China Mountains Escalators: టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో చైనా తర్వాతే మరెవరైనా అని చెప్పుకోవచ్చు. వాళ్లు ఏ పని చేసినా క్రేజీగా ఉంటుంది. తాజాగా ఉత్కంఠభరిత పర్వత దృశ్యాలను చూసి పర్యాటకులు ఎంజాయ్ చేసేలా.. చైనాలోని టూర్ ఆపరేటర్లు పర్వత ప్రాంతంలోనే ఎస్కలేటర్లను ఏర్పాటు చేశారు. వృద్ధులు, పిల్లలు, పర్వతాల పైకి ఎక్కేలా వీటిని రూపొందించారు. చైనా అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ ఎస్కలేటర్లను చూసి పర్యాటకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పర్వతాల మీదికి ఇకపై ఈజీగా ఎక్కే అవకాశం ఉందంటున్నారు.
ఇబ్బంది లేని పర్వతారోహణ!
తాజాగా చైనాలోని ప్రసిద్ధ పర్యాటక పర్వతాల దగ్గగ ఎస్కలేటర్లను ప్రారంభించారు. ఇప్పటి వరకు పర్వతాల పైకి ఎక్కాలంటే మెట్ల ద్వారా ఎక్కాల్సి ఉండేది. ప్రజలు పైకి ఎక్కేందుకు ఇబ్బంది పడేవారు. ఇకపై ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈజీగా వెళ్లే అవకాశం ఉంటుంది. ఈ ఎస్కలేటర్లలు పర్యాటకులకు ఇబ్బంది లేని పర్వాతారోహణ అనుభవాన్ని అందిస్తున్నారు. అదే సమయంలో కొంత మంది ఈ ఎస్కలేటర్ల ఏర్పాటుపై విమర్శలు చేస్తున్నారు. ఆధునిక సౌకర్యాలు ఆయా ప్రాంతాల సహజ సౌందర్యాన్ని చెడగొడుతున్నాయంటున్నారు. పర్వత సహజ అందాలకు కృత్రిమ అందాలు అద్దడం సరికాదంటున్నారు. ఎస్కలేటర్లు అద్భుతమైన వ్యూను ఆస్వాదించడాన్ని సులభతరం, వేగవంతం చేస్తున్నప్పటికీ, కృత్రిమత్వం ఇబ్బందికరంగా మారుతుందంటున్నారు.
గత ఏడాది నుంచి ఎస్కలేటర్ల ఏర్పాటు
నిజానికి పర్వత ప్రాంతాల్లో ఎస్కలేటర్ల ఏర్పాటు అనేది గత ఏడాది నుంచి ప్రారంభం అయ్యింది. తొలుత జెజియాంగ్ ప్రావిన్స్ లోని చునాన్ కౌంటీలోని టియాన్యు పర్వతంపై ఒక ఎస్కలేటర్ ను ఏర్పాటు చేశారు. ఇది ఒకప్పుడు 50 నిమిషాల ట్రెక్ ను ఇప్పుడు 10 నిమిషాల్లో వెళ్లేలా చేసింది. ఇప్పుడు, సందర్శకులు కదిలే నడక మార్గంలో హ్యాపీ వెళ్లిపోవచ్చు. కఠినమైన ప్రాంతంలో ఎస్కలేటర్ ఏర్పాటు చేయడంతో.. అక్కడి నుంచి పర్వత శిఖరాన్ని చేరుకోవడానికి జస్ట్ 3 కిలో మీటర్లు నడవాల్సి ఉంటుంది. ఇబ్బంది లేని పర్వాతారోహణ అనుభవం అందరినీ ఆకట్టుకుంటుంది.
నెటిజన్లు ఏం అంటున్నారంటే?
పర్వత ప్రాంతాల్లో ఎస్కలేటర్లు ఏర్పాటు చేయడం పట్ల నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. “ఇది వృద్ధులకు, పిల్లలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కష్టపడి ఎక్కాల్సిన అవసరం లేకుండా ఎస్కలేటర్ మీద నిలబడితే హాయిగా పైకి వెళ్లొచ్చు. ఈ వీడియోను చూస్తుంటూ చాలా సంతోషంగా ఉంది” అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. “నేను పర్వల్లో ఎస్కలేటర్ల ఏర్పాటుకు పూర్తిగా అనుకూలంగా ఉన్నాను. ఇబ్బంది లేని ట్రెక్కింగ్ అనుభవాన్ని పొందే అవకాశం ఉంది” అని మరో నెటిజన్ రాసుకొచ్చాడు. ఓ వ్యక్తి మాత్రం ఈ ఎస్కలేటర్లను పూర్తిగా తప్పుబట్టాడు. “ఎస్కలేటర్లు పర్వతం యొక్క సహజ సౌందర్యాన్ని దూరం చేస్తున్నాయి. మీకు కనించడం లేదా?” అని కామెంట్ పెట్టాడు. ప్రస్తుతం ఈ ఎస్కలేటర్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Read also: అక్కడ పెళ్లికి ముందే ఫస్ట్ నైట్.. గుడిసెల్లోకి పంపి మరీ ఎంకరేజ్ చేసే పెద్దలు!