BigTV English

Bhadradri Ramaiah: అయోధ్య రామయ్యకు వెండి,బంగారు ధనస్సు.. భద్రాచలంలో ప్రత్యేక పూజలు

Bhadradri Ramaiah: అయోధ్య రామయ్యకు వెండి,బంగారు ధనస్సు.. భద్రాచలంలో ప్రత్యేక పూజలు

Silver Dhanassu for Ayodhya Bala Ramudu: తెలంగాణ అయోధ్యగా పేరొందిన భద్రాచలంలో శ్రీ సీతారాముల వారిని దర్శించుకునేందుకు ప్రతినిత్యం భక్తులు పెద్దసంఖ్యలో వస్తుంటారు. గోదావరి నది ఒడ్డున కొలువుదీరిన రాములోరికి ప్రతినిత్యం పూజా కైంకర్యాలను వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. శ్రీరామనవమి రోజున సీతారాముల కల్యాణాన్ని దేశమంతా పెద్ద పండుగగా జరుపుకుంటుందన్న విషయం తెలిసిందే. భద్రాచలలో శ్రీ సీతారామచంద్రులవారికి నిత్యకల్యాణ వేడుక జరుగుతుంది. సెప్టెంబర్ 17, మంగళవారం స్వామివారికి పూజల అనంతరం.. బేడా మండపంలో నిత్యకల్యాణ ఘట్టాన్ని నిర్వహించారు.


హైదరాబాద్ కు చెందిన చల్లా శ్రీనివాసరావు అనే భక్తుడు.. అయోధ్య రాముడికి 13కిలోల వెండి, ఒక కేజీ బంగారంతో తయారు చేసిన ధనుస్సును సమర్పించారు. ధనుస్సుకు ప్రత్యేక పూజలు చేసిన అర్చకులు.. స్వామివారి ముందు ఉంచారు. భక్తుల సహకారంతోనే ధనస్సును తయారు చేయించానని, ఈ ధనస్సు దేశంలో ఉన్న అన్ని పుణ్యక్షేత్రాల్లో తిప్పి.. ప్రత్యేక పూజలు చేయించి.. అయోధ్య రామయ్యకు సమర్పిస్తానని ఆయన తెలిపారు. కాగా.. శ్రీనివాస రావు గతంలోనూ అయోధ్య ఆలయ నిర్మాణానినికి వెండి ఇటుకలు చేయించి, పాదయాత్రగా వెళ్లి సమర్పించారు.

Also Read: ప్రతి రోజు ఉదయం ఇలా చేస్తే.. మీ ఇంట్లో డబ్బుకు లోటుండదు


రామ జన్మభూమి అయిన అయోధ్యలో.. కలగానే మిగిలిన రాములవారి ఆలయ నిర్మాణం ప్రధాని నరేంద్రమోదీ హయాంలో రూపుదిద్దుకుంది. ఈ ఏడాది జనవరి 22న అత్యంత వైభవంగా బాలరాముడి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం కన్నులపండువగా జరిగింది. రామ్ లల్లాను దర్శించుకునేందుకు భక్తులు ప్రతిరోజూ వందల సంఖ్యలో, వరుస సెలవులు వచ్చిన సమయంలో వేల సంఖ్యలో అయోధ్యకు చేరుకుంటున్నారు.

Related News

Hyderabad: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. 50 మంది విద్యార్థులకు డ్రగ్స్ పాజిటివ్

Mancherial Teacher: వెరైటీగా క్లాస్ కు వచ్చిన టీచర్.. విద్యార్థులు షాక్.. ఎక్కడంటే?

Juniors vs Seniors: తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ పడగవిప్పుతున్న ర్యాగింగ్

Traffic Diversions: వినాయక చవితి పండుగ.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు, నిమజ్జనానికి ఏర్పాట్లు

BRS Politics: యూరియా కబురొచ్చింది.. ఇరుకునపడ్డ బీఆర్ఎస్, ఆ నిర్ణయం మాటేంటి?

KTR Vs Kavitha: గులాబీ శ్రేణుల్లో గుబులు.. ముదిరిన అన్న, చెల్లెలి వివాదం

Big Stories

×