల్ గా మారింది.