Sreeleela: కొందరు హీరోయిన్లకు లక్ విపరీతంగా కలిసొస్తుంది. అందుకే బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు వస్తుంటాయి. అలా ఒకేసారి అన్ని ఆఫర్లు వచ్చినప్పుడు వాటన్నింటినీ ఒకేసారి హ్యాండిల్ చేయడం కూడా కష్టంగానే ఉంటుంది. ఆ క్రమంలో ఇష్టం లేకపోయినా ఒకట్రెండు ఆఫర్లు వదిలేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం శ్రీలీల పరిస్థితి కూడా అలాగే ఉంది. తన డేట్స్ కోసం మేకర్స్ క్యూ కడుతున్నారు. శ్రీలీల మాత్రం ప్రస్తుతం చేతినిండా సినిమాలు చేస్తూ చాలా బిజీ అయిపోయింది. అందుకే తన కాల్ షీట్స్ దొరకడం కష్టంగా మారిపోయింది. సినిమాల షెడ్యూల్స్‌లో తేడా రావడం వల్ల యంగ్ హీరో సరసన నటించే ఛాన్స్‌ను వదిలేసుకోవాల్సి వచ్చిందట శ్రీలీల. దీంతో ఈ అవకాశం మరొక యంగ్ హీరోయిన్ చేతికి వెళ్లింది.
జోరు తగ్గింది
2023 నుండి శ్రీలీల హవా మొదలయ్యింది. దాదాపు ఆరు నెలల పాటు ప్రతీ నెల.. శ్రీలీల నటించిన ఏదో ఒక సినిమా విడుదల అవుతూనే ఉంది. కానీ అలా విడుదలయిన సినిమాల్లో సగం మాత్రమే బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచాయి. కొన్ని యావరేజ్ అవ్వగా.. మరికొన్ని కనీసం హిట్ అవ్వలేక డిశాస్టర్ అయ్యాయి. మహేశ్ బాబుతో నటించిన ‘గుంటూరు కారం’ తర్వాత శ్రీలీల జోరు తగ్గింది. 2024ను శ్రీలీలను ప్రేక్షకులు పెద్దగా వెండితెరపై చూడలేదు. తాజాగా ‘పుష్ప 2’లో కిస్సిక్ అనే ఐటెమ్ సాంగ్‌లో కనిపించి అందరినీ ఉర్రూతలూగించింది. ఇప్పుడు వరుస ఆఫర్లతో బిజీగా ఉండడంతో యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి సినిమా నుండి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Also Read: సంధ్య థియేటర్ ఘటనలో రష్మిక మౌనం.. సైలెంట్‌గా సైడ్ అయిపోతుందా.?
నవీన్‌తో నో సినిమా
నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty), శ్రీలీల కాంబినేషన్‌లో ‘అనగనగా ఒక రాజు’ అనే సినిమా తెరకెక్కాల్సింది. కానీ ఈ మూవీ షూటింగ్ పలు కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. అంతే కాకుండా మధ్యలో నవీన్ పోలిశెట్టికి యాక్సిడెంట్ అవ్వడం వల్ల తన అప్‌కమింగ్ సినిమాలకు బ్రేక్ పడింది. అందులో ‘అనగనగా ఒక రాజు’ కూడా ఒకటి. అందుకే తప్పని పరిస్థితిల్లో శ్రీలీల ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ స్థానంలోకి ఇప్పుడు మీనాక్షి చౌదరీ వచ్చిందని టాలీవుడ్ సర్కిల్లో వార్తలు వైరల్ అయ్యాయి. బిజీ షెడ్యూల్స్ వల్ల ఛాన్సులు మిస్ చేసుకోవడం శ్రీలీలకు కొత్తేమీ కాదు.
చాలా ఛాన్సులు మిస్
తెలుగులో విపరీతంగా పాపులారిటీ దక్కించుకున్న శ్రీలీల (Sreeleela).. త్వరలోనే బాలీవుడ్ డెబ్యూకు సిద్ధమయ్యింది. అసలైతే యంగ్ హీరో వరుణ్ ధావన్‌తో కలిసి తను ఒక సినిమా చేయాల్సి ఉంది. కానీ డేట్స్ కుదరకపోవడంతో ఆ ఛాన్స్‌ను కూడా శ్రీలీల వదిలేసుకోవాల్సి వచ్చింది. శ్రీలీల వదులుకున్న ఈ ఛాన్స్‌ను పూజా హెగ్డే దక్కించుకుంది. ఇక విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న ‘వీడీ 12’ విషయంలో కూడా ఇదే పరిస్థితి. అలా శ్రీలీల దక్కించుకుంటున్న ఛాన్సులతో పాటు వదులుకుంటున్న ఛాన్సులు కూడా చాలానే ఉంటున్నాయి. ప్రస్తుతం తను హీరోయిన్‌గా నటించిన మూడు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.