Asia Cup 2025 : ప్రస్తుతం ఆసియా కప్ 2025 జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే కొన్ని జట్లకు లీగ్ దశలో మ్యాచ్ లు ముగిశాయి. ఆతిథ్య జట్టు యూఏఈ కేవలం ఒకే ఒక్క మ్యాచ్ లో విజయం సాధించింది. దీంతో సూపర్ 4 అర్హత లేకుండా అయింది. అయితే నిన్న రాత్రి పాకిస్తాన్ వర్సెస్ యూఏఈ మ్యాచ్ చాలా రసవతతరంగానే జరిగింది. తొలి 10 ఓవర్లలో యూఏఈ ఆటగాళ్ల ఆటను చూస్తే.. 85/3 వికెట్లతో విజయం సాధించేలా కనిపించింది. కానీ చివరికీ పాకిస్తాన్ 25 పరుగుల తేడాతోనే 7 వికెట్లను పడగొట్టి విజయం సాధించింది. అయితే పాకిస్తాన్ జట్టును కూడా కట్టడి చేయడంలో యూఏఈ కీలకంగా వ్యవహరించింది.
ముఖ్యంగా యూఏఈ బౌలర్ సిమ్రంజీత్ సింగ్ వాస్తవానికి భారత్ లోని పంజాబ్ జన్మించాడు. అయితే అతను కరోనా సమయంలో దుబాయ్ కి అక్కడే చిక్కుకున్నాడు. దీంతో తిరిగి యూఏఈకి రాలేకపోయాడు. దీంతో అతను యూఏఈలో ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఇక అక్కడే క్రికెట్ ఆడటం ప్రారంభించి.. అంతర్జాతీయ జట్టులో చోటు సంపాదించాడు. కీలకమైన ఆసియా కప్ మ్యాచ్ లో యూఏఈ తరపున 3 బిగ్ వికెట్లు తీశాడు. వాటిలో తొలి వికెట్ షేక్ అయూబ్ ఓపెనర్ వికెట్ కావడం గమనార్హం. మరోవైపు అతను 6 బంతుల్లో 6 సిక్సులు కొడతాడని.. పాకిస్తాన్ మాజీ ఆటగాడు తన్వీర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. మరోవైపు అయూబ్ వరుసగా మూడో మ్యాచ్ ల్లో కూడా గోల్డెన్ డకౌట్ గా వెనుదిరిగాడు. దీంతో అంతర్జాతీయ టీ-20ల్లో ఈ చెత్త రికార్డును నెలకొల్పిన మూడో పాకిస్తాన్ ఆటగాడిగా నిలిచాడు.
పాకిస్తాన్ వర్సెస్ యూఏఈ మధ్య జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ బ్యాటర్లు ఫర్హాన్ (5), కెప్టెన్ సల్మాల్ అలీ అఘా (20), హసన్ (3), ఖుష్ దిల్ (4), హారిస్ (18) పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. కానీ చివర్లో షాహిన్ అఫ్రిది 14 బంతుల్లో 29 నాటౌట్ గా నిలిచాడు. షాహిన్ అఫ్రిది దూకుడుగా ఆడటంతో పాక్ మెరుగైన స్కోర్ సాధించింది. ఇక యూఏఈ బౌలర్లలో జునేద్ సిద్ధిఖీ 4 వికెట్లు తీయగా.. సిమ్రన్ జిత్ సింగ్ కు 3 వికెట్లు దక్కాయి. 147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ జట్టు తొలి 10 ఓవర్లలో 85 పరుగులు చేయడంతో సునాయసంగా విజయం సాధిస్తుందని అంతా భావించారు. కానీ చివర్లో పాకిస్తాన్ బౌలర్లు రెచ్చిపోవడంతో కేవలం 25 పరుగులు మాత్రమే 7 వికెట్లను కోల్పోయింది. 17.4 ఓవర్లలో యూఏఈ జట్టు కుప్ప కూలిపోయింది. దీంతో పాకిస్తాన్ జట్టు 41 పరుగుల తేడా విజయం సాధించి సూపర్ 4 కి అర్హత సాధించింది. యూఏఈ బ్యాటర్లలో రాహుల్ చోప్రా 35 టాప్ స్కోరర్ గా నిలిచాడు. ధ్రువ్ పరాషర్ 20, అలిషన్ షరాపు 12, మహ్మద్ వసీమ్ 14 పరుగులు చేశారు. 85/3 విజయం సాధిస్తుందనుకున్న సమయంలో వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. పాకిస్తాన్ బౌలర్లలో షహీన్ అఫ్రిది 2, హారిస్ రవూప్ 2, అబ్రార్ అహ్మద్ 2, సైమ్ అయూబ్, సల్మాన్ అఘా ఒక్కో వికెట్ తీశారు.