E-Paper
Advertisement

IND VS SL: ‘దిత్వా’ తుఫాన్.. శ్రీలంక కోసం టీమిండియా సంచ‌ల‌నం నిర్ణ‌యం

IND VS SL: ‘దిత్వా’ తుఫాన్.. శ్రీలంక కోసం టీమిండియా సంచ‌ల‌నం నిర్ణ‌యం
Advertisement

IND VS SL:   2026 సంవత్సరం వచ్చిన నేపథ్యంలో టీమిండియా ( Team India) బిజీగా గడపనుంది. ఈ నెలలో న్యూజిలాండ్ తో వన్డేలతో పాటు టి20 లు ఆడనుంది టీమిండియా. ఆ తర్వాత టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటులోకి అడుగుపెట్టనుంది. ఇలా వరుసగా ఈ ఏడాది మొత్తం సిరీస్ లు ఆడుకుంటూ ముందుకు సాగనుంది. ఇలాంటి నేపథ్యంలోనే శ్రీలంక ప్రజలకు అదిరిపోయే శుభవార్త చెప్పింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఇటీవల శ్రీలంకలో ‘దిత్వా’ తుఫాన్ ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. దీంతో శ్రీలంకలో చాలామంది నిరాశ్రయులయ్యారు. అయితే వాళ్లందరినీ ఆదుకునేందుకు తాజాగా బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీలంక జట్టుతో అదనంగా టి20 సిరీస్ ఆడేందుకు సిద్ధమైంది. ఆ టి20 సిరీస్ ద్వారా వచ్చిన డబ్బులు, ‘దిత్వా’ తుఫాన్ బాధితులకు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది బీసీసీఐ. ఈ మేరకు శ్రీలంక బోర్డుకు కూడా సమాచారం ఇచ్చింది. ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు స్వాగతించింది. అంతేకాదు శ్రీలంక క్రికెట్ బోర్డు చైర్మన్ సిల్వా కూడా అధికారిక ప్రకటన చేశారు. ఇండియాతో ఎక్కువ మ్యాచ్ లు ఆడేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

Also Read: Ravichandran Ashwin: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 కంటే సీరియ‌ల్స్ చూడ‌టం బెట‌ర్‌..టీమిండియా ఆడ‌టం దండ‌గే

శ్రీలంకకు బంపర్ ఆఫర్ ఇచ్చిన టీమిండియా

Advertisement

ఇటీవల కాలంలో ‘దిత్వా’ అనే తుఫాన్ శ్రీలంకను అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. దీంతో చాలామంది ఈ తుఫాన్ బారిన పడి నిరాశ్రయులయ్యారు. అయితే వాళ్లను ఆదుకునేందుకు తాజాగా భారత క్రికెట్ నియంత్రణ మండలి కొత్త ప్రతిపాదన తీసుకువచ్చింది. ఆగస్టు మాసంలో శ్రీలంకతో టెస్ట్ సిరీస్ ఇప్పటికే ఫిక్స్ అయింది. శ్రీలంకలో పర్యటించనున్న టీమిండియా రెండు టెస్టులు ఆడనుంది. డబ్ల్యూటీసీ చాంపియన్ సైకిల్లో భాగంగా ఈ టోర్నమెంట్ జరుగుతుంది. అయితే ఈ రెండు టెస్టులతో పాటు కొత్తగా టి20 మ్యాచ్ లు కూడా ఆడాలని బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ టీ20 సిరీస్ ద్వారా వచ్చిన డబ్బులను, ‘దిత్వా’ తుఫాను బాధితులకు ఇవ్వాలని ప్రతిపాదనలు పంపింది. దీనికి శ్రీలంక క్రికెట్ బోర్డు కూడా అంగీకారం తెలిపింది.

ఆగ‌స్ట్ లో శ్రీలంక వ‌ర్సెస్ టీమిండియా మ‌ధ్య సిరీస్‌

టీమిండియా వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య ఈ ఏడాది టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా మ్యాచులు జరిగే అవకాశాలు ఉన్నాయి. అది తప్పితే ఆగస్టులో ఈ రెండు జట్ల మధ్య రెండు టెస్టు మ్యాచులు ఉంటాయి. ఇవి కాక తుఫాన్ బాధితుల కోసం గాను టీ20 సిరీస్ నిర్వహించాలని బీసీసీఐ ప్రతిపాదనలు పంపింది. అది ఓకే అయితే మొత్తం ఐదు టి20 లో జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక డిసెంబర్ లో ఇండియాలోనే శ్రీలంక పర్యటించనుంది. ఆ సమయంలో మూడు వన్డేలతో పాటు మూడు టీ20 లు ఆడనుంది శ్రీలంక జట్టు.

Advertisement

Also Read:  Sai Sudharsan Injury: విరిగిన పక్కటెముక.. పెను ప్రమాదంలో సాయి సుదర్శన్..ఐపీఎల్ 2026 నుంచి ఔట్ ?

 

Related News

విజయ్ మాల్యాతో మందుకొట్టిన ధోనీ, రిషబ్ పంత్..షాకింగ్ వీడియో వైర‌ల్ !

డ్రెస్సింగ్ రూంలో త‌న్నుకున్న పాకిస్తాన్ క్రికెట‌ర్లు..!

ఐర్లాండ్ చేతిలో టీమిండియానే వైట్ వాష్ అయింది, అందుకే పాకిస్తాన్ ఓడిపోతోంది

ఎవ‌రెంత గింజుకున్నా, నేను రాజీనామా చేయ‌ను..న‌ఖ్వీ సంచ‌ల‌నం

ఒరేయ్ న‌ఖ్వీ? పాకిస్తాన్ జ‌ట్టును 9వ స్థానానికి దిగ‌జార్చావ్ క‌ద‌రా !

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఇండియాను వైట్ వాష్ చేస్తాం…రికీ పాంటింగ్ హెచ్చరిక

రిజ్వాన్ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…భ‌విష్య‌తుల్లో పాకిస్తాన్ తరఫున మళ్లీ ఆడ‌కుండా చేస్తా

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

Big Stories

Advertisement
×