BigTV English

India vs Bangladesh 1st Test: భారత్ 376 ఆలౌట్.. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసిన భారత్..

India vs Bangladesh 1st Test: భారత్ 376 ఆలౌట్.. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసిన భారత్..

India vs Bangladesh LIVE, 1st Test Day 2: బంగ్లాదేశ్ తో చెన్నయ్ లో జరుగుతున్న తొలిటెస్టులో భారత్ ఎట్టకేలకు కష్టాల నుంచి గట్టెక్కి 376 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆల్ రౌండర్లు అశ్విన్, జడేజా అండతో భారత్ పటిష్ట స్థితికి చేరుకుంది. అయితే అశ్విన్ సెంచరీ చేసినా.. జడేజా మాత్రం మిస్ అయ్యాడు. రెండో రోజు ఆట ప్రారంభమైన వెంటన్ 86 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు.


అయితే తను అశ్విన్ తో కలిసి.. భారత ఇన్నింగ్స్ ను నిర్మించిన తీరు మాత్రం అద్భుతమని చెప్పాలి. 124 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్ ల సాయంతో 86 పరుగులు చేసిన జడేజా పేసర్ తస్కిన్ అహ్మద్ బౌలింగులో అవుట్ అయ్యాడు. అశ్విన్ తో కలిసి 199 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

ఆ తర్వాత సెంచరీ హీరో అశ్విన్ కూడా ఒంటరిగా పోరాడి 113 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. తను 133 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్ ల సాయంతో 113 పరుగులు చేశాడు. అనంతరం ఆకాశ్ దీప్ (17) కాసేపు మెరిపించాడు. తర్వాత బుమ్రా (7) వెంటనే అయిపోయాడు. సిరాజ్ ఎప్పటిలా నాటౌట్ గా నిలిచాడు. మొత్తానికి టీమ్ ఇండియా 91.2 ఓవర్లలో 376 పరుగులకు ఆలౌట్ అయ్యింది.


బంగ్లాదేశ్ బౌలింగులో హసన్ మహమూద్ 5, తస్కిన్ అహ్మద్ 3, నహిద్ రాణా, మెహిదీ హాసన్ చెరో వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్ లంచ్ కి ముందు  26 పరుగులకి 3 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు షద్మాన్ (2), జకీర్ హాసన్ (3), మోమినల్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్ పరిస్థితి కూడా .ఇండియాలాగే ఉంది. స్టార్టింగులో తడబడుతూ ఆడుతోంది. లంచ్ తర్వాత మరేమైనా పుంజుకుంటుందేమో చూడాలి. టీమ్ ఇండియాకి తొలి వికెట్ బ్రేక్ బుమ్రా ఇస్తే, వెంటవెంటనే 2 వికెట్లు ఆకాశ్ దీప్ తీసి.. జట్టులో ఉత్సాహాన్ని పెంచాడు.

టీమ్ ఇండియా బౌలర్ల ధాటికి బంగ్లాదేశ్ విలవిల్లాడుతోంది. ఒకరి తర్వాత ఒకరు క్యూ కడుతున్నారు. టీ బ్రేక్ సమయానికి బంగ్లాదేశ్ 8 వికెట్ల నష్టానికి 112 పరుగులతో ఎదురీదుతోంది. ఇంకా 264 పరుగుల వెనుకపడి… ఫాలో ఆన్ గండంవైపు వేగంగా పరుగులు తీస్తోంది.

రెండో రోజు ఆట మొదలైన వెంటనే పిచ్ బౌలర్లకు స్వర్గధామంలా కనిపించింది. 339 పరుగులతో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమ్ ఇండియా కేవలం 37 పరుగులు మాత్రమే జోడించి 376 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

Also Read: తనే నన్ను ఆడించాడు: సెంచరీ హీరో అశ్విన్

అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్ వడివడిగా వికెట్లు కోల్పోయింది. టీ బ్రేక్ సమయానికి 8 వికెట్ల నష్టానికి 112 పరుగులతో గడ్డు పరిస్థితిలో పడిపోయింది. టీమ్ ఇండియా ప్రధాన ఆయుధం బుమ్రా తొలి వికెట్ తీసి శ్రీకారం చుట్టాడు. అలా తను 6.5 ఓవర్లు వేసి 3 వికెట్లు తీసి ఇండియాకి బ్రేక్ ఇచ్చాడు.

అనంతరం కొత్త బౌలర్ ఆకాశ్ దీప్ కూడా 5 ఓవర్లు వేసి 3 ప్రధాన వికెట్లు తీశాడు. అనంతరం సిరాజ్ 1 వికెట్ తీశాడు. రవీంద్ర జడేజా 2 వికెట్లు తీసి.. మొత్తానికి బంగ్లాదేశ్ నడ్డి విరిచాడు.

అయితే సెంచరీ హీరో రవిచంద్రన్ అశ్విన్ కు మాత్రం 9 ఓవర్లు వేసినా వికెట్ దక్కలేదు. కెప్టెన్ రోహిత్ శర్మ తనకి కూడా ఒక వికెట్ రావాలని పదే పదే బౌలింగు ఇచ్చాడు. అయితే బ్యాటింగ్ ఎక్కువగా చేయడం వల్ల అలసిపోవడంతో సరైన దిశలో బౌలింగు చేయలేకపోతున్నాడని కామెంటేటర్లు వ్యాఖ్యానిస్తున్నారు.

రెండో రోజు రెస్టు దొరికితే.. మూడోరోజు నుంచి అశ్విన్ విజ్రంభిస్తాడని కూడా చెబుతున్నారు. అయితే టీమ్ ఇండియాకి తొలి ఇన్నింగ్స్ లో భారీ ఆధిక్యం లభించేలా ఉంది. టీమ్ ఇండియా టార్గెట్ 376 కి…
200 పరుగుల తేడాతో అంటే.. బంగ్లాదేశ్ ని గానీ 175కి ఆలౌట్ చేస్తే…ఆటోమేటిక్ గా ఫాలో ఆన్ లో పడిపోతుంది.

అప్పుడు మళ్లీ వెంటనే బంగ్లాదేశ్ ని సెకండ్ బ్యాటింగ్ కి పంపించి…అప్పుడు బ్యాలన్స్ ఉన్న 200 పరుగుల లోపు ఆలౌట్ చేస్తే.. టీమ్ ఇండియా ఘన విజయం సాధించినట్టే అనుకోవాలి. ఒకరకంగా బంగ్లాదేశ్ ఇదే తీరులో ఆడితే మూడో రోజే మ్యాచ్ ఫలితం తేలిపోయేలా కనిపిస్తోంది.

Related News

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Big Stories

×