India vs Australia 4th Test: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024 టోర్నమెంట్ లో ( Border-Gavaskar Trophy 2024/25) భాగంగా… టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా ( India vs Australia 4th Test) మధ్య మ్యాచ్లు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టెస్ట్ సిరీస్ నవంబర్లోనే ప్రారంభమైంది. ఇప్పటివరకు ఆస్ట్రేలియా ( Australia ) వర్సెస్ టీమ్ ఇండియా మధ్య 3 టెస్ట్ మ్యాచ్లు పూర్తయ్యాయి. ఇవాల్టి నుంచి నాలుగో టెస్ట్ కూడా ప్రారంభమైపోయింది. బాక్సింగ్ డే టెస్టులో ( Boxing Day Test ) భాగంగా ఇవాళ టాస్ నెగ్గిన ఆస్ట్రేలియా…. మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది.
Also Read: Dhoni – Kriti Sanon: బాలీవుడ్ బ్యూటీతో ఎంజాయ్ చేస్తున్న ధోని ?
ఇక ఆస్ట్రేలియా టాస్ నెగ్గడంతో…. టీమిండియా ( India ) బౌలింగ్ చేయాల్సి వచ్చింది. అయితే ఇవాల్టి మ్యాచ్ లో టీమిండియా భారీ మార్పులతో బరిలోకి దిగింది. మొన్నటి టెస్టులో దారుణంగా విఫలమైన శుబ్ మన్ గిల్ పై వేటు వేశారు కెప్టెన్ రోహిత్ శర్మ. గిల్ ను తప్పించి… అతని స్థానంలో స్పిన్నర్ కం ఆల్రౌండర్.. వాషింగ్టన్ సుందర్ ను టీమ్ ఇండియా జట్టులోకి తీసుకోవడం జరిగింది. ఈ మ్యాచ్లో… స్పిన్నర్లకు పిచ్ అనుకూలించే అవకాశాలు ఉన్నట్లు మొన్నటి నుంచి వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
అందుకే కీలకమైన గిల్ లాంటి ప్లేయర్ ను పక్కకు పెట్టి సుందర్ ను తీసుకోవడం జరిగింది. అటు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మిడిల్ ఆర్డర్లో కాకుండా… ఇవాల్టి మ్యాచ్లో ఓపెనింగ్ చేయబోతున్నాడు. ఇక కె ఎల్ రాహుల్ మాత్రం… మిడిల్ ఆర్డర్లో వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాహుల్…ఏ స్థానంలోనైనా…. బ్యాటింగ్ చేయగల సత్తా గల ఆటగాడు. అందుకే రోహిత్ శర్మ… ఓపెనింగ్ చేసేందుకు రెడీ అయ్యాడు.
ఇక లంచ్ బ్రేక్ సమయానికి ఒక వికెట్ నష్టపోయిన ఆస్ట్రేలియా.. 112 పరుగులు చేసింది. ఉస్మాన్ కవాజా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఉస్మాన్ కవాజా తో పాటు మార్నస్ లాబుస్చాగ్నే బ్యాటింగ్ చేస్తున్నాడు. అయితే.. ట్రావిస్ హెడ్ తరహాలోనే వచ్చిన కొత్త కుర్రాడు సామ్ కాన్స్టాస్ ( Sam Konstas ) అద్భుతంగా ఆడాడు. ఇవాళ్టి మ్యాచ్ లో ఏకంగా 60 పరుగులు చేసి వెనుదిరిగాడు. 60 పరుగులు చేసిన కొత్త కుర్రాడు సామ్ కాన్స్టాస్ ( Sam Konstas ) ను రవీంద్ర జడేజా కట్టడి చేసి.. ఔట్ చేశాడు.
Also Read: Naman Ojha’s Father: టీమిండియా క్రికెటర్ తండ్రికి 7 ఏళ్ల జైలు శిక్ష?
ఇరు జట్లు:
ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): ఉస్మాన్ ఖవాజా, సామ్ కాన్స్టాస్, మార్నస్ లాబుస్చాగ్నే, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కారీ(w), పాట్ కమిన్స్(c), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, స్కాట్ బోలాండ్
భారత్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ(సి), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(w), రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్