India vs Bangladesh First Test Live Streaming Info: దాదాపు 45 రోజుల తర్వాత టీమిండియా మళ్లీ మ్యాచ్ ఆడేందుకు రెడీ అవుతోంది. ఇందులో భాగంగానే టీమ్ ఇండియా వర్సెస్…బంగ్లాదేశ్ మధ్య… చాలా రోజుల తర్వాత మ్యాచ్ జరగబోతుంది. బంగ్లాదేశ్ లో అల్లర్లు కొనసాగుతున్న తరుణంలో.. గురువారం నుంచి టీమిండియా వర్సెస్ బంగ్లా మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. చెన్నైలో గురువారం ప్రారంభం కానున్న ఈ మ్యాచ్… ఉదయం 9:30 గంటల ప్రాంతంలో ప్రారంభం అవుతుంది.
ఇక ఇప్పటికే టీమిండియా, బంగ్లాదేశ్ జట్లు.. చెన్నైకి చేరుకొని ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాయి. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే 16 మంది సభ్యులతో టీమ్ ఇండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తో పాటు… రిషబ్ పంత్, కేల్ రాహుల్ చాలా రోజుల తర్వాత రీఎంట్రీ ఇవ్వడం జరిగింది. అంతేకాదు ఆకాష్ దీప్ అలాగే యాష్ దయాల్ లాంటి ఐపీఎల్ స్టార్లను టీమిండియా టెస్ట్ టీంకు తీసుకుంది బీసీసీఐ.
బీసీసీఐ ఫైనల్ చేసిన జట్టు చాలా బలంగా కనిపిస్తోంది. దీంతో తుది జట్టులో ఏ ప్లేయర్లు ఉంటారని దానిపైన రోహిత్ శర్మ, కోచ్ గంభీర్ కసరత్తు చేస్తున్నారు. అయితే ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగే ఛాన్స్ ఉందట. ముగ్గురు స్పిన్నర్లతో టీమ్ ఇండియా బరిలోకి… కచ్చితంగా కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా అలాగే రవిచంద్రన్ అశ్విన్ రంగంలో ఉంటారు. వీరందరి కంటే కాస్త వెనుకబడ్డ అక్షర పటేల్ మాత్రం… రిజర్వు బెంచ్ లోనే ఉండడం జరుగుతుంది.
Also Read: IND vs PAK: టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ లో భారీ మార్పులు.. భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?
ఇక ఫాస్ట్ బౌలర్ల విషయానికి వస్తే మహమ్మద్ సిరాజ్ తో పాటు… బుమ్రా కూడా బరిలో ఉంటారు. ఫాస్ట్ బౌలర్లలో ముగ్గురు తో బరిలోకి దిగితే… యష్ దయాల్ కూడా తుది జట్టులోకి వస్తాడని చెబుతున్నారు. అదే జరిగితే కుల్దీప్ యాదవ్ కూడా బెంచ్ కు పరిమితం అవుతాడు. అటు పంతు, కేఎల్ రాహుల్ రీఎంట్రీ తో సర్పరాజు ఖాన్ అలాగే దృవ్ జూరేల్ బెంచ్ కు పరిమితం అవుతారు. టీమిండియా ఓపెనర్ గారు రోహిత్ శర్మ అలాగే యశస్వి జైస్వాల్… బరిలో ఉంటారు. ఆ తర్వాత గిల్ బ్యాటింగ్ కు వస్తాడు.
అయితే టీమ్ ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ రెండు టెస్టుల మ్యాచ్లకు జియో సినిమా, స్పోర్ట్స్ 18 బ్రాడ్ కాస్టర్ గా ఉన్నాయి. స్పోర్ట్స్ 18 శాటిలైట్ ఛానల్లో మనం ఈ మ్యాచ్ లను చూడవచ్చు. అటు ఓటీటీ ప్లాట్ ఫామ్ జియో సినిమాలో కూడా మ్యాచ్ లను తిలకించవచ్చు.
India: రోహిత్ శర్మ (C), జస్ప్రీత్ బుమ్రా, యశస్వి జైస్వాల్, రవీంద్ర జడేజా, రిషబ్ పంత్ (డబ్ల్యుకె), విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, మహ్మద్ సిరాజ్, రవిచంద్రన్ అశ్విన్, శుభ్‌మన్ గిల్
Bangladesh: నజ్ముల్ హొస్సేన్ శాంటో (C), షకీబ్ అల్ హసన్, నహిద్ రాణా, మోమినుల్ హక్, లిట్టన్ కుమార్ దాస్, సయ్యద్ ఖలీద్ అహ్మద్, మహ్మదుల్ హసన్ జాయ్, మెహిదీ హసన్ మిరాజ్, నయీమ్ హసన్, జాకీర్ హసన్, ముష్ఫికర్ రహీమ్,