RBI issued a new update regarding 2000 rupee notes..notes worth Rs 7,261 crore are still with the public: వెయ్యి రూపాయల నోట్లు రద్దు చేశాక వాటి స్థానంలో రెండు వేల రూపాయలను ప్రవేశపెట్టింది కేంద్రం. అయితే వెయ్యి రూపాయల నోట్లను ఎక్కడికక్కడ బ్లాక్ చేసేయడంతో ద్రవ్యచలామణీ తగ్గిపోయింది. వెంటనే పొరపాటు తెలుసుకున్న కేంద్రం రెండు వేల నోట్లను కూడా రద్దు చేసింది. అయితే కొంత పీరియడ్ ఇచ్చింది కూడా. ఇప్పుడు ఆ టైమ్ కూడా అయిపోంది. అయితే ఇప్పటిదాకా రెండు వేల రూపాయలను తిరిగి ఆర్బీఐ స్వీకరించింది. అయితే ఇప్పటిదాకా 97.96 శాతం మాత్రమే రెండు వేల నోట్లు తమ బ్యాంకుకు చేరాయని ఆర్బీఐ పేర్కొంది. ఇంకా ఏడు వేల రెండు వందల అరవై ఒక్క నోట్లు జనం నుంచి రావాలని తెలిపింది.
రెండు వేల నోట్ల చలామణి రద్దు
గత ఏడాది మే నెలలో రెండు వేల నోట్ల చలామణి నిలిపివేస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే రెండు వేల నోట్లు కేవలం ఆర్బీఐ లోనే తీసుకుంటామని తెలపడంతో ఇప్పటిదాకా 97 శాతంనోట్లు మాత్రమే తిరిగి వచ్చాయని ఆర్బీఐ తెలిపింది. అయితే రెండు వేల నోట్లు బ్యాంకులలో మార్చుకునే గడువు గత ఏడాది అక్టోబర్ తో ముగిసిపోయింది. కేవలం అప్పటినుంచి ఆర్బీఐ శాఖలలోనే రెండు వేల నోట్ల మార్పిడి జరుగుతోంది. పోస్టాఫీసు నుండి కూడా ఆర్బీఐకి రెండు వేల రూపాయలను ట్రాన్స్ ఫర్ చేసుకునే సదుపాయం కల్పించింది.